For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ ని అరికట్టే రెడ్ వైన్

క్యాన్సర్ ని అరికట్టే రెడ్ వైన్

|

ఆల్కహాలిక్ డ్రింక్ అయిన రెడ్ వైన్ అనేది క్యాన్సర్ ని ఏ విధంగా అరికడుతుందోనని మీరు ఆశ్చర్యానికి గురికావచ్చు. రెడ్ వైన్ లో నున్న ఔషధ గుణాలను సైంటిస్ట్ లు కూడా నిర్ధారించారు.

ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో దే జనేయురో కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ లభ్యమవుతుంది. ఇది క్యాన్సర్ సెల్స్ ఫార్మేషన్ కి దారితీసే P53 ప్రోటీన్ మ్యూటేషన్ ను నియంత్రిస్తుంది.

Heres How Red Wine Can Prevent Cancer

WHO ప్రకారం క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవించడానికి రెండవ లీడింగ్ కాజ్ గా మారుతోంది. ప్రతి ఆరు మరణాలలో ఒక మరణం క్యాన్సర్ వలన సంభవిస్తోందని తేలింది. ఆల్కహాల్ వలన కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

మరి, ఆల్కహాలిక్ నేచర్ కలిగిన రెడ్ వైన్ క్యాన్సర్ ని నియంత్రించడానికి ఎంతమాత్రం తోడ్పడుతుంది? ఈ సందేహం మిమ్మల్ని వెంటాడుతోంది కదూ! రెడ్ వైన్, ఆల్కహాలిక్ అయినా కూడా ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. బ్రెయిన్ పై సూత్ ఎఫెక్ట్స్ ని కలిగి ఉంటుంది. బ్యాడ్ బ్రెత్ ని అరికడుతుంది.

అయితే, వైన్ ని తీసుకునే మోతాదును నియంత్రించుకోవటంలోనే అసలు రహస్యం దాగి ఉంది. లేదంటే, అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. రెడ్ వైన్ గురించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకున్నాక అప్పుడు అసలు విషయానికి వద్దాం. రెడ్ వైన్ ను ఎలా తయారుచేస్తారు, ఇది ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది. ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది వంటివి తెలుసుకుందాం.

రెడ్ వైన్ ను ఎలా తయారుచేస్తారు?

రెడ్ వైన్ ను ఎలా తయారుచేస్తారు?

రెడ్ లేదా బ్లాక్ గ్రేప్స్ పల్ప్ లోంచి రెడ్ వైన్ ను తయారుచేస్తారు. మొదటగా, గ్రేప్స్ ను క్రష్ చేస్తారు. వాటిని వాటి స్కిన్ తో సహా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కి సహకరించే ఎన్విరాన్మెంట్ లో ఒక పక్కన ఉంచుతారు.

ఈ ప్రక్రియ మొత్తమ్మీద, గ్రేప్స్ స్కిన్ పై ఉండే ఈస్ట్ లేదా గ్రేప్స్ పై చల్లబడిన ఈస్ట్ అనేది తన చర్యను చేయడం ప్రారంభిస్తుంది. తద్వారా, ఆల్కహాల్ అనేది ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా, ఇందులో ఆల్కహాల్ కంటెంట్ అనేది 14.5 శాతమని తెలుస్తోంది (గూగుల్ ప్రకారం).

రెడ్ వైన్ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగకరం?

రెడ్ వైన్ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగకరం?

రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్ మరియు కెటెచిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. ఇవి ఆరోగ్యానికి మంచివి. అయితే, రెడ్ వైన్ టైప్ పై వీటి లభ్యత మోతాదు ఆధారపడి ఉంటుంది.

రెడ్ వైన్ ని తగిన మోతాదులలో తీసుకుంటే అల్జీమర్ వ్యాధి బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాక, డిమెన్షియా, డిప్రెషన్, గుండె వ్యాధులు అలాగే డయాబెటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించే వీలు ఉంటుంది. అయినప్పటికీ, ఈ విషయంపై సైంటిస్ట్ లు ఇంకా 100 శాతం ధృవీకరించవలసిన అవసరం ఉంది. రెడ్ వైన్ ద్వారా లభించే ప్రయోజనాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

రెడ్ వైన్ వలన ఆరోగ్యంపై ఏ విధంగా దుష్ప్రభావాలు పడతాయి?

