For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈస్ట్ ఇన్ఫెక్షన్ కొరకు యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా ఉపయోగించాలి

|

వేడి, తేమ ఎక్కువ ఉండే వాతావరణంలో ఉండే ప్రజలకి సాధారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు నోటిలో, ప్రేగులకి మరియు వెజైనాకి వస్తూ ఉంటాయి.

మహిళలు ముఖ్యంగా వెజైనైటిస్ ( యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్) తో బాధపడతారు. దీనివల్ల తొడలు మరియు యోని బయట ఎర్రగా మారి, దురద, వెజైనా లోపల చికాకు, వెజైనాలోంచి తెలుపు లేదా పసుపు డిశ్చార్జ్ అవుతుంది.

అధ్యయనాల ప్రకారం 75 శాతం మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ జీవితకాలంలో ఎప్పుడో అప్పుడు తీవ్ర ఈస్ట్ ఇన్ఫెక్షన్లకి గురవుతారని తేలింది. కొంతమంది వైద్యసాయం తీసుకుని మందులు, పైన రాసుకునే క్రీము వాడితే, ఇతరులు అది బయటకి చెప్పుకోడానికి సిగ్గుపడతారు.

అందుకని అలాంటివారు ఈస్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోటానికి సహజ చిట్కాలు వాడతారు. వీటిల్లో ముఖ్యమైన సహజచిట్కా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తగ్గించటానికి యాపిల్ సిడర్ వెనిగర్ (ఎసివి) వాడటం.

అందుకని, మరీ అధికంగా మంట లేదా దురద కలిగించకముందే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయటం ముఖ్యం.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు

ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు

నోటిలో మరియు నాలుకపై వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను సాధారణంగా ఓరల్ కాండియాసిస్ (లేదా ఓరల్ థ్రష్) అంటారు, ఇది నోటిలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నోటిలో మరియు నాలుకపై తెల్లని మచ్చలు, గొంతునొప్పి, ఆహారాన్ని మింగలేక అవస్థలు పడతారు. అదే లైంగిక అవయవాలపై వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ పురుషులు, స్త్రీలు ఇద్దరిలో వస్తుంది. కానీ మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

అది వెజైనాలో మంట, ఎర్రదనం, దురద మరియు చిక్కని తెల్లని డిశ్చార్జ్, చుట్టూ నొప్పి, సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు కూడా నొప్పి కలగవచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ వేడి,తేమ వాతావరణంలో జీవించే వారిలో ముఖ్యంగా చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది చర్మపు ముడతల మధ్య ఎర్ర ర్యాషెస్ ,నొప్పి, దురదతో కన్పిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నయం చేయడంలో ఎసివి ఎలా ప్రభావం చూపిస్తుంది?

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నయం చేయడంలో ఎసివి ఎలా ప్రభావం చూపిస్తుంది?

1.ఎసివిలో ఉండే సహజమైన యాంటీబయాటిక్ లక్షణాలు బ్యాక్టీరియా,ఫంగై మరియు వైరస్ లతో పోరాడటానికి సాయపడతాయి.

2. ఆమ్లగుణాలు ఉండటం వలన, యాపిల్ సిడర్ వెనిగర్ వెజైనా యొక్క పిహెచ్ బ్యాలెన్స్ ను నిలిపివుంచి, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తొలగిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ తక్కువ పిహెచ్ స్థాయిలలో బ్రతకలేదని తేలింది.

3.ఇంకా, ఎసివి వెజైనా మరియు ప్రేగులలో మంచి బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో పెరిగేట్టు చేయటం వలన అవి ఆ ప్రాంతాల్లో ఈస్ట్ ను తరిమికొడతాయి.

4.ఎసివిలో ఉండే సహజమైన ప్రొటీన్ మరియు ఎంజైములు వలన దాన్ని రోజూ తీసుకున్నప్పుడు, ఆ పోషకాలు శరీరంలోకి వెళ్ళి మీ రోగనిరోధక వ్యవస్థను మరింత పెంచి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను రాకుండా చేస్తుంది.

