For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడ నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా పద్దతులు

మెడ నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా పద్దతులు

|

మన మెడ ప్రాంతంలో ప్రత్యేకంగా కలిగే నొప్పిని మెడనొప్పి అని పిలుస్తారు. మెడ నొప్పి అనేది దైనందిక జీవన విధానంలో సర్వసాధారణమైన అంశంగా ఉంటుది; అయితే, ఒక్కోసారి దాని తీవ్రత తీవ్రంగా పరిణమించవచ్చు. మెడ భాగం మన శరీరంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది.

ఇది పుర్రెభాగం నుండి మొండెం మద్య భాగం వరకు విస్తరించిన వెన్నుపూసతో అనుసంధానించబడి ఉంటుంది. మన శరీరంలో మెడలో కూడా పుర్రెకు మద్దతు ఇచ్చే ఎముకలు మరియు కండరాలు ఉంటాయి. క్రమంగా మెడ నొప్పి అనేది ఇతర భాగాల సమస్యలను సూచించడంలో కూడా ప్రధాన లక్షణంగా ఉంటుంది.

Neck Pain: Causes, Symptoms And Treatments

సాధారణంగా అనేకమంది కాలానుగుణంగా, కొన్ని రకాల భంగిమల కారణంగా మెడనొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో గాయాలు, ప్రమాదాల వంటి వాటివలన కూడా సంభవించవచ్చు. నొప్పి తీవ్రత దాని కారకాల మీద ఆధారపడి ఉంటుంది. .

ప్రమాదం లేదా ఇన్ఫ్లమేషన్ కారణంగా మెడనొప్పి సంభవిస్తే, ఒక్కోసారి తీవ్రంగా మారి తక్షణ వైద్య సంరక్షణ అవసరాన్ని కలిగించవచ్చు. సాధారణ నొప్పిగా ఉన్నా కూడా దీర్ఘకాలికంగా ఉన్న ఎడల వేరే ఇతర సమస్యలకు లక్షణంగా కూడా ఉండవచ్చు. కావున, మెడనొప్పి విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

మెడనొప్పికి గల కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

1. స్ట్రెయిన్ లేదా కండరాల సమస్య :

1. స్ట్రెయిన్ లేదా కండరాల సమస్య :

స్ట్రెయిన్ లేదా కండరాల సమస్య అనేది, కండరాలు విపరీతంగా ఒత్తిడికి లోనవడం వల్ల కలిగే సాధారణ సమస్య.

2. చెడు భంగిమ :

2. చెడు భంగిమ :

మెడలోని కణజాలం, స్నాయువులు మరియు కండరాలు అత్యంత మృదువుగా ఉంటాయి. కావున ఇబ్బందికరమైన లేదా చెడు కోణంలో ఎక్కువసేపు మెడను వంచడం ద్వారా మెడ కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ / ల్యాప్టాప్ ముందు పనిచేస్తున్నప్పుడు లేదా చెవికి మరియు భుజం మధ్య ఎక్కువసేపు ఫోన్ ఉంచి మాట్లాడడం మూలంగా లేదా నిద్రపోతున్నప్పుడు చెడు భంగిమల కారణంగా మెడనొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి.

3. కుదుపులు లేదా అదుర్లు :

3. కుదుపులు లేదా అదుర్లు :

వ్యాయామం చేసే సమయంలో కాని లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు కానీ వాహనాలు నడుపుతున్న సమయంలో ఒక్కోసారి కుదుపులు లేదా అదుర్లకు శరీరం ప్రభావితం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రమంగా ఈ ప్రభావం మెడమీద ఎక్కువగా పడుతుంది.

4. అధిక ఒత్తిడి :

4. అధిక ఒత్తిడి :

ఒక్కోసారి బరువులను ఎత్తడంలో మరియు యోగాభ్యాసం(ఉదాహరణ:శీర్షాసనం) చేయు సమయంలో మెడ మీద అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా సున్నితమైన కండరాలు ఉన్న మెడ భాగం తీవ్ర ప్రభావానికి లోనై నొప్పికి కారణం అవుతుంది.

