For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రపోతున్నప్పుడు చొంగ కారుస్తున్నారా? ఇలా చేస్తే సరి

నిద్రపోతున్నప్పుడు చొంగకారే అలవాటు ఉండడం సర్వసాధారణమైన విషయం. దాని గురించి ఆందోళన అవసరం లేదు. ద్ర పోయేటప్పుడు చొంగ కార్చుకోవడం, చొంగ కార్చుకోవడం ఆపడం ఎలా.

|

నిద్రపోతున్నప్పుడు చొంగకారే అలవాటు ఉండడం సర్వసాధారణమైన విషయం. దాని గురించి ఆందోళన అవసరం లేదు. కానీ మీ ముఖం మరియు దిండుపై వికారంగా చొంగ కారడం ముఖ్యంగా మీరు వేరొకరి స్థలంలో ఉంటున్న సమయంలో ఈ రకమైన అలవాటు అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటుంది.

how do i stop myself from drooling in my sleep

ఈ చొంగ కారడం అనే అలవాటు సాధారణంగా అనేకమందిలో, ఘాడ నిద్రలో ఉన్న సమయంలోనే జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ ముఖ కండరాలు పూర్తిగా సడలింపబడి ఉండడమే దీనికి కారణం. కానీ ఈ అలవాటుకు శాశ్వత పరిష్కారం దిశగా అనేక ఇంటి నివారణా పద్దతులు కూడా ఉన్నాయి. ఈ పద్దతులను పాటించడం మూలంగా ఈసారి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండగలరు.

1. ఉసిరి పొడి

1. ఉసిరి పొడి

ఈ రోజు మనం ఉసిరి పొడి(ఆమ్లా పౌడర్) గురించి మాట్లాడుకోబోతున్నాము, ఇది కడుపులోని ఆమ్ల స్థాయిల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడమే కాకుండా, నెమ్మదిగా చొంగ కారే అలవాటును కూడా దూరం చేస్తుంది. మిగిలిన సమయాలలో కన్నా, భోజనం తర్వాత గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కలిపి తీసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

తద్వారా కడుపులోని ఆమ్లాలు సరైన మోతాదులో పర్యవేక్షించబడి, ఆమ్లాల హెచ్చుతగ్గులు క్రమబద్దీకరించబడి, నెమ్మదిగా చొంగ కారే లక్షణం తగ్గుముఖం పడుతుంది. ఈ వైద్యం ఒక వయసు పిల్లల నుండి పెద్దవారి దాకా ఎవరైనా అనుసరించవచ్చు. మరియు ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా, ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.

2. దాల్చిన చెక్కతో చేసిన టీ

2. దాల్చిన చెక్కతో చేసిన టీ

ఒకవేళ మీకు ఉసిరి పొడి పద్దతి నచ్చకుంటే మరొక గృహవైద్యం కూడా అందుబాటులో ఉంది. అదే దాల్చిన చెక్కతో చేసిన టీ. ఇది అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది కూడా. ఇది కూడా అధిక లాలాజలతను నియంత్రిస్తుంది, నెమ్మదిగా చొంగ కారే లక్షణాన్ని నివారిస్తుంది. ఇక్కడ మీకు కావలసిందల్లా 1 కప్పు నీరు, తేనె 2 టీస్పూన్లు మరియు దాల్చినచెక్క పొడి 1/4 టీస్పూన్.

3. పుదీనా లేదా తులసి ఆకులు

3. పుదీనా లేదా తులసి ఆకులు

మొదటగా దాల్చిన చెక్కను పొడిగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ లో నీటిని తీసుకుని, అందులో దాల్చిన చెక్క పొడిని కలిపి 10, 15 నిమిషాల పాటు బాగా మరగబెట్టండి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి ఒక గ్లాసులోనికి తీసుకున్న పిదప, అందులో 2స్పూన్ల తేనెను జోడించి సేవించండి. ఒకవేళ ఇంకా రుచిని కోరుకున్న నేపద్యంలో, పుదీనా లేదా తులసి ఆకుల మిశ్రమాన్ని కూడా జతచేయవచ్చు. ఈ పరిహారం కూడా చొంగకారే లక్షణాలను తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది.

4. వెల్లకిలా పడుకోండి

4. వెల్లకిలా పడుకోండి

నిద్రకు ఉపక్రమించే ముందు, వెల్లకిలా పడుకునే అలవాటు చేస్కొండి. ఈ అలవాటు నిద్ర సజావుగా సాగుటకు సహాయం చేస్తుంది. మరియు ఎక్కువ చక్కెరలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవడం కూడా నెమ్మదిగా తగ్గించాలి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్యసంబంధ విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

drooling in sleep all you need to know

Medically, drooling is termed as sialorrhea (excessive saliva production) which is generally seen in infants while teething and sometimes in children with muscular problems and behavorial and neurological conditions like cerebral palsy.
Story first published:Tuesday, June 12, 2018, 15:28 [IST]
Desktop Bottom Promotion