5.ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తగ్గించటమే కాక, ఎసివి రక్తపోటును తగ్గించి, ఫంగస్ పెరగకుండా కూడా నియంత్రిస్తుంది (డయాబెటిస్ పేషంట్లలో ఎక్కువ కన్పిస్తుంది).

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నయం చేయటానికి యాపిల్ సిడర్ వెనిగర్ ను ఎలా వాడాలి

మీ శరీరంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తగ్గించటానికి యాపిల్ సిడర్ వెనిగర్ ను నేరుగా తాగాలి లేదా చర్మం పైన ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కింద ఎసివి ని వాడే ఆ పద్ధతులేంటో తెలపటం జరిగింది, చదవండి.

పద్ధతి 1 తాగటం

పద్ధతి 1 తాగటం

ఒక గ్లాసు గోరువెచ్చని నీరులో, 1-2 చెంచాల ఎసివిని వేసి, బాగా కలిపి రోజుకి రెండు మూడుసార్లు తీసుకోవటం వలన ఈస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇందులో పంచదార లేదా తేనెను కలపవద్దు, అవి ఫంగస్ పెరిగేట్లా చేస్తాయి.

ఈ మిశ్రమాన్ని మీ మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి ముందు తీసుకోండి. పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈస్ట్ ను ఆపటానికి మంచి సహజమైన ఎసివినే వాడండి, 1 చెంచా ఎసివిని మీ పళ్ళరసం, కాయగూరల సూప్ లేదా టీలో కలుపుకుని తాగవచ్చు.

పద్ధతి 2; నానబెట్టటం

పద్ధతి 2; నానబెట్టటం

ఒక బౌల్ లో , 2-3 చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్ ను తీసుకుని అందులో ఒక కాటన్ ప్యాడ్ లేదా కాటన్ గుడ్డను ముంచి నానబెట్టండి. ఈ నానిన గుడ్డను ఇన్ఫెక్షన్ వచ్చినచోట వత్తిపెట్టండి. గుర్తుంచుకోండి, వెనిగర్ యొక్క యాసిడ్ స్థాయి 5శాతం మాత్రమే ఉండాలి.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే, వెనిగర్ అక్కడ రాయటం వలన మంటగా,చికాకుగా అన్పించవచ్చు. అలాంటప్పుడు, పల్చన చేసిన ఎసివిని ఉపయోగించండి. మీరు నీరును, వెనిగర్ ను సమపాళ్ళలో ఒక గిన్నెలో కలిపి, అందులో గుడ్డను నానేసి ఇన్ఫెక్షన్ వచ్చిన చోట పెట్టవచ్చు.

ఈ మిశ్రమాన్ని ఆ ప్రాంతంలో 10-15 నిమిషాలు అలానే ఉంచి తర్వాత కడిగేయండి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి తొందరగా పొందండి.

పద్ధతి 3 ; ఎసివి మరియు టీ ట్రీ నూనె

పద్ధతి 3 ; ఎసివి మరియు టీ ట్రీ నూనె

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నయం చేయగలిగే మరో పద్దతి 3-4 కప్పుల యాపిల్ సిడర్ వెనిగర్ ను ½ చెంచా టీ ట్రీ నూనెతో మీరు స్నానం చేసే నీళ్లలో కలపడం. ఈ నీళ్ళతో స్నానం చేయటం వలన ఈస్ట్ పెరగటాన్ని నియంత్రించి, ఇదివరకే పెరిగిన వాటిని తగ్గిస్తుంది. అదేకాక, టీ ట్రీ నూనె ఉండటం వలన దానిలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఫంగస్ పెరగకుండా ఆపుతుంది.

పద్దతి 4 ; డ్యుచె

పద్దతి 4 ; డ్యుచె

ఈ పద్ధతి వెజైనైటిస్ ను తగ్గించటంలో సాయపడి, యోని యొక్క పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది. దీనికోసం ఒక బౌల్ లో 1 కప్పు నీరు, 3చెంచాల ఎసివిని వేయండి. బాగా కలిపి వెజైనా ప్రాంతంలో వాడండి. ఈ పద్దతి వలన అక్కడ మంట, తెల్ల డిశ్చార్జ్ తగ్గుతుంది. తీవ్ర ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే, డ్యుచె పద్ధతిని రోజుకి రెండుసార్లు క్రమం తప్పకుండా పాటించండి. కానీ వాడేముందు, వైద్యున్ని సంప్రదించి మీ శరీరంకి ఎంత వెనిగర్ సరిపోతుందో తెలుసుకోండి.

