For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీమోథెరపీ వలన కలిగే 15 సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

|

క్యాన్సర్ ను గుర్తించిన తరువాత రోగులకు కీమోథెరపీ ట్రీట్మెంట్ ను వైద్యులు సూచిస్తారు. ఈ కీమోథెరపీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ లలో ఒక రకమైన విధానం. ప్రతి ఒక్కరూ కీమోథెరపీ అనే పదాన్ని వినే ఉండుంటారు. అయితే, ఈ ట్రీట్మెంట్ క్యాన్సర్ ను రూపుమాపడంతో పాటు శరీరానికి కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.

శరీరంలో వేగంగా వ్యాప్తిచెందుతున్న క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడానికి అనేక డ్రగ్స్ ను కీమోథెరపీ ట్రీట్మెంట్ లో భాగంగా వాడతారు. అయితే, క్యాన్సర్ నుంచి విముక్తిని అందించే ఈ ఉపయోగకరమైన డ్రగ్స్ అనేవి క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన సెల్స్ పై కూడా దుష్ప్రభావం చూపుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలి.

దీని వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. అంతేకాక, ఈ దుష్ప్రభావాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా కనిపిస్తాయి. వయసు, ఆరోగ్యస్థితి వంటి ఫ్యాక్టర్స్ తో పాటు కీమోథెరపీ విధానం వంటి వాటి వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత ఆధారపడి ఉంది.

Did You Know These 15 Serious Side-Effects Of Chemotherapy

కీమో ట్రీట్మెంట్ పూర్తవగానే సైడ్ ఎఫెక్ట్స్ లో ఎక్కువ శాతం అనేవి త్వరగా తగ్గిపోతాయి. అయితే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం కీమో ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత కూడా కొనసాగుతాయి. కొన్ని దుష్ప్రభావాలు మొండిగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కష్టతరమే.

మీరెటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో వైద్యునితో చర్చించడం అవసరం. కీమోథెరపీ సమయంలో మీ శరీరం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతుందో వైద్యునికి తెలిపితే వైద్యులు డొసేజ్ లో తగిన మార్పులను తీసుకురావచ్చు లేదా కీమోథెరపీ విధానాన్ని మార్చవచ్చు.

1.చర్మ సమస్యలు:

1.చర్మ సమస్యలు:

దాదాపు 60 నుంచి 80 శాతం వరకు కీమోథెరపీ ట్రీట్మెంట్ ను అందుకున్న రోగులు క్యుటేనియస్ టాక్సిసిటీ కి లోనవుతారు. ఈ సమస్య కొన్ని సార్లు ట్రీట్మెంట్ లో వాడిన డ్రగ్స్ యొక్క డోస్ కి సంబంధించినది. చర్మం పొడిబారటం, గోరుచుట్టు, చర్మంపై ర్యాషెస్, ప్రురిటస్, మ్యూకోసిటిస్ తో పాటు శిరోజాలకు సంబంధించిన సమస్యలను గమనించవచ్చు.

2. హెపటోటాక్సిసిటీ:

2. హెపటోటాక్సిసిటీ:

కీమోథెరపీలో వాడిన కొన్ని డ్రగ్స్ అనేవి లివర్ పనితీరును తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం కలదు. ఈ విధమైన డ్రగ్స్ అనేవి శరీరంలోని టాక్సిసిటీను విపరీతంగా పెంచుతాయి. లివర్ సామర్థ్యానికి మించి టాక్సిన్స్ శరీరంలో పేరుకుంటాయి. అందువలన, లివర్ డేమేజ్ జరిగే ప్రమాదం ఉంది.

