For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎటువంటి డ్రగ్స్ వాడకుండానే వంద్యత్వ సమస్యల నుండి బయటపడవచ్చా?

ఎటువంటి డ్రగ్స్ వాడకుండానే వంద్యత్వ సమస్యల నుండి బయటపడవచ్చా?

|

వంద్యత్వ మరియు అంగ స్థంభన సమస్యలకు, ఒత్తిడి ప్రధాన కారణమని మెడికల్ సైన్స్ నిర్ధారించింది. కానీ, అంగ స్థంభన సమస్య తరచుగా అధికంగా కనిపిస్తున్న ఎడల, ఇది అనేక అనారోగ్య పరిస్థితులను సూచిస్తుందని చెప్పబడింది.

ఇటువంటి పరిస్థితులు వాస్తవానికి అనేకం, వంధ్యత్వానికి దారి తీయవచ్చు కూడా. అంగ స్థంభన యొక్క రకాలు గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈవ్యాసం దోహదపడుతుంది, ఇటువంటి సమస్య మీకున్నదని ఎలా గుర్తించాలి, మరియు ఈ సమస్యలను ఎలా నివారించాలి అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంగ స్థంభన యొక్క రకాలు :

అంగ స్థంభన యొక్క రకాలు :

నిజానికి వివిధరకాల అంగ స్థంభన లోపాలు ఉన్నాయని గుర్తించడం చాలా ముఖ్యం. మీ సమస్య కారకాలు, రకాల దృష్ట్యా మీవైద్యునితో సంప్రదింపులు జరిపి చికిత్స తీసుకోవడం ద్వారా మాత్రమే సరైన ఫలితాలను పొందగలరు. ఒక్కోసారి పరిస్థితులు చేదాటిన ఎడల, ఫలితాలు సక్రమంగా పొందలేకపోవచ్చు. దీనికి పలుకారణాలు కారకాలుగా ఉన్నాయి. వ్యసనాలు, మందులు సరిగ్గా వాడకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు మొదలైనవి.

1. ప్రాథమిక నపుంసకత్వము

1. ప్రాథమిక నపుంసకత్వము

ఇది సాధారణంగా నరాల బంధనం మూలంగా సంభవిస్తుంది. దీనిని పురుషాంగంలో భౌతిక అసమానత్వంగా చెప్పబడుతుంది. ఈ పరిస్థితిలో, ఒక వ్యక్తి తన జీవితంలో లైంగిక సంభంధం ఎన్నటికీ కలిగిఉండలేడు. కానీ పగటిపూట మార్నింగ్ ఎరెక్షన్స్ మాత్రం కలిగి ఉంటాడు.

2. రెండవదశ నపుంసకత్వము

2. రెండవదశ నపుంసకత్వము

గతంలో ఎటువంటి సమస్యలు లేకపోయినా, కొన్ని ప్రత్యేకించిన కారణాల చేత అనుకోకుండా అంగస్థంభన సమస్యలకు గురై ఉంటారు. క్రమంగా లైంగిక పటుత్వాన్ని కోల్పోతుంటారు. కొన్ని సందర్భాల్లో, లైంగిక సంబంధాన్ని ఆస్వాదిస్తున్నా, గతంకన్నా కాస్త తక్కువగానే ఉండడం గమనించవచ్చు.

3. పాక్షిక నపుంసకత్వము

3. పాక్షిక నపుంసకత్వము

అంగస్థంభనలు కలుగుతున్నా కూడా, లైంగిక సుఖాన్ని అనుభవించలేని స్థితిని పాక్షిక నపుంసకత్వంగా పరిగణిస్తారు.

4. పరిస్థితుల దృష్ట్యా నపుంసకత్వము

4. పరిస్థితుల దృష్ట్యా నపుంసకత్వము

కొందరు పురుషులు కేవలం కొన్ని పరిస్థితులనందు మాత్రమే అంగ స్థంభనలు కలిగి ఉంటారు. ఉదాహరణకు హస్తప్రయోగంనందు స్థంభనలు కలిగి ఉన్నా కూడా, లైంగిక సంబంధంనందు కలిగి ఉండలేని స్థితిగా ఉంటుంది.

 5. పూర్తి నపుంసకత్వము

5. పూర్తి నపుంసకత్వము

పూర్తిగా అంగ స్థంభనలు ఆగిపోయిన స్థితిని పూర్తి నపుంసకత్వముగా పరిగణిస్తారు. కానీ మార్నింగ్ ఎరెక్షన్స్ మాత్రం సర్వసాధారణం.

అంగ స్థంభన లక్షణాలు :

అంగ స్థంభన లక్షణాలు :

ఇది దాని స్వభావం పరంగా స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అంగ స్థంభన అనేది లైంగిక సమస్య మరియు సాధారణంగా స్వీయనిర్ధారణ చేయదగినదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఒక వ్యక్తి తన పురుషాంగంలో కొద్దిగా వక్రతను గమనించవచ్చు కూడా. ఈ పరిస్థితి (పేరోనీ వ్యాధిగా పిలుస్తారు) అంగ స్థంభన యొక్క మొదటి లక్షణాలలో ఒకటిగా ఉండే అవకాశం ఉన్నది. అయినప్పటికీ, అంగ స్థంభనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటారని చెప్పడానికి లేదు. కొందరు వ్యక్తులు, ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారికి, పురుషాంగం యొక్క ధమనిలో వక్రత ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది అంగ స్థంభన యొక్క మరొక లక్షణం. ఏదేమైనప్పటికీ, దీర్ఘకాలిక కాలవ్యవధిలో కొనసాగే సెక్స్ డ్రైవ్ కూడా, అత్యంత సాధారణమైన అంగ స్థంభన లక్షణాలలో ఒకటిగా చెప్పబడింది.

