For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా : ఈ పార్శ్వపు తలనొప్పిలోని నాలుగు దశలు, వాటి సంకేతాల గురించి తెలుసుకోండి.

మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా : ఈ పార్శ్వపు తలనొప్పిలోని నాలుగు దశలు, వాటి సంకేతాల గురించి తెలుసుకోండి.

|

మైగ్రెయిన్, దీనిని పార్శ్వపుతలనొప్పిగా కూడా వ్యవహరిస్తారు. ఈ తలనొప్పి యొక్క ఉనికిని ఊహించడం కూడా కష్టమే. కానీ దాని దశలను మాత్రం ఖచ్చితంగా గుర్తించవచ్చు. ప్రతి దశ యొక్క లక్షణాల గురించి తెలుసుకోవడం మరియు దానితో వ్యవహరించే విధానాలను అంచనా వేయడం ద్వారా, భవిష్యత్తులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించబడింది.

తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పిని కలిగించే సమస్యగా ఈ పార్శ్వపుతలనొప్పి ఉంటుంది. ఇది కాంతి మరియు ధ్వని సంబంధిత విషయాలలో సున్నితత్వం కలిగి ఉంటుంది. క్రమంగా ఒక్కోసారి వాంతులు మరియు వికారంతో కూడుకుని ఉంటుంది. ఈ పార్శ్వపునొప్పి కొన్ని గంటల నుండి రోజుల వరకు కొనసాగుతుంది కూడా., ఇందులో ప్రధానంగా నాలుగు దశలు ఉన్నాయి.

The Four Phases of Migraine Attack and Their Symptoms

మైగ్రెయిన్ ఎటాక్ దశలు:

ఈ పార్శ్వపు తలనొప్పి, ఆయా లక్షణాలను అనుసరించి ముఖ్యంగా నాలుగు దశలుగా విభజించబడింది. ఈ దశల్లోని లక్షణాలు కూడా సాధారణ తలనొప్పి మరియు పార్శ్వపు తలనొప్పి మధ్యగల తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ నాలుగు దశలు వరుసగా: ప్రోడ్రోం, మూడ్ స్వింగ్స్, తలనొప్పి మరియు పోస్ట్ డ్రోమ్.

ప్రతిదశలోనూ దాని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం :

ఒకటవ దశ : ప్రోడ్రోమ్

ఒకటవ దశ : ప్రోడ్రోమ్

ఈ దశ పార్శ్వపునొప్పి సమస్య ప్రారంభమవడానికి కొన్ని గంటల ముందు ఉంటుంది. కొన్ని సందర్భాలలో, ఈ దశ పార్శ్వపునొప్పి కలగడానికి కొన్ని రోజుల ముందే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. ఈ దశ పార్శ్వపు నొప్పి ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు దీనిని ప్రీ-హెడ్-ఏక్ లేదా ప్రీమోనిటరీ దశగా కూడా సూచిస్తారు. ఏదేమైనా, ప్రతి మైగ్రేన్ సమస్య ప్రారంభమవడానికి ముందు ప్రోడ్రోమ్ ఖచ్చితంగా ఉండాలని కూడా లేదు. ఒక్కోసారి ఈ ప్రోడ్రోం సమస్య లేకుండానే పార్శ్వపు తలనొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ దశ యొక్క లక్షణాలు:

ఈ దశ యొక్క లక్షణాలు:

• అధిక చిరాకు

• దాహం

• శక్తి హీనత

• నిర్దిష్టమైన ఆహారాలపై కోరికలు

• అధిక నిద్రలేమి

• తరచుగా మూత్రవిసర్జన భావన

రెండవ దశ: మూడ్ స్వింగ్

రెండవ దశ: మూడ్ స్వింగ్

వింత భావాలు కలగడం ఈ దశలో అధికంగా ఉంటుంది. సాధారణంగా, ఈ మూడ్ స్వింగ్స్ దశ తలనొప్పికి కారకంగా ఉంటుంది. లేదా తలనొప్పి కలగడానికి ముందే ప్రారంభమవుతుంది. ప్రతి నలుగురిలో ఒక్కరికి పార్శ్వపునొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి.