 3.ఆలోపేసియా:

3.ఆలోపేసియా:

కీమోథెరపీ వలన ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఎక్కువ. కీమోథెరపీ ట్రీట్మెంట్ ను తీసుకున్న రోగులు బట్టతల (ఆలోపేసియా)కి గురవ్వడం జరగవచ్చు. హెయిర్ లాస్ సమస్యను దృష్టిలో ఉంచుకుని చాలా మంది పేషంట్స్ కీమోథెరపీను తీసుకోవడానికి నిరాకరిస్తారు. కీమోథెరపీ వలన కలిగిన ఆకస్మిక హెయిర్ ఫాల్ అనేది ఆ వ్యక్తి యొక్క అందాన్నే కాదు అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను కూడా తగ్గిస్తుంది.

4. థ్రోంబోసిటోపినియా:

4. థ్రోంబోసిటోపినియా:

కీమోథెరపీ వలన కలిగే మరొక్క సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఇది. ఈ స్థితిలో ప్లేటిలెట్ కౌంట్ తక్కువగా నమోదవుతుంది. ట్రీట్మెంట్ సమయంలో ప్లేటిలెట్ కౌంట్ అనేది 30,000 కంటే తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్ పై ప్రభావం చూపుతుంది. అందువలన, రక్తస్రావం ఎక్కువ సేపు కొనసాగే ప్రమాదం ఉంది.

5. ఆక్యులర్ టాక్సిసిటీ:

5. ఆక్యులర్ టాక్సిసిటీ:

కొన్ని సార్లు కీమోథెరపీ అనేది ఆప్టిక్ నెర్వ్స్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దాంతో, డ్రై ఐస్, గ్లకోమా మరియు రెటీనల్ డేమేజ్ సమస్యలు తలెత్తవచ్చు.

 6. గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎఫెక్ట్స్:

6. గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎఫెక్ట్స్:

ఈ సమస్యలో వాంతులు, మలబద్దకం, డయేరియా మరియు వికారం ఎదురవుతాయి. ఇవన్నీ, కీమోథెరపీ ట్రీట్మెంట్ కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అయినప్పటికీ వీటి తీవ్రత పెరగడం వలన (మలంలో రక్తం, సాఫ్ట్ స్టూల్) మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

7. హెమోరెహజిక్ సిస్టిటిస్:

7. హెమోరెహజిక్ సిస్టిటిస్:

ఇది కీమోథెరపీకి సంబంధించిన ఇంకొక సైడ్ ఎఫెక్ట్. ట్రీట్మెంట్ సమయంలో ఈ సమస్య ఎదురవవచ్చు. లేదా ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత ఈ సమస్యకు గురికావచ్చు. జఘన నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట, మైక్రోస్కోపిక్ హెమటోరియా, గ్రాస్ హెమటోరియా మరియు అర్జెన్సీ అనేవి ఈ సమస్యకు సంబంధించిన కొన్ని లక్షణాలు.

8. మ్యూకోసిటిస్ (నోటి పుళ్ళు):

8. మ్యూకోసిటిస్ (నోటి పుళ్ళు):

కీమోథెరపీలో అలాగే రేడియేషన్ థెరపీలో సర్వసాధారణంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్ ఇది. కొన్ని సార్లు, ఈ సమస్య తీవ్రంగా ఉండవచ్చు. రోగికీ రోగికీ మధ్య ఈ సమస్య లక్షణాల్లో తేడా ఉండవచ్చు. నోటి పుండ్ల వలన ఆహారాన్ని తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. అందువలన, దీనిని సీరియస్ సైడ్ ఎఫెక్ట్ గా పరిగణించవచ్చు.

9. అనీమియా:

9. అనీమియా:

అనీమియా వలన విపరీతమైన అలసట అలాగే మగత సమస్యలు ఎదురవుతాయి. ఇవి కీమోథెరపీ వలన ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్. కీమోథెరపీ అనేది శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ను డేమేజ్ చేస్తుంది. అందువలన, అనీమియా సమస్య తలెత్తుతుంది. కీమోథెరపీ ట్రీట్మెంట్ ను తీసుకున్న రోగులలో దాదాపు 70 శాతం మంది అనీమియా బారిన పడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి.

