For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి నీళ్ళలో బెల్లం + జీలకర్ర కలిపి ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే అద్భుత ఆరోగ్యప్రయోజనాలు

జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని వేడినీటిలో జోడించి ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి

|

మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటమే ఈ ప్రపంచానికి అలాగే మీ కుటుంబానికి మీరు ఇవ్వగలిగే గొప్ప కానుక అనే నానుడి ఆరోగ్యానికి సంబంధించిన ప్రాముఖ్యం గురించి చెప్పకనే చెబుతోంది.

ఈ సూక్తిని కాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆరోగ్యం విలువ అర్థమవుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంవలనే దగ్గరివారితో అలాగే ప్రియమైన వారితో సంతోషంగా గడపగలుగుతాము.

ఆరోగ్యకరమైన పౌరులు ఈ ప్రపంచ అభివృద్ధికి అనేకరకాల పాటుపడతారు.

jeera health benefits

జీరా ద్వారా కలిగే ఆరోగ్యప్రయోజానాలు

ప్రాణాంతకమైన వ్యాధులనేవి లేకపోతే ఈ లోకం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి,

హాస్పిటల్స్ పై అలాగే మందులపై అత్యధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించవలసిన పని ఉండదు. తద్వారా, ప్రజలందరూ తమ సొమ్మును ఆదా చేసుకుని ఆనందపడతారు.

అయినప్పటికీ, వాస్తవం ఏంటంటే వైద్యరంగంలో ఎన్ని రకాల పురోగతిని సాధించినా, ప్రజలలో ఆరోగ్యంపై ఎన్నిరకాలుగా అవగాహన కలిపించినా, ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

అవును, అనేక గణాంకాలు అలాగే సర్వేల ప్రకారం మన పూర్వీకులలో ఇప్పటిలా అనారోగ్య సమస్యలు ఉండేవి కావని తెలుస్తోంది. సహజసిద్ధమైన ఔషధాలపైన అలాగే మూలికా వైద్యంపైనా వారు ఆధారపడేవారు. ఇప్పటిలా ఆధునిక ఔషధాలనేవి అప్పట్లో అందుబాటులో లేవు. అయినా, వారు ఆరోగ్యంగా ఉండేవారు.

వాతావరణంలో సంభవించిన మార్పులు, కాలుష్యం అలాగే జీవనశైలి అలవాట్ల వలన ఇప్పటివారు అనేకరకాల ఆరోగ్యసమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈరోజుల్లో, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, విపరీతమైన పోటీతత్వంతో పాటు పని ఒత్తిడి, అనేవి అనారోగ్యాలను కలిగించే కొన్ని ప్రధాన కారణాలుగా భావించవచ్చు.

అలాగే, సరైన ఆహారనియమాలు పాటించకపోవడం, ఆహార ఉత్పత్తిలో వాడే పురుగుమందులు మరియు హార్మోన్లు అలాగే పొల్యూషన్ అనేవి ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి.

కాబట్టి, ఈ కారణాలన్నిటి వలన అనేక రకాల రోగాలకు ఎంతో మంది గురవుతున్నారు. చిన్నాపెద్దా అందరూ అనేక ఆరోగ్యసమస్యల బారిన పడుతున్నారు.

ఆధునిక ఔషధాలను ఎక్కువ కాలం వాడినట్లైతే అవి శరీరంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. అందువలన, నేచురల్ రెమెడీస్ పైనే ఆధారపడటం ముఖ్యం.

వేడినీటిలో జీలకర్రని బెల్లంతో కలిపి తాగితే ఈ 9 ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.

రెండు టీస్పూన్ల జీలకర్రని ఒక టీస్పూన్ బెల్లంతో కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసుడు వేడినీటిలో జోడించాలి. ఈ పానీయాన్ని పరగడుపునే అంటే బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు తీసుకోవాలి.

ఈ పానీయం తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

పొటాషియంతో పాటు నూనె శాతం అనేది జీరాలో అధికంగా లభిస్తుంది. అందువలన, ఉదరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ను క్రమబద్దీకరించి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం ద్వారా అసిడిటీని, అజీర్ణాన్ని, గ్యాస్ ట్రబుల్ ను తగ్గిస్తుంది. ఈ పానీయాన్ని భారీగా భోజనం చేసిన తరువాత కూడా స్వీకరిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది.

2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది

2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది

బరువు తగ్గటమనేది అత్యథిక ఒత్తిడితో కూడుకున్న ప్రక్రియ. వ్యాయామంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే అధిక బరువును తగ్గించుకునే వీలవుతుంది. స్ట్రిక్ట్ డైట్ ను పాటిస్తూ వ్యాయామాన్ని సరిగ్గా చేసే వారు జీలకర్ర బెల్లం నీళ్లను తీసుకుంటే వారి మెటబాలిక్ రేట్ మెరుగవుతుంది. తద్వారా, అధిక బరువు కరుగుతుంది. జీలకర్రలో అలాగే బెల్లంలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.