5. ప్రమాదం లేదా గాయం:

5. ప్రమాదం లేదా గాయం:

శరీరంలోని మిగిలిన భాగాలతో పోల్చినపుడు మెడ భాగం అత్యంత సున్నితంగా ఉంటుంది. కావున ప్రమాదాలకు, గాయాలకు అధిక అవకాశాలు ఉంటాయి. ఈ గాయాలు చిన్నవి లేదా పెద్దవి కావచ్చు. కొన్ని సందర్భాలలో గాయాలు తగ్గుముఖం పట్టినా, మెడ కండరాల నొప్పులు మాత్రం దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది.

 6. మెనింజైటిస్:

6. మెనింజైటిస్:

మెనింజైటిస్ మెడనొప్పికి కారణమయ్యే అత్యంత సాధారణమైన వ్యాధి లేదా అనారోగ్యం. ఇది బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలుగుతుంది. ముఖ్యంగా జలుబు లేదా శ్వాస సంబంధిత రోగాల మూలంగా మెనింజైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంచేత మెడ భాగాలలో తీవ్రమైన వాపు మరియు నొప్పి కలుగుతుంటుంది. కొన్ని సందర్భాలలో వీటి తీవ్రత వలన మెడను పక్కకు కూడా తిప్పలేని పరిస్థితులకు లోనవడం పరిపాటి.

7. ఆర్థరైటిస్ :

7. ఆర్థరైటిస్ :

ఆర్థరైటిస్ సాధారణంగా తీవ్రమైన కీళ్లనొప్పులకు కారణంగా ఉంటుంది. మెడలోని కండరాల సున్నితత్వం మూలంగా, ఈ ఆర్థరైటిస్ వ్యాధికి గురైనవారు మెడ నొప్పులను కలిగి ఉండడం సర్వసాధారణమైన అంశంగా ఉంటుంది. ఆర్థరైటిస్ వ్యాధి కలిగినవారు మెడలోని డిస్క్ నష్టాలను చవిచూడవలసి వస్తుంది కూడా. క్రమంగా మెడ ఒకవైపునకు వంగి ఉండటం., మరియు మెడ బలహీనతకు కారణమవుతుంది.

8. గుండెపోటు:

8. గుండెపోటు:

ఒకవేళ దీర్ఘకాలికంగా మెడనొప్పి వేధిస్తున్న ఎడల ఈస్థితి గుండెపోటు కూడా కారణం కావచ్చు. హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే సమయంలో రక్తం గడ్డకట్టడం మూలంగా గుండెపోటు కలిగే అవకాశాలు ఉంటాయి. క్రమంగా మెడ ప్రాంతాలలో కూడా రక్తం సరఫరాకు ఆటంకం ఏర్పడటం మూలంగా మెడ నొప్పి అనేది సర్వసాధారణమైన అంశంగా ఉంటుంది.

పైన చెప్పిన ఈ 8 అంశాలు మెడనొప్పికి సర్వసాధారణమైన కారకాలుగా ఉన్నాయి. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు, క్రమం తప్పని వ్యాయామం, మంచి ఆహార ప్రణాళిక, వైద్య పర్యవేక్షణ మొదలైన వాటిద్వారా శరీర జీవక్రియలను నిర్వహించుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. సమస్య వచ్చాక వైద్యుని వద్దకు వెళ్ళడం కన్నా సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మిన్న అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. ముఖ్యంగా దీర్ఘకాలిక మెడ నొప్పులు ఉన్నట్లయితే, అవి వేరే ఇతర వ్యాధులకు ప్రధాన లక్షణాలుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

పైన చెప్పిన అంశాలతో పాటు శ్వాసకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. క్రమంగా ధూమపానం మరియు ఇతర కాలుష్య కోరలకు గురికాకుండా‌ జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిచో గొంతు ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సంక్రమణ రోగాలు కలగడం ద్వారా గొంతు నొప్పి లేదా దవడ భాగములో నొప్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున చిన్న సమస్య అని తేలికగా తీసుకోకుండా వైద్యుని సంప్రదించి తగు సూచనలు జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక్కోసారి చిన్న సమస్యలే ప్రాణాంతకంగా మారే అవకాశాలు లేకపోలేదు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య, వ్యాయామ, ఆహార, జీవన శైలి, ఆద్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Neck Pain: Causes, Symptoms And Treatments

Our necks consist of bones & muscles which support the skull. Some common reasons for having neck pain are strain, bad posture, jerking, overexertion, injury, meningitis, arthritis or heart attack. Scans & blood tests are taken to analyse neck pain. Acupuncture, chiropractic treatment, physical therapy, antioxidants
Desktop Bottom Promotion