ఎటువంటి డ్రగ్స్ వాడకుండానే వంద్యత్వ సమస్యల నుండి బయటపడవచ్చా?

ఎటువంటి డ్రగ్స్ వాడకుండానే వంద్యత్వ సమస్యల నుండి బయటపడవచ్చా?

ఈ పరిస్థితిని చికిత్స చేయడానికి మార్గాలు:

కొన్ని ఔషధాల వినియోగం (ఎపిలెప్సీ, డిప్రెషన్, ఆందోళన, థైరాయిడ్ సమస్యలు ఇతరములైన ఆరోగ్య సమస్యలకు తీసుకునే మందులు ముఖ్యంగా) కారణంగా కూడా ఈ సమస్యలు తలెత్తుతుంటాయి. పరిస్థితుల ప్రభావాల దృష్ట్యా, మందులను తగ్గించడం లేదా ఆపివేయడం వంటి చర్యల ద్వారా ఈ పరిస్థితినుండి కొంచం బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈ పరిస్థితి ఎదుర్కునే క్రమంలో ప్రజలు తరచుగా అంగ స్థంభన ప్రేరేపించే మాత్రలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే పురుషాంగంలోకి డైరెక్ట్ ఇంజెక్షన్ కూడా చేసుకునే అలవాటు కలిగి ఉంటారు. కానీ ఈచర్యలు ఏరోజుకైనా ప్రమాదమే. పరిస్థితి చేయి దాటితే ప్రాణాలే హరించుకుని పోతాయి. అయితే, ఔషధాల వినియోగం లేకుండా కూడా అంగ స్థంభన సమస్యలు నివారించడం సాధ్యపడుతుంది.

ఔషదాలతో పనిలేకుండా అంగ స్థంభన చికిత్స ఎలా చేయాలి:

ఔషదాలతో పనిలేకుండా అంగ స్థంభన చికిత్స ఎలా చేయాలి:

ప్రతి ఆరోగ్య సమస్యకు ఔషధాలవైపుకు మొగ్గు చూపడం, క్రమంగా వాటి అధిక వినియోగం శరీరం మీద కొన్ని దుష్ప్రభావాలను స్పష్టంగా చూపగలవని తేలిన విషయమే. కావున కృత్రిమ ఔషధాల మీద ఆధారపడకుండా, సహజ సిద్దమైన పద్దతుల వైపు మొగ్గు చూపడం ద్వారా కొన్ని దుష్ప్రభావాలు లేని సానుకూల ఫలితాలను పొందగలరని చెప్పబడింది. అదృష్టవశాత్తూ అటువంటి పద్దతులు, ఈ సమస్యకు కూడా ఉండడం కాస్త సంతోషించదగ్గవిషయమే.

ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం :

ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం :

పురుషులలో తగినంత రక్త ప్రవాహం లేకపోవడంకూడా అనేక సందర్భాల్లో అంగ స్థంభన సమస్యలకు కారణంకాగలదు. ఈ పరిస్థితి నుండి అధిగమించడానికి, రోజువారీ ప్రణాళికలో భాగంగా 30-50 నిమిషాల కనీస వ్యాయామం కలిగి ఉండడం మంచిది. మరియు మీ ఆహారంలో ప్రోటీన్ నిక్షేపాలు తగినంత మోతాదులో ఉన్నాయని నిర్ధారించుకోండి. మరియు ఆకుపచ్చ కూరగాయలు , ఆకుకూరల రోజువారీ వినియోగం, మంచి ప్రోటీన్ నిక్షేపాలు కలిగిన మాంసం, చేపలు వంటివి ఆహార ప్రణాళికలో కలిగి ఉండడం ద్వారా కూడా అంగ స్థంభన సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

ధూమపానం మరియు మద్యపానం :

ధూమపానం మరియు మద్యపానం :

ధూమపానం మరియు మద్యపానం వంటి వ్యసనాలు ప్రధానంగా అంగ స్థంభన సమస్యలను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. వ్యసనాలు, లైంగిక పటుత్వాన్ని నాశనం చేయగలవు. కావున మీరు ఈ సమస్యలనుండి బయటపడాలని భావిస్తున్న ఎడల, మీరు ధూమపానాన్ని మరియు మద్యపానాన్ని పూర్తిగా త్యజించాలి. అలా కుదరని పక్షాన, తగ్గించే ప్రయత్నమైనా చేయాలి. ఇటువంటి వ్యసనాలు శారీరిక సమస్యలనే కాక, మానసిక సమస్యలు పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ధూమపానంలో ప్రత్యక్ష ధూమపానమే కాకుండా, పరోక్ష ధూమపానం, కాలుష్యకోరల జీవనం మొదలైనవి కూడా అంగస్థంభన సమస్యలు పెరగడానికి ఉన్న కారకాలు.

కావున సరైన ఆరోగ్య ప్రణాళికను పాటిస్తూ, వ్యాయామ సరళిని అవలంభిస్తూ, వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా అంగస్థంభన సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Erectile Dysfunction: Types, Symptoms and Treat without Medication

When a man doesn't get an erection or is unable to sustain it for long, he is said to be suffering from erectile function (ED). Primary impotence, secondary impotence, partial impotence & total impotence are the different types of EDs. It can be treated without medication by following a healthy diet & lifestyle & using methods like vacuum pumps & penis rings.
Story first published:Saturday, August 11, 2018, 11:28 [IST]
Desktop Bottom Promotion