3. మలబద్దకాన్ని నివారిస్తుంది

3. మలబద్దకాన్ని నివారిస్తుంది

వేడినీటిలో కలిపిన జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే మలబద్దకం సమస్య ఎదురవదు. ఈ పదార్థాలలో లభించే మినరల్స్ కి మలబద్దక సమస్యని నివారించే సామర్థ్యం కలదు. అందుకే, మలబద్దక సమస్యతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ రెమెడీని పాటించడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందినవారవుతారు.

4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది

4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది

శరీరంలో అనేకరకాల విషపదార్థాలు పేరుకోబడతాయి. ఇవి అనేకరకాల రోగాలకు దారితీస్తాయి. బెల్లం అలాగే జీలకర్రలోని గల ఔషధ గుణం వలన రక్తంలోని గల విషపదార్థాలు సహజసిద్ధంగా బయటకు పోతాయి. తద్వారా, రక్తశుద్ధి అవటం చేత అనేక ఆరోగ్యసమస్యలు నుంచి రక్షణ లభిస్తుంది.

5.రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

5.రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

జీలకర్రలో అలాగే బెల్లంలో కలిగిన పొటాషియం అలాగే మెగ్నీషియం కంటెంట్ అనేవి శరీరంలోని ప్రతి సెల్ ని బలోపేతం చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అందువలన, రోగాలనేవి సులభంగా దరిచేరలేవు. ఈ వ్యవస్థ పనితీరు సవ్యంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉంటారు.

6. నెలసరి నొప్పులను తగ్గిస్తుంది

6. నెలసరి నొప్పులను తగ్గిస్తుంది

నెలసరి సమయంలో అనేకమంది మహిళలు పొత్తికడుపు నొప్పితో ఇబ్బందికి గురవుతారు. జీలకర్రలో అలాగే బెల్లంలో కలిగిన మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఈ ప్రాంతానికి రక్తప్రసరణ సరిగ్గా జరిగి నెలసరి నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ రెమెడీని ప్రయత్నించి నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందండి.

7. అనీమియాను తగ్గిస్తుంది

7. అనీమియాను తగ్గిస్తుంది

రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోవడమం వలన అనీమియా ఎటాక్ అవుతుంది. తద్వారా నీరసంతో పాటు అనేకరకాల అనారోగ్యసమస్యలు దాడిచేస్తాయి. జీలకర్రలో అలాగే బెల్లంలో లభించే పోషకవిలువల వలన హిమోగ్లోబిన్ స్థాయిలు సహజసిద్ధంగానే సాధారణ స్థాయికి చేరుకుంటాయి.

8. అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది

8. అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది

అధికరక్తపోటు సమస్యలో ఆర్టెరీలకు రక్తమనేది వేగంగా సరఫరా అవుతుంది. తద్వారా, గుండె జబ్బులతో పాటు గుండె పోటుకు గురయ్యే ప్రమాదం అధికం. జీలకర్రలో అలాగే బెల్లంలో లభించే పొటాషియం కంటెంట్ కు రక్తప్రసరణని బాలన్స్ చేసే సామర్థ్యం కలదు. అందుకే అధిక రక్తపోటు సమస్యకు ఇవి చక్కని ఔషధంగా పనిచేస్తాయి.

9. కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి

9. కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి

వృద్ధులలో అలాగే, స్పోర్ట్స్ ఆడేవారిలో కీళ్లనొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కీళ్ల వాపు వలన అలాగే ఎముకలు బలహీనంగా మారటం వలన కీళ్ళనొప్పుల సమస్య ఎదురవుతుంది. పొటాషియంతో పాటు మిగతా ముఖ్యమైన మినరల్స్ అనేవి జీలకర్రతో కలిపిన బెల్లం మిశ్రమంలో అధికంగా లభిస్తాయి. వీటివలన, రక్తప్రసరణ అనేది కీళ్ల వద్దకు సజావుగా సాగుతుంది. తద్వారా, వాపు మరియు నొప్పి తగ్గుముఖం పడతాయి.

10. శక్తి కలుగుతుంది

10. శక్తి కలుగుతుంది

వేడినీటిలో కలపబడిన జీలకర్ర ,బెల్లం మిశ్రమం అనేది సహజసిద్ధమైన ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది. ఈ పానీయంలో లభించే పొటాషియం శక్తిని కలిగిస్తుంది.కాబట్టి, ఈ పానీయాన్ని రోజూ ఉదయాన్నే తాగడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

English summary

Health Benefits Of Jeera Water+ Jaggery, water

Natural ingredients found in our kitchens can be used to treat and prevent a number of ailments. A mixture of jaggery and cumin (jeera), along with hot water is a great health drink. This drink has over 9 health benefits when consumed on a daily basis!
Desktop Bottom Promotion