For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలేమి సమస్యను నివారించే 11 ఇండియన్ హోం రెమెడీస్

తగినంత నిద్ర వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది. అయితే, కొంత మంది నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యతో ఇబ్బందులకు గురవుతారు. అనేక కారణాల వలన నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. సరైన నిద్ర లే

|

తగినంత నిద్ర వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది. అయితే, కొంత మంది నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యతో ఇబ్బందులకు గురవుతారు. అనేక కారణాల వలన నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. సరైన నిద్ర లేకపోవటం వలన అలసట, బలహీనత, ఒత్తిడి తలనొప్పులు, చికాకు, డిప్రెషన్ తో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అర్థరాత్రి రెండింటి వరకూ నిద్రపట్టకపోతే మీరు నిద్రలేమి సమస్యకు గురయ్యారని అర్థం. ఈ డిసార్డర్ కు సంబంధించి అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దలకు సగటున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నిద్ర అనేది అవసరమవుతుంది. లేదంటే, ఆరోగ్యం క్షీణిస్తుంది.

సాధారణంగా ఇన్సోమ్నియా అనేది రెండు రకాలు. అక్యూట్ ఇన్సోమ్నియా అలాగే క్రానిక్ ఇన్సోమ్నియా గా ఇన్సోమ్నియాని వర్గీకరించారు. అక్యూట్ ఇన్సోమ్నియా అనేది చికిత్సతో పనిలేకుండా దానంతట అదే నయమవుతుంది. క్రానిక్ ఇన్సోమ్నియా అనేది వారానికి మూడు సార్లు సంభవించవచ్చు. ఈ సమస్య మరింత తీవ్రతరం కావచ్చు.

ఇటువంటి క్రానిక్ ఇన్సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన అనారోగ్యకరమైన అలవాట్ల వలన సంభవిస్తుంది. లేట్ నైట్ షిఫ్ట్స్ తో పాటు కొన్ని ఆరోగ్య సమస్యల వలన క్రానిక్ ఇన్సోమ్నియా బారిన పడవచ్చు. ఇన్సోమ్నియా ను అరికట్టే పదకొండు ఇండియన్ హోంరెమెడీస్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం.

1. వేడినీటి స్నానం

1. వేడినీటి స్నానం

నిద్రపోవడానికి రెండు గంటల ముందు వేడినీటి స్నానం చేయడం ద్వారా ఇన్సోమ్నియా సమస్యను నివారించవచ్చు. ఇన్సోమ్నియాతో బాధపడే మహిళలు నిద్రపోవతటానికి కనీసం 90 నిమిషాల ముందు వేడి నీటి స్నానం చేయటం ద్వారా నిద్రలేమి సమస్యను కొంత వరకు నివారించగలిగారని ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. వేడినీటి స్నానం వలన శరీరం అనేది విశ్రాంతి పొంది నరాలకు తగినంత ఉపశమనం లభిస్తుంది.

చమోమైల్, రోజ్ వాటర్, ల్యావెండర్ వంటి కొన్ని చుక్కలఎసెన్షియల్ ఆయిల్స్ ను స్నానపు నీటిలో వేసుకుంటే శరీరపు అలసట తగ్గి నిద్రపడుతుంది.

2. ఆపిల్ సీడర్ వినేగార్

2. ఆపిల్ సీడర్ వినేగార్

ఆపిల్ సిడర్ వినేగార్ లో లభించే అమినో యాసిడ్స్ వలన అలసట తగ్గుతుంది. అలాగే, ఫ్యాటీ యాసిడ్స్ ని విచ్చిన్నం చేయడానికి ఆపిల్ సిడర్ వినేగార్ ఉపయోగపడుతుంది.అంతే కాక, స్లీప్ సైకిల్ ని సరి చేయడానికి కూడా ఈ పదార్థం ఉపయోగపడుతుంది.

రెండు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ని అలాగే రెండు టీస్పూన్ల తేనెని ఒక గ్లాసుడు వెచ్చటినీళ్లలో కలపండి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తాగండి.

3. మెంతి నీళ్లు

3. మెంతి నీళ్లు

ప్రతి రోజు క్రమం తగ్గకుండా మెంతి నీళ్లు తాగటం ద్వారా శరీరం సరిగ్గా పనిచేస్తుంది. తద్వారా, సరైన నిద్ర కలుగుతుంది. ఇన్సోమ్నియాను, ఆందోళనను, తల తిరగటాన్ని తగ్గించే సామర్థ్యం మెంతులలో కలదు.

ఒక పాత్ర నిండా నీళ్లు తీసుకుని అందులో ఒక టీస్పూన్ మెంతిగింజలను కలపండి. వీటిని రాత్రంతా నానబెట్టండి.

ఈ నీళ్లను వడగట్టి ప్రతిరోజూ తీసుకోండి.

