For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరస్థీషియా సమస్య సంకేతాలు, కారణాలు చికిత్సా పద్దతుల గురించిన పూర్తి వివరాలు

పెరస్థీషియా సమస్య సంకేతాలు, కారణాలు చికిత్సా పద్దతుల గురించిన పూర్తి వివరాలు

|

మీరు పెరస్థీషియాతో భాధపడుతున్నారా? వ్యాధికి సంబంధిచిన సంకేతాలు, కారణాలు చికిత్సా పద్దతుల గురించిన వివరాలు గురించి తెలుసుకోండి.

మీరెప్పుడైనా మీ అంగ ప్రదేశంలో జలదరింపు, స్పర్శ రహితంగా ఉండడం లేదా ఒకరకమైన నొప్పి భావనను అనుభావించారా ? దీని వెనుక సరైన కారణం తెలీక సతమతమవుతూ ఉన్నారా ? బహుశా, పెరస్థీషియా సమస్యకు గురై ఉండవచ్చు. ఈ పెరస్థీషియాకు అనేక రకాల పరిస్థితులు కారణమవుతుంటాయి. కానీ సమస్యలు కొన్ని తాత్కాలికంగా ఉంటే, కొన్ని మాత్రం శాశ్వతంగా పీడిస్తుంటాయి. ఒక్కోసారి, ప్రాణాంతకంగా కూడా మారుతుంటాయి.

Do You Suffer From Paresthesia? Here Are The Symptoms, Causes & Treatment

పెరస్థీషియాతో యొక్క లక్షణాలు :

• తిమ్మిరి

• స్పర్శ లేకపోవడం

• జలదరింపు

• కోల్డ్

• బలహీనత

పెరస్థీషియాలోని రకాలు:

1. తాత్కాలిక పెరస్థీషియా:

దాదాపుగా మన చేతులు, కాళ్ళు, అర చేతులు, అరి కాళ్ళు వంటి ప్రదేశాల్లో తరచుగా నిద్రాణ వ్యవస్థ ఏర్పడడం అనగా స్పర్శరహితంగా మారడం. భిన్నమైన సంచలనాన్ని అనుభవించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా నిద్రలో లేదా ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండడం మూలాన ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఇక్కడ, మనం తెలియకుండా నరాలమీద ఒత్తిడి తెచ్చిన కారణాన ఈ సంచలనం వస్తుంటుంది. మనం శరీరస్థితిని తరచూ మార్చడం ద్వారా నరాల ఒత్తిడి తొలగి సమస్య సద్దుమణుగుతుంది. దీనికి ఎటువంటి చికిత్స అవసరం లేదు. ఒక్కోసారి బలహీనత కూడా సమస్య కావొచ్చు. సరైన ఆహారప్రణాళిక, జీవనశైలి మార్పులు మరియు వైద్యుని సంప్రదించి బలానికి మందులు తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.


2. శాశ్వత పెరస్థీషియా:

మీరు శాశ్వత పెరస్థీషియాతో బాధపడుతున్నట్లయితే, మీ అవయవాలను కదిలించడంలో కష్టపడటంతో పాటు అంగంవద్ద తీవ్రమైన పరిస్థితిని కలిగి ఉంటారు. మీరు ఈ పరిస్థితి యొక్క లక్షణాలను సుదీర్ఘకాలం కలిగిఉన్నట్లుగా మీకు అనిపిస్తే, తక్షణ చికిత్స కోసం నరాల సంబంధిత వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది.

నరాల నష్టం రకాలు:

రెండు రకాల నరాల నష్టాలు ప్రధానంగా ఉన్నాయి: రేడిక్యులోపతీ మరియు న్యూరోపతీ.

1. రేడిక్యులోపతీ: వెన్నులోని నాడి అసమతుల్యత కారణంగా నొప్పి, తిమ్మిరి మరియు బలహీనత వంటి వివిధ లక్షణాలు సంభవిస్తుంటాయి. ఈ లక్షణాలు సంభవించినప్పుడు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నరములు సరిగా పనిచేయకపోవచ్చు.

ఈ రకమైన నరాలనష్టం కారణంగా, వెన్నుపూస నుండి బయటికి వచ్చే నరాల దగ్గర లేదా వాటి సమీపంలో ఎక్కువ నష్టం జరుగుతుంది. నొప్పి తరచూ ఆ నరాలకు సంబంధించిన శరీరభాగాలకు సంబంధించిన అవయవానికి వెళుతుంటుంది.

వెన్నెముకలోని ప్రతి భాగం ఒక నిర్దిష్ట పేరుని కలిగి ఉండి, ఒక ప్రత్యేకమైన పనికి కేటాయించబడి ఉంటాయి:

- మెడ ప్రాంతం - ఇది గర్భాశయ సంబంధిత వెన్నెముక

- థొరాసిక్ వెన్నెముక, ఇది వీపు మధ్యన ఉంటుంది.

- నడుము వెన్నెముక, లేదా వెన్నెముక దిగువభాగం

- వెన్నెముకను, పిరుదుల భాగాన్ని కలిపే “సాక్రం”.

- కాక్కీక్స్ లేదా టెయిల్బోన్

రేడిక్యులోపతి కారణాలు:

రేడిక్యులోపతి ప్రాథమిక కారణాలు గురించిన వివరాలు:

హెర్నియేటెడ్ డిస్క్: పరిధిని మించి, డిస్క్ భాగం చొచ్చుకుని వచ్చి, బాహ్యభాగానికి తగులుతున్న సందర్భంలో ఈ పరిస్థితి నెలకొంటుంది.స్పైనల్ స్టెనోసిస్: ఇది వెన్నుపూస ద్వారా నడుస్తూ, వెన్నుపామును జతచేస్తుంది క్రమంగా వెన్నెముక కాలువ/ద్వారం సంకుచితంగా మారుతున్నట్లు కనిపిస్తుంది.