Most Read:భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235Most Read:భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

ఈ దశ యొక్క లక్షణాలు:

ఈ దశ యొక్క లక్షణాలు:

• దృష్టిలో మార్పులు - దృష్టి మార్గంలో ఒక మచ్చలా కాంతి కనపడడం, మీ చూపులో ఎడమ లేదా కుడి వైపున సాధారణంగా సంక్లిష్ట ఆకారాలతో కూడిన మిణుకుమనే లైట్లు. ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది. క్రమంగా కాంతి పెద్దగా మారుతుంది కూడా. పార్శ్వపు తలనొప్పి సంబంధించిన ఈ దశలో, మూడ్ స్వింగ్స్(తరచుగా భ్రాంతులు మారడం) కూడా భాగంగా ఉంటాయి.

• సున్నితమైన చర్మం - శరీరానికి సూదులు గుచ్చుతున్న అనుభూతి, కొద్దిగా నత్తి ఉన్నట్లు మాట్లాడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. శరీరంలో కొన్ని భాగాలలో తిమ్మిరి భావనలు కూడా ఉండవచ్చు. ఈ సమస్య ఎక్కువసేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ముఖం మరియు చేతుల్లో తిమ్మిరి కలిగే సూచనలు ఉన్నాయి.

• ఇతరులతో వ్యవహరించడంలో ఇబ్బందులు - మాట్లాడటం లేదా వ్రాసేటప్పుడు మీ భావవ్యక్తీకరణ సహకరించకపోవడం, ఏకాగ్రత లోపించడం, గందరగోళం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

మూడవ దశ : తలనొప్పి

మూడవ దశ : తలనొప్పి

దీనిని పార్శ్వపు తలనొప్పిలో ప్రధానమైన దశగా సూచించబడుతుంది. మీ తల ఒకవైపున లేదా రెండు వైపుల కూడా నొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. అరుదైన సందర్భాల్లో గరిష్టంగా 3రోజులు కూడా ఉండవచ్చు. ఈ పార్శ్వపు తలనొప్పి, ఒకవైపు నుండి మరొక వైపునకు తలనొప్పిని బదిలీ చేయగలదు. నొప్పి యొక్క తీవ్రత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంటుంది.

ఈ దశలో ప్రధానంగా ఉండే లక్షణాలు:

ఈ దశలో ప్రధానంగా ఉండే లక్షణాలు:

• కళ్ళ పైభాగంలో మొదలవుతుంది

• తలభాగం అదురుగా ఉంటుంది

• సాధారణంగా తల ఒక వైపుగా తలనొప్పి ప్రారంభమవుతుంది

• మీరు చుట్టుతిరుగుతున్నప్పుడు నొప్పి దారుణంగా ఉంటుంది.

• కఠినమైన కార్యాచరణలనందు లేదా ముందుకు వంగుతున్నప్పుడు నొప్పి స్థాయిలు తీవ్రంగా ఉంటాయి.

• వాసన, ధ్వని మరియు కాంతి ప్రభావాల సున్నితత్వం పెరుగుతుంది.

• వికారం, వాంతులకు కారణంగా ఉంటుంది

• మూర్ఛ మరియు కాంతి ప్రభావానికి లోనవడం

Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

నాల్గవ దశ : పోస్ట్-డ్రోం

నాల్గవ దశ : పోస్ట్-డ్రోం

ఈ దశను "మైగ్రెయిన్ హ్యాంగోవర్" లేదా పోస్ట్-మైగ్రెయిన్ దశగా కూడా సూచిస్తారు. మైగ్రెయిన్ సమస్యలకు గురవుతున్న 80శాతం ప్రజలలో దాదాపుగా ఈ సమస్య ఉంటుంది. తలనొప్పి దశ ముగిసినప్పటికీ, పోస్ట్డ్రోం దశలో కొన్ని లక్షణాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ఈ దశలో మైగ్రెయిన్ కారకాలను నివారించడం ముఖ్యం.

ఈ దశ యొక్క లక్షణాలు :

ఈ దశ యొక్క లక్షణాలు :

• బుద్దిమాంద్యం

• గందరగోళం

• తలనొప్పి మీ శక్తి క్షీణతకు కారణంగా ఉండడమే కాకుండా, తలను ఏమాత్రం కదిలించినా నొప్పి కలుగుతుంటుంది.

• విపరీతమైన అలసటఎలా నిర్ధారించవచ్చు?