రెడ్ వైన్ వలన ఆరోగ్యంపై ఏ విధంగా దుష్ప్రభావాలు పడతాయి?

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించవచ్చు. అయితే, ఇది ఆల్కహాలిక్ అన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. దీన్ని ఎక్కువగా సేవించడం వలన దుష్ప్రయోజనాలు కలుగుతాయి. తగిన మోతాదులో తీసుకునే మాత్రం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కత్తికి రెండు వైపులా పదును అన్న చందంగా ఉంటుంది.

లివర్ సిర్హోసిస్ (ఆల్కహాలిక్ డ్రింక్ ని తీసుకోవడం ద్వారా ఎదురయ్యే దుష్పరిణామం), డిప్రెషన్, డయాబెటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే, ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వలన అడిక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

బ్రెజిలియన్ సైంటిస్ట్ ల అధ్యయనం ఏమని స్పష్టం చేస్తోంది?

బ్రెజిలియన్ సైంటిస్ట్ ల అధ్యయనం ఏమని స్పష్టం చేస్తోంది?

బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ లో లభించే P53 (ట్యూమర్ ప్రోటీన్ 53 లేదా టీపీ 53) యొక్క నార్మల్ తో పాటు మ్యుటేటెడ్ లేదా అబ్నార్మల్ వెర్షన్స్ పై రెడ్ వైన్ లో లభించే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాల గురించి సైంటిస్ట్ లు అధ్యయనం చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ని ఇంప్లాంట్ చేయబడ్డ ఎలుకలపై అదే సమయంలో ల్యాబ్ లో అధ్యయనం సాగింది.

P53 అనే జీన్ సాధారణ సందర్భాలలో క్యాన్సర్ సెల్స్ ని నశింపచేస్తుంది. అందువలన ట్యూమర్ సప్రెసర్ గా తోడ్పడుతుంది. అయితే, ఇది మ్యూటేషన్ కి గురయినప్పుడు, క్యాన్సర్ కి దారితీసే ప్రోటీన్ లంప్స్ ను ఫార్మ్ చేస్తుంది.

ఈ అధ్యయనం వెల్లడించిన విషయాలేమిటి?

ఈ అధ్యయనం వెల్లడించిన విషయాలేమిటి?

ల్యాబ్ లోని అధ్యయనంలో అలాగే ఎలుకలపై సాగిన అధ్యయనంలో P53 క్లమ్ప్స్ ని అరికట్టడానికి రెస్వెరాట్రాల్ సహాయపడిందని వెల్లడైంది. అలాగే, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ వృద్ధి జరగకుండా కూడా అరికట్టింది. అయితే, రెస్వెరాట్రాల్ లోని ఏ కంటెంట్స్ వలన ఈ అద్భుతమైన ఫలితం దక్కిందో ఇంకా తెలియాల్సి ఉంది.

వీటికంటే ముందు ఇంకొక అధ్యయనం ప్రకారం రెడ్ వైన్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లో ప్రవేశించే కొన్ని ప్రత్యేకమైన బాక్టీరియా వృద్ధిని అరికడుతుందని అందువలన చిగుళ్ల వ్యాధులతో పాటు క్యాన్సర్ ప్రమాదం అరికట్టబడుతుందని తెలుస్తోంది. కాబట్టి, రెడ్ వైన్ అనేది క్యాన్సర్ ని అరికట్టడంలో తనదైన పాత్ర పోషిస్తుందని భావించవచ్చు.

English summary

Here's How Red Wine Can Prevent Cancer

It is surprising to know that red wine is used to prevent cancer. Red wine is made from the pulp of red and/or black grapes. Red wine prevents the growth of certain bacteria which enter the bloodstream as a result of periodontal diseases. And, it is highly likely that red wine will be effective in preventing cancer.
Story first published:Thursday, July 5, 2018, 11:24 [IST]
Desktop Bottom Promotion