10. కాగ్నిటివ్ ఛేంజెస్:

10. కాగ్నిటివ్ ఛేంజెస్:

కీమో థెరపీ వలన ఎదురయ్యే ఇంకొక భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ మెమరీ లాస్. కొన్ని సార్లు ట్రీట్మెంట్ తరువాత పేషంట్స్ లో ఏకాగ్రత లోపం తలెత్తుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత కొంతకాలం పాటే ఉన్నా, పేషంట్ పై ఇవి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తాయి.

11. నెఫ్రాటాక్సిసిటీ:

11. నెఫ్రాటాక్సిసిటీ:

కీమోథెరపీలో వాడే కొన్ని పదార్థాల వలన కిడ్నీ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువలన, కిడ్నీలు బలహీనపడవచ్చు. విసర్జన అలాగే డ్రగ్ మెటాబాలిజంపై కీమోథెరపీ దుష్ప్రభావం చూపడం వలన శరీరంలో టాక్సిసిటీ పేరుకుపోతుంది. అందువలన, అనేక ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కీమోథెరపీ వలన కిడ్నీ పనితీరు పై దుష్ప్రభావం కలగటం వలన ఇవన్నీ జరుగుతాయి.

12. కార్డియోటాక్సిసిటీ:

12. కార్డియోటాక్సిసిటీ:

కీమోథెరపీకి సంబంధించిన ఇంకొక్క సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఇది. కీమోథెరపీ ట్రీట్మెంట్ ప్రారంభ దశలో లేదా చివరి దశలో ఈ సమస్య తలెత్తవచ్చు. కొన్ని సార్లు దీని ప్రభావం మైల్డ్ గా ఉండవచ్చు, బ్లడ్ ప్రెషర్ లో మార్పులు తలెత్తవచ్చు. తీవ్రరూపం దాల్చితే హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చు.

13. విపరీతమైన అలసట:

13. విపరీతమైన అలసట:

విపరీతమైన అలసటకు గురవటం అనేది కీమోథెరపీ ట్రీట్మెంట్ వలన ఎదురయ్యే మరొక సీరియస్ సైడ్ ఎఫెక్ట్. కీమోతో పాటు క్యాన్సర్ కు సంబంధించిన ఎన్నో ఫ్యాక్టర్స్ వలన విపరీతంగా అలసటకు గురవుతారు. డిప్రెషన్ కు లోనవుతారు. రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గుతుంది. నిద్రలేమి సమస్య వేధిస్తుంది.

14. ఫెర్టిలిటీ సమస్యలు:

14. ఫెర్టిలిటీ సమస్యలు:

క్యాన్సర్ పేషంట్స్ కు ట్రీట్మెంట్ లో భాగంగా కొన్ని థెరపీలను ఇవ్వడం వలన వారిలో ఇంఫెర్టిలిటీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే, గర్భిణీలకు కీమోథెరపీను సాధారణంగా సూచించరు. కీమో ట్రీట్మెంట్ తరువాత కొంతమంది మహిళలు శాశ్వతంగా ఇంఫెర్టిలిటీ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మరికొంతమంది తాత్కాలికంగా ఇంఫెర్టిలిటీకు గురవుతారు. పురుషులలో, కీమో థెరపీలో వాడే కొన్ని డ్రగ్స్ వలన స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో, స్పెర్మ్ డేమేజ్ జరిగే ప్రమాదం కూడా ఉంది.

15. లైంగిక అసమర్థత:

15. లైంగిక అసమర్థత:

కీమోథెరపీ అనేది మహిళల్లో అలాగే పురుషుల్లో లిబిడోను పెంచుతుంది. ఇది ఈ ట్రీట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్.

English summary

Did You Know These 15 Serious Side-Effects Of Chemotherapy

There can be some reactions as well as possible side effects whenever a patient undergoes chemotherapy. All medical professionals should acquaint themselves with the number of adverse effects that are likely to be caused by the administration of particular agents. Some of the most serious side effects of chemotherapy are anemia, fatigue, sexual dysfunction, etc.
Story first published: Wednesday, July 4, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more