For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులకు కూడా రొమ్ము కాన్సర్ వస్తుందా

|

పురుషులు సాధారణంగా మహిళలవలే రొమ్ము కణజాలం లేదు అని అపోహ పడుతుంటారు. ‌కానీ వాస్తవానికి వారికి కూడా రొమ్ము కణజాలం ఉంటుంది. కాకపోతే మహిళలతో పోలిస్తే పురుషులకు పరిమాణంలో తక్కువగా ఉండడంతో పాటు రొమ్ముక్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. మరియు పురుషులలో రొమ్ము క్యాన్సర్ అత్యంత అరుదైన విషయం. రొమ్ముక్యాన్సర్ పురుషులకు రాదు అని అనుకోవడం మాత్రం నిజంగా అపోహే.

ఈ పరిస్థితి నిర్ధారణ గురించి అనేక సంకేతాలు కనిపిస్తున్నా, ఇవి రొమ్ము క్యాన్సర్ సంబంధిత సమస్య కాదని భావిస్తూ అనేకమంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ సమస్యతో బాధపడే కొద్దిమంది గురించి కనీస అవగాహన ఉండడం ద్వారా, ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుని సంప్రదించి నిర్ధారణ గావించుకొని చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రపంచంలో రొమ్ము క్యాన్సర్ కేసులలో ఒక్క శాతం కన్నా తక్కువగా పురుషుల కేసులు నమోదు అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ దీని బారిన పడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికే క్లిష్టతరంగా ఉంటుంది.

నిజానికి పురుషులు మహిళల వల్లే రొమ్ముక్యాన్సర్ పరీక్షలలో స్వీయ పరీక్ష చేయనవసరం లేదు. నొప్పి లేదా పరిమాణం గురించిన అవగాహన మహిళల కన్నా పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అసాధారణముగా లేదా అసమతుల్య పోకడలకు గురవుతున్నట్లుగా అనిపించిన ఎడల వెంటనే విస్మరించకుండా వైద్యుని సంప్రదించడం మేలు.

అక్టోబర్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవానికి నెల ముందుగానే మన బోల్డ్స్కీ, రొమ్ము క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు, సంభావ్యత కారణాలు మొదలైన అంశాలన్నింటినీ మీతో పంచుకొనుటకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే అనేకమంది ప్రజలు తరచుగా విస్మరిస్తున్న పురుషుల రొమ్ము క్యాన్సర్ సంబంధించిన అంశాలను మీతో పంచుకోబోతున్నాము.‌

సంభావ్య కారణాలు :

సంభావ్య కారణాలు :

నిజానికి నేటికి కూడా పురుషులలో రొమ్ము క్యాన్సర్ కారణాల గురించిన పూర్తి వివరాలు శాస్త్రవేత్తలకు సైతం స్పష్టంగా తెలియదు. ఏదిఏమైనప్పటికినీ, రొమ్ము కణజాలంలో అసాధారణ పోకడలు మరియు కణజాల అసమతుల్య అభివృద్ధి మొదలైనవి రొమ్ము కాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. అసాధారణంగా పెరిగిన చెడు కణజాలం ఒక కణితిగా ఏర్పడడం ద్వారా రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. సరైన సమయంలో గుర్తించని ఎడల సమీపంలోని ఇతర కణజాలాలకు మరియు శోషరస కణుపులు లేదా ఇతర అంతర్గత శరీర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. క్రమముగా ప్రాణాంతకమయ్యే అవకాశాలు లేకపోలేదు.

అసలు రొమ్ము క్యాన్సర్ ఎక్కడ నుండి మొదలవుతుంది :

అసలు రొమ్ము క్యాన్సర్ ఎక్కడ నుండి మొదలవుతుంది :

భూమిపై పుట్టిన ప్రతి మనిషి సరైన రొమ్ము కణజాలంతో జన్మిస్తాడు. ఈ రొమ్ము కణజాలములో సాధారణముగా పాలు ఉత్పత్తి చేసే లాభూల్స్ అనే గ్రంధులు ఉంటాయి. ఇవి నిపుల్స్ మరియు కొవ్వు ప్రాంతాలకు పాలను సరఫరా చేస్తాయి. కాకపోతే ఒకే ఒక తేడా ఏమిటంటే, మహిళల కన్నా పురుషుల్లో రొమ్ము కణజాలం అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అంతేకానీ అసలు అభివృద్ధి ఉండదు అనుకోవడం పొరపాటే. ఎటుతిరిగీ కణజాలం ఉన్న కారణాన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే తక్కువ పరిమాణంలో. ఈ మధ్యకాలంలో పాలిస్తున్న తండ్రులను సైతం మనం చూస్తున్నామని మరచిపోకూడదు.

పురుషులలో రొమ్ము క్యాన్సర్ రోగనిర్ధారణ రకాలు :

పురుషులలో రొమ్ము క్యాన్సర్ రోగనిర్ధారణ రకాలు :

డక్టాల్ కార్సినోమా :

ఈ రకమైన క్యాన్సర్ పాలు తీసుకొనే నాళాలలో మొదలవుతుంది. పురుషుల రొమ్ము క్యాన్సర్ అనేది అరుదైన సంఘటన అయినప్పటికీ, దాదాపు అన్ని సందర్భాల్లో డక్టాల్ క్యాన్సర్ సంభవిస్తుంది.