సాధారణ సంకేతాలు, లక్షణాల ద్వారా వైద్యులు తలనొప్పికి పార్శ్వపు తలనొప్పికి మధ్యగల తేడాను వెంటనే చెప్పగలుగుతారు. కొన్ని సాధారణ శారీరక మరియు నరాల పరీక్షల ద్వారా, మరియు మీ మెడికల్ హిస్టరీని అంచనా వేయడం ద్వారా వైద్యుడు మీరు ఎదుర్కొంటున్న పార్శ్వపునొప్పి స్థితిని అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఇతర వైద్యసమస్యలను అధిగమించడానికి కొన్ని పరీక్షలు కూడా సూచించబడతాయి.

వీటితో పాటు:

• MRI స్కాన్, కణితుల ఉనికిని నిర్ధారించడం, మెదడులో రక్తస్రావం, సంక్రమణ లేదా స్ట్రోక్ సమస్యలు.

• పార్శ్వపు తలనొప్పికి కారణమయ్యే కొన్ని ప్రత్యేకమైన వైద్యకారణాలను గుర్తించడానికి CT స్కాన్.

• వెన్నెముక లేదా మెదడులో సమస్యలను గుర్తించడానికి కొన్ని రక్తపరీక్షలు, విషప్రభావాలు మరియు రక్తనాళ సంబంధిత వ్యాధుల ఉనికి.

• మెదడులో రక్తస్రావం, లేదా సంక్రమణ సమస్యల గురించిన అనుమానం వచ్చిన ఎడల వైద్యుడు స్పైనల్ ట్యాప్ సూచించవచ్చు.

సాధారణ మందులు:

మీ డాక్టర్ అనుసరించే చికిత్సా పద్దతులు మీ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. మరియు పార్శ్వపునొప్పి ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది. చికిత్సలు లక్షణాలను తగ్గించడంలో మరియు భవిష్యత్ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి. పార్శ్వపు తలనొప్పి చికిత్సకు సంబంధించిన మందులలోని రెండు ప్రధాన విస్తృత విభాగాలు:

నొప్పినివారణ మందులు:

పార్శ్వపు తలనొప్పి లక్షణాలను తగ్గించే క్రమంలో, సాధారణంగా ఆస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ సూచించబడుతుంది. నారాట్రిప్టాన్, సుమాట్రిప్టన్, అల్మోట్రిప్టన్ మొదలైన ఇతర ట్రిప్టాన్ ఆధారిత మందులను కూడా మైగ్రేన్ చికిత్సలో ఉపయోగించవచ్చు. రక్తనాళాలు సంకోచించడం మరియు మెదడులోని నొప్పిమార్గాలను నిరోధించడం ద్వారా ఈ మందులు మైగ్రేన్ సమస్యను తగ్గించగలవు.

Most Read:పురుషాంగం లేకుండా పుట్టాడు, బయోనిక్ పెనిస్ పెట్టారు, ముప్పై నిమిషాల పాటు సెక్స్, ఆరువారాలు గ్యాప్Most Read:పురుషాంగం లేకుండా పుట్టాడు, బయోనిక్ పెనిస్ పెట్టారు, ముప్పై నిమిషాల పాటు సెక్స్, ఆరువారాలు గ్యాప్

ముందుజాగ్రత్తగా సూచించే మందులు:

తరచుగా మీరు ఎదుర్కొనే పార్శ్వపునొప్పి సంఖ్యలు, విరామాలను అనుసరించి వైద్యులు మీ ఆరోగ్యంపట్ల అవగాహనకు వస్తారు. క్రమంగా పరీక్షలు చేసిన పిదప, మందులను సూచిస్తారు. కార్డియోవాస్కులర్ మందులైన బీటాబ్లాకర్స్, ట్రైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్స్ మందులైన అమిట్రిప్టైలైన్, వాల్ప్రొయేట్ మరియు టాపిరామేట్ వంటి యాంటీ-సీజర్ మందులను ప్రధానంగా సూచించడం జరుగుతుంది.

English summary

The Four Phases of Migraine Attack and Their Symptoms

Severe throbbing pain on one side of the head is identified to be a migraine attack. It involves extreme sensitivity towards light and sound. A migraine attack can be divided into four stages: prodrome, aura, headache and postdrome. Proper medications and pain-relieving drugs are suggested to treat a migraine.
Desktop Bottom Promotion