4. వెచ్చటి పాలు

4. వెచ్చటి పాలు

నిద్రపోయే ముందు వెచ్చటి పాలను తీసుకుంటే మనసుతో పాటు శరీరం విశ్రాంతి పొందుతుంది. ఇందులో, మంచి నిద్రను ప్రోత్సహించే ట్రీప్టోఫన్ కలదు.

ఒక గ్లాసుడు పాలను మరిగించి అందులో ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు త్రాగండి.

5. అరటిపండ్లు

5. అరటిపండ్లు

అరటిపండులో ఇన్సోమ్నియాను అరికట్టే లక్షణాలు అనేకం కలవు. ఇందులో, ఐరన్, కేల్షియం తో పాటు పొటాషియం కలవు. ఇవి మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.

నిద్రపోయే ముందు ఒక అరటిపండును తీసుకోవాలి. లేదా అరటిపండు సలాడ్ లో తేనెను కలిపి తీసుకోవాలి.

6. చమోమైల్ టీ

6. చమోమైల్ టీ

చమోమైల్ టీ అనేది ఇన్సోమ్నియాకు సరైన హోంరెమెడీ. ఒక కప్పుడు చమోమైల్ టీని తీసుకోవడం ద్వారా ఇన్సోమ్నియా సమస్యను అరికట్టవచ్చు. తద్వారా, తగిన విశ్రాంతిని పొందవచ్చు.

ఒక కప్పుడు నీళ్లను మరగబెట్టి అందులో చమోమైల్ ఫ్లవర్స్ ను జోడించండి.

అయిదు నిమిషాల పాటు మరగబెట్టి ఆ తరువాత వడగట్టి నిద్రపోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోండి.

7. కుంకుమ పువ్వు

7. కుంకుమ పువ్వు

ఇన్సోమ్నియా వంటి నిద్రకు సంబంధించిన సమస్యలను నిర్మూలించడానికి కుంకుమ పువ్వు అమితంగా తోడ్పడుతుంది. తద్వారా, మనసుని అలాగే శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.

రెండు కుంకుమ పువ్వు రెక్కలను ఒక కప్పుడు వెచ్చటి పాలలో కలిపి నిద్రపోవడానికి ముందు ఈ పాలను తీసుకోండి.

8. జీలకర్ర

8. జీలకర్ర

వంటలలో విరివిగా వాడే జీలకర్రలో అనేకమైన ఔషధ గుణాలున్నాయి. మంచి నిద్రను ప్రోత్సహించే లక్షణాలు జీలకర్రలో అనేకం కలవు. అలాగే, జీర్ణక్రియ సమస్యలను కూడా అరికట్టడంలో జీలకర్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఒక కప్పుడు జీలకర్ర టీని తీసుకోవచ్చు. లేదా ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని ఒక అరటిపండు గుజ్జులో కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తీసుకోవాలి.

9. సోంపు నీళ్లు

9. సోంపు నీళ్లు

సోంపు అనేది శరీరాన్ని ప్రశాంతపరిచే ఒక అద్భుతమైన స్పైస్. ఇది, నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఈ స్పైస్ ని వంటలలో విరివిగా వాడతారు. మెడికేషన్స్ వలన కలిగే దుష్ప్రభావాలను తొలగించటానికి ఈ స్పైస్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక టేబుల్ స్పూన్ సోంపును గ్లాసుడు నీళ్లలో కలపండి. రెండు గంటల తరువాత ఈ నీటిని వడగట్టి తీసుకోండి.

10. తేనె

10. తేనె

తేనెలో మంచి నిద్రను ప్రోత్సహించే గుణాలు అనేకం. ఇది తీసుకున్నవెంటనే మీకు మంచి నిద్ర లభిస్తుంది. సహజమైన రా హానీలో ఇన్సోమ్నియాను అరికట్టే లక్షణాలు అనేకం ఉన్నాయి.

వెచ్చటి నీటిలో తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తీసుకోవాలి.

11. హెర్బల్ టీలు

11. హెర్బల్ టీలు

మంచి నిద్రను ప్రోత్సహించడానికి హెర్బల్ టీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇన్సోమ్నియాను అరికట్టే సామర్థ్యం వీటిలో అధికం. శరీర ఉష్ణోగ్రతను పెంపొందించి నిద్రను పెంచేందుకు హెర్బల్ టీస్ తోడ్పడతాయి.

చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటి ఏవైనా మీకు నచ్చిన హెర్బల్ టీను నిద్రపోయే ముందు తీసుకోండి.

English summary

Top 11 Indian Home Remedies For Insomnia

Insomnia is a common sleep disorder which is characterized by staying asleep or difficulty in falling asleep. If you have been awake till 2 AM, then you are suffering with insomnia. It is one of the least-understood sleep disorders. Adults need an average of 8-9 hours of sleep daily at night, otherwise it could cause a lot of health conditions.
Story first published:Wednesday, January 17, 2018, 12:22 [IST]
Desktop Bottom Promotion