లోబ్యులర్ కార్సినోమా :

ఈ రకం క్యాన్సర్ పాలు ఉత్పత్తి చేసే గ్రంధుల్లో మొదలవుతుంది. ఈ రకమైన కాన్సర్ అరుదుగా సంభవిస్తుంది. ఎందుకంటే పురుషులు తమ ఛాతీ కణజాలంలో చాలా తక్కువగా లోబ్యూల్స్ కలిగి ఉంటారు.

ఇతర రకాలు :

పురుషులలో ఇతర, అరుదైన రొమ్ము క్యాన్సర్ రకాలుగా పాగేట్ వ్యాధి మరియు ఇన్ఫ్లమేటరీ రొమ్ము క్యాన్సర్ ఉన్నాయి.

గమనించవలసిన లక్షణాలు :

గమనించవలసిన లక్షణాలు :

1. లంప్స్ :

పురుషులు తరచుగా వారి ఛాతీమీద ఏర్పడే "లంప్స్" ను విస్మరిస్తుంటారు. మీ చనుమొనల వద్దనున్న ఈ లంప్స్ కూడా రొమ్ము క్యాన్సర్ సూచన కావొచ్చు. సాధారణంగా ఈ లంప్స్ నొప్పిలేకపోయినా, కొన్నిసార్లు తాకినప్పుడు సున్నితమైన (కందిన లేదా వాపు) అనుభూతికి లోనవుతారు. క్యాన్సర్ వ్యాప్తి చెందుతున్నట్లయితే, చంక క్రింది బాగంలో, లేదా కాలర్ బోన్ చుట్టూ వాపుతో కూడిన స్వెల్లింగ్ ఉంటుంది.

2. ఇన్వర్టెడ్(విలోమ) నిపుల్ :

2. ఇన్వర్టెడ్(విలోమ) నిపుల్ :

కాన్సర్ ప్రభావం పెరుగుతున్నప్పుడు, రొమ్ము క్యాన్సర్ కణితి రొమ్ము లోపలికి స్నాయువులను లేదా చనుమొనలను లాగడం మొదలుపెడుతుంది. తత్ఫలితంగా, చనుమొనలు లోపలి వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు, ఈ ప్రాంతంలో పొడిచర్మంతో కూడుకుని ఉంటుంది.

3. చనుమొనల నుండి ద్రవాలు కారడం :

3. చనుమొనల నుండి ద్రవాలు కారడం :

కొన్నిసమయాల్లో, ముందస్తు రొమ్ము క్యాన్సర్ నోటీసు ఉన్న పురుషులు వారి చొక్కాలపై మరకలను గమనించవచ్చు. కానీ చమట వలన అనుకుని విస్మరిస్తుంటారు. కానీ ఈ మరకలు ఎల్లప్పుడూ ఛాతీకి ఒకే వైపున కనిపిస్తే, అది చనుమొన ఉత్సర్గ(ద్రవాలు కారడం) కావచ్చు. ఇది చనుమొన వాహిక నుండి కాన్సర్ కణితి ద్రవం బయటకు రావడం వలన జరుగుతుంది.

4. చీముకారడం :

4. చీముకారడం :

కొన్ని సందర్భాలలో, క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, కణితి చర్మం ద్వారా పెరుగుతున్న సందర్భంలో, పురుషులు తమ చనుమొనపైన బహిరంగంగా పుండు ఏర్పడి చీము కారడం గమనించవచ్చు. పురుషులు దాదాపు నిరుపయోగమైన రొమ్ము కణజాలంతో జన్మించినందున, చర్మం ద్వారా కణితి బయటకు వచ్చేలా కనిపించడం సాధ్యమవుతుంది. ఈ పుండ్లు మొటిమల వలె కనిపిస్తుంటాయి.

మీరు ఈ పైన చెప్పిన లక్షణాలకు సంబంధించి ఏ సమస్యను కలిగి ఉన్నా, ఆలస్యం చేయకుండా మీ డాక్టరును సంప్రదించండి.

ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ జరిగితే రొమ్ము క్యాన్సర్ నివారణకు మంచి అవకాశం ఉందని గమనించండి. చికిత్సల పరంగా, రొమ్ము కణజాలాన్ని పూర్తిగా తొలగించే శస్త్రచికిత్సలను కలిగి ఉంటాయి. ఇతర చికిత్సలు కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ వంటివి మీపరిస్థితిపై ఆధారపడి సిఫార్సు చేయవచ్చు.


English summary

Men Breast Cancer Causes and Symptoms

We assume breast cancer is exclusively a woman's disease. In fact, men make up even less than one percent of global breast cancer cases. But the risk still exists, right? And you know what's worse? Most men often ignore the symptoms.
Story first published: Wednesday, August 22, 2018, 12:00 [IST]