For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిస్టిటిస్ సమస్యతో భాదపడుతున్నారా ? అయితే ఈ 8 సహజ నివారణా చిట్కాలను అనుసరించండి

సిస్టిటిస్ సమస్యతో భాదపడుతున్నారా ? అయితే ఈ 8 సహజ నివారణా చిట్కాలను అనుసరించండి

|

సిస్టిటిస్, అనేది మూత్రాశయంలోని వాపు లేదా ఎరుపు రంగులోకి మారడం వంటి పరిస్థితిని సూచిస్తుంది. ఇది ప్రధానంగా మూత్ర నాళ సంక్రమణం లేదా UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) ద్వారా సంభవిస్తుంది. సిస్టిటిస్ సమస్య భాదితులలో అధిక శాతం మంది కొన్ని రోజులలోనే కోలుకుంటారు; ఈ సమస్య దానికదే కాలానుగుణంగా తగ్గిపోతుంది. కానీ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగిన ఎడల, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది.

సిస్టిటిస్, అనేది మూత్రాశయం (కిడ్నీ) యొక్క వాపు అని పైన చెప్పుకున్నాం, ఇది సాధారణంగా మూత్ర నాళం ఇన్ఫెక్షన్స్ వలన సంభవిస్తుంది. అనేక సందర్భాల్లో, సిస్టిటిస్ కొన్ని రకాల బాక్టీరియా సంక్రమణల కారణంగా కలుగుతుంది; కానీ అనేక సందర్భాలలో సందర్భాల్లో, కొన్ని రకాల మందులు లేదా హైజీన్ ఉత్పత్తుల కారణంగా కూడా ఈ సమస్య తలెత్తవచ్చునని చెప్పబడింది. ఇది అధికమైన చికాకుతో కూడుకుని ఉంటుంది.

natural remedies for cystitis, home remedies for cystitis, how to treat cystitis

సిస్టిటిస్ వయసుతో సంబంధం లేకుండా, చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరైనా ప్రభావితం కావొచ్చు. కానీ ఇది తరచుగా అధికంగా మహిళల్లో సంభవిస్తుంది. సిస్టిటిస్ యొక్క కొన్ని లక్షణాలుగా అతి మూత్ర విసర్జన, మూత్రంలో రక్తం పడడం, సంభోగం సమయంలో తీవ్రమైన నొప్పి, కడుపులో తిమ్మిరి మొదలైనవిగా ఉన్నాయి.

సిస్టిటిస్ వ్యాధికి సంబంధించి, అత్యంత ప్రభావవంతమైన సహజ నివారణా చిట్కాలు, ఇక్కడ పొందుపరచబడ్డాయి. వివరాల కోసం వ్యాసంలో ముందుకు కదలండి.

1. క్రాన్బెర్రీస్ :

1. క్రాన్బెర్రీస్ :

క్రాన్బెర్రీస్ రసం తీసుకోవడం సిస్టిటిస్ ఉత్తమ చికిత్సా పద్దతులలో ఒకటిగా ఉంటుంది. ఇది వ్యాధి ఇన్ఫెక్షన్ లేదా వాపును నయం చేయడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రతిరోజూ 2 గ్లాసుల క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం మూలంగా మూత్రనాళంలో (లైనింగ్ ట్రాక్ట్) అంటుకుని వ్యాపించకుండా, ఈ కోలి బ్యాక్టీరియాను నివారించడంలో సహాయపడుతుంది.

2. అల్లం :

2. అల్లం :

అల్లం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా ఉందని మనకు తెలుసు. దీన్ని కూరలలో రుచి, సువాసన కోసమే కాకుండా కుకీలు, హెర్బల్ టీ మొదలైన వాటిలో కూడా వినియోగించవచ్చు. అల్లం అనేక ఔషధ గుణాలకు ప్రసిద్ది చెందింది. దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా, మూత్రాశయం ఇన్ఫెక్షన్స్ లేదా సిస్టిటిస్ వాపు చికిత్సలో ఒక శక్తివంతమైన పరిష్కారంగా ఉంటుంది.

అల్లాన్ని హెర్బల్ - టీ రూపంలో కూడా తీసుకోవచ్చు, ఇది వాపును నయం చేయడానికి సహాయపడుతుంది.

3. బ్లూబెర్రీస్ :

3. బ్లూబెర్రీస్ :

బ్లూబెర్రీస్ రుచికరంగా ఉండడమే కాకుండా, మూత్రాశయంలో వాపును చికిత్స చేయడానికి సహజ సిద్దమైన మార్గంగా కూడా ఉంటాయి. బ్లూబెర్రీస్ విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ లో సమృద్ధిగా ఉంటాయి మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి, ఇది సిస్టిటిస్కు ఒక శక్తివంతమైన నివారణగా పనిచేస్తుంది.

బ్లూబెర్రీస్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టడానికి అవసరమైన సమ్మేళనాలతో నిండి ఉంటాయి.