ఫోరామినల్ స్టెనోసిస్: నరముల మొదలుభాగం ఇరుకైన ద్వారాల గుండా నడుస్తుంది, ఈ పరిస్థితిని ఫోరామినల్ స్టెనోసిస్ అని పిలుస్తారు.

డిజెనరేటివ్ డిస్క్ సమస్య: మీ వెన్నెముక డిస్కులలో జరుగుతున్న సాధారణ మార్పులు నొప్పికి దారితీసినప్పుడు, దీనిని డిజెనరేటివ్ డిస్క్ వ్యాధిగా సూచిస్తారు.

బోన్ స్పర్స్: బోన్ స్పర్స్, ఎముక అంచుల నుండి అభివృద్ధి చెందుతున్న అస్థి అంచనాలను సూచిస్తాయి. ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ద్వారా కలుగు కీళ్ళనొప్పులతో ఉమ్మడి సంబంధం, బోన్ స్పర్స్ సమస్యకు ప్రధాన కారణం.

1.రేడిక్యులోపతి చికిత్స:

ఈ రకమైన నరాల నష్టాన్ని సాధారణంగా ఏ శస్త్రచికిత్స లేకుండా మరియు సాధారణ మందుల సహాయంతోనే చికిత్స చేయవచ్చు:

• ఇంజెక్షన్ స్టెరాయిడ్స్ లేదా ఓరల్(నోటి ద్వారా) కార్టికోస్టెరాయిడ్స్

• ఇబూప్రోఫెన్, ఆస్పిరిన్, మొదలైన నాన్ - స్టెరాయిడ్ మందులు

• ఐస్ మరియు వేడి తాపడం

• ఫిజియో చికిత్స

• సాఫ్ట్ సెర్వికల్ కాలర్

• నార్కోటిక్ నొప్పికి సూచించే మందులు

రేడిక్యులోపతి నివారణ:

• క్రమంతప్పని శారీరక శ్రమ లేదా వ్యాయామం

• మంచి భంగిమను నిర్వహించడం

• వస్తువులను ఎత్తునప్పుడు జాగ్రత్త వహించడం

• తరచుగా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం

2. నరాలవ్యాధి లేదా న్యూరోపతి :

దీర్ఘకాలికమైన మోటార్ మరియు జ్ఞానేంద్రియ నరాలనష్టాల వలన ఇది సంభవిస్తుంది. శాశ్వత నరాలనష్టం అనేది శాశ్వత తిమ్మిరికి కూడా కారణం కావచ్చు. రక్తంలోని అధిక చక్కెరలు లేదా హైపర్గ్లైసీమియా నరాలనష్టం ఈ రకమైన సమస్యకు ప్రధానకారణంగా ఉంటుంది.

న్యూరోపతీ సంబంధిత సమస్యకు గల కారణాలు:

• కణితి లేదా ట్రౌమా

• కాలేయ వ్యాధులు

• మూత్రపిండ సంబంధిత వ్యాధులు

• స్ట్రోక్

• విటమిన్ డి అధిక వినియోగం

• శరీరంలో నియాసిన్ నిక్షేపాలు లేకపోవడం

• హైపోథైరాయిడిజం

• ట్యూమర్

• ఎయిడ్స్ వ్యాధి, లైమ్ వ్యాధి మరియు ఇతర అంటువ్యాధులు

• వివిధ రకాల మందులు

నరాలవ్యాధి లేదా న్యూరోపతి చికిత్స:

సరిగ్గా మందులు తీసుకోవడం, ఈ స్థితిని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది, అంతేకాని ఈ పరిస్థితికి నివారణ అంటూ లేదు.

నాడీమాడ్యులేషన్ లేదా శస్త్రచికిత్స: న్యూరోమాడ్యులేషన్ అనేది నాడీ ప్రేరణను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక “ప్రేరణ పరికరం” యొక్క ఉపయోగాన్ని సూచిస్తుంది. ఈ పరికరాన్ని సాధారణంగా రోగిలో శస్త్రచికిత్స ద్వారా అమర్చబడుతుంది. ఎక్కడైతే తక్కువ నరాల చర్యలు ఉంటాయో అక్కడ ఈ పరికరం నరాలను ఉద్దీపనకు గురిచేసి, పనిచేసేలా ప్రేరేపిస్తుంది.

ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ మరియు ఎసిటమైనోఫేన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణ మందులు సూచించబడ్డాయి.

న్యూరోపతీ లేదా నరాల వ్యాధి నివారణ :

• మంచి జీవనశైలి

• విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం.

• మద్యపానాన్ని దూరం చేయడం

• ఊబకాయం తగ్గించుకోవడం.

• ఆరోగ్యకరమైన ఆహారనియమావళి

• శరీరంలో విషతుల్య రసాయనాల నివారణ

• సరైన పని

• యోగ మరియు ఉపశమన పద్ధతులు కూడా భౌతిక మరియు నరాలనష్టం, భావోద్వేగ లక్షణాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Do You Suffer From Paresthesia? Here Are The Symptoms, Causes & Treatment

Paresthesia is the numbing, burning or tingling sensation you sense in your limbs due to unknown reasons. It is of two types - temporary & permanent. The temporary paresthesia in which our limbs become numb or "fall asleep" normalizes in no time as we change our body's position. One faces piercing pain
Story first published:Monday, August 20, 2018, 10:38 [IST]
Desktop Bottom Promotion