పద్దతి 5; డైట్

పద్దతి 5; డైట్

మీ రోజువారీ ఆహారంలో యాపిల్ సిడర్ వెనిగర్ ను తినటం వలన ఈస్ట్ పెరగకుండా నియంత్రించి, అంతకుముందు ఇన్ఫెక్షన్లు కూడా నయమవుతాయి. ఎసివిని వంటల్లో, ఆహారనిల్వలలో అనేకరకాలుగా వాడతారు. ఎసివిని పళ్ళరసాలకి, సూప్ లకి, పచ్చళ్ళకి జతచేయండి. మీరు దీన్ని సలాడ్ పై డ్రస్సింగ్ లాగా లేదా బేక్ చేసిన బంగాళదుంపలపై పైన చల్లటమో చేసి, క్రమం తప్పకుండా తీసుకోండి.

పద్ధతి 6; సప్లిమెంట్

పద్ధతి 6; సప్లిమెంట్

మీలో కొంతమందికి మీ ఆహారంలో ఈ పుల్లటి ఎసివి రుచి నచ్చకపోవచ్చు.అందుకని ఇప్పుడు ఎసివి మార్కెట్లో టానిక్, టాబ్లెట్లు మరియు క్యాప్స్యూల్స్ రూపంలో కూడా లభిస్తోంది. ఈ ఎసివిని సప్లిమెంట్ గా తీసుకుని ఈస్ట్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను నివారించి, రోగనిరోధక వ్యవస్థను మరింత బలపర్చుకోండి.

పద్ధతి 7 ; మీ స్నానంలో ఎసివి

పద్ధతి 7 ; మీ స్నానంలో ఎసివి

ఒక బక్కెట్ లో సరిపోయే గోరువెచ్చని నీరు మరియు 2 కప్పుల వెనిగర్ ను వేయండి. బాగా కలిపి మీ వెజైనా ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు నానేలా చేయండి. మీరు యాపిల్ సిడర్ వెనిగర్ ను మీ స్నానం చేసే నీరులో కూడా జతచేసి మీ శరీరాన్ని శుభ్రపర్చి, చర్మంపై ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తొలిగేలా చేయవచ్చు. ఈ పద్ధతిని రోజుకి రెండుసార్లు పాటించి మంచి ఫలితాలు పొందండి.

పద్ధతి 8 ; ఎసివి ట్యాంపన్

పద్ధతి 8 ; ఎసివి ట్యాంపన్

ఒక యాపిల్ సిడర్ వెనిగర్ బౌల్ లో ట్యాంపన్ లను ముంచి , ఆ నానిన ట్యాంపన్ ను మీ వెజైనాలో పెట్టుకోండి. ఇది యోని గోడలపై బయటివైపు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తగ్గేలా చేస్తుంది. 10 నిమిషాలు అలా ఉండనిచ్చి బాగా కడుక్కోండి. ఈ ప్రాంతాన్ని శుభ్రమైన గుడ్డతో మరే ఫంగస్ పెరగకుండా పొడిగా తుడవండి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా వాడి మంచి ఫలితాలను పొందండి.

యాపిల్ సిడర్ వెనిగర్ ఒక సహజమైన ఉత్పత్తి; అందుకని, దానివల్ల మీ చర్మం మరియు శరీరంపై ఏ దుష్ప్రభావాలు ఉండవు. సహజంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను తగ్గించే ఒక ప్రభావవంతమైన పద్ధతి ఇది.

ఈ ఆర్టికల్ ను పంచుకోండి!

English summary

How to Use Apple Cider Vinegar for Yeast Infection

Apple cider vinegar is a potent pro biotic that should only be consumed or used under strict guidelines. And there are 8 ways you can use it to cure yeast infection. For example, you can soak a cotton ball in ACV and apply it to the affected area, or even use it as a vaginal douche.