Most Read:ఆమె నాకంటే ఐదేళ్లు పెద్దది, పెళ్లి చేసుకుంటే సెక్స్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమైనా సమస్యలు వస్తాయాMost Read:ఆమె నాకంటే ఐదేళ్లు పెద్దది, పెళ్లి చేసుకుంటే సెక్స్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమైనా సమస్యలు వస్తాయా

4. నీరు :

4. నీరు :

సిస్టిటిస్కు సంబంధించిన సమస్యలను నివారించడానికి ముందుగా అవలంభించవలసిన సమర్ధవంతమైన మార్గం, అధికంగా నీరు తీసుకోవడం. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీటిని తీసుకోవడం కారణంగా, మూత్రంలో పేరుకుపోయిన అవశేషాలు కరిగి, క్రమంగా సాంద్రత తగ్గి, సాధారణ స్థితికి వస్తుంది. తద్వారా మూత్రం సాఫీగా ప్రవహించడం మూలంగా మూత్రనాళంలో నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. భాద నుండి పూర్తి ఉపశమనం ఇవ్వకపోయినా, నొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మూత్రాశయం నుండి హానికరమైన బ్యాక్టీరియాను సైతం తొలగిస్తుంది.

5. ప్రోబయోటిక్స్ :

5. ప్రోబయోటిక్స్ :

మీ ఆహార ప్రణాళికలో భాగంగా ప్రోబయోటిక్స్ లేదా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చేర్చడం ద్వారా వాపు కలిగించే బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడుతుంది. కెఫిర్, పెరుగు, యోగర్ట్ లేదా మజ్జిగ వంటి ఆహార పదార్థాలు ప్రోబయోటిక్స్ లేదా మంచి బ్యాక్టీరియాకు మూలంగా ఉంటాయి.

6. బేకింగ్ సోడా :

6. బేకింగ్ సోడా :

సిస్టిటిస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, బేకింగ్ సోడా వినియోగం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. బేకింగ్ సోడా మూత్రంలో ఆమ్ల తత్వాలను తటస్థం చేయడానికి మరియు బర్నింగ్ సెన్సేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసులో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కలిపి నేరుగా తీసుకోవచ్చు.

Most Read :అందమైన పెళ్లాన్ని దొరికినా నా భర్త ఏమీ చేయడు, అందుకే అతన్ని ఇంటికి పిలిపించుకునేదాన్ని #mystory295Most Read :అందమైన పెళ్లాన్ని దొరికినా నా భర్త ఏమీ చేయడు, అందుకే అతన్ని ఇంటికి పిలిపించుకునేదాన్ని #mystory295

7. వెల్లుల్లి :

7. వెల్లుల్లి :

భారతీయ వంటకాలలో వెల్లుల్లి అత్యంత కీలకమైన పదార్ధంగా ఉంటుంది. మరియు వెల్లుల్లిని వేస్తెనే ఆ వంటకం సంపూర్ణం అయిందన్న అనుభూతికి లోనవుతుంటాం. రుచి నుండి ఆరోగ్య ప్రయోజనాల వరకు అన్నిటా ప్రత్యేకంగా ఉండే వెల్లుల్లి, సిస్టిటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా అద్భుతమైన గృహ వైద్య చికిత్సగా సహాయపడుతుంది. దానిలోని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, సంక్రమణ కారణమైన బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి అలిసిన్ అని పిలువబడే ఒక మూల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది ఈ కోలి బ్యాక్టీరియాను సైతం తొలగిస్తుంది.

ప్రతిరోజూ 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం మూలంగా సిస్టిటిస్ నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది.

8. విటమిన్-సి అధికంగా గల ఆహార పదార్ధాలు :

8. విటమిన్-సి అధికంగా గల ఆహార పదార్ధాలు :

సిటిటిస్ను నయంచేసేందుకు విటమిన్-సి అధికంగా ఉండే ఆహార పదార్ధాలు ఎంతగానో సహకరిస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరం నుండి స్వేచ్ఛారాశులను (ఫ్రీ రాడికల్స్) తొలగించడంలో మరియు మూత్రాశయం వాపు వలన కలిగే నొప్పి మరియు అసౌకర్యాన్ని తొలగించడంలో సహాయపడతాయి. మూత్రాశయం వాపు విషయంలో, విటమిన్-సి మూత్రాశయాన్ని ఆక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. తద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించటానికి సహాయపడుతుంది.

విటమిన్-సి అధికంగా గల ఆహార పదార్థాలలో బొప్పాయి, టమోటాలు, పుచ్చకాయలు మరియు జామ ప్రధమంగా ఉంటాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

natural remedies for cystitis, home remedies for cystitis, how to treat cystitis

Cystitis is inflammation or redness of the bladder which is mainly caused due to urine tract infection. Mild cases of cystitis get better on its own in a few days but if the conditions don't change for a long time then it could lead to more serious conditions such as kidney infection.
Desktop Bottom Promotion