For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి నీళ్ళతో స్నానం మీ గుండెకు మంచిదేనా? అధ్యయనాలు ఏం చెప్తున్నాయి?

వేడి నీళ్ళతో స్నానం మీ గుండెకు మంచిదేనా? అధ్యయనాలు ఏం చెప్తున్నాయి?

|

కార్డియోవస్క్యులర్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకి ప్రధానకారణంగా ఉన్నాయి. మరియు వీటిలో 90% నిరోధించగలిగే విధంగా ఉన్నాయని అనేక పరిశోధనలు నిరూపించాయి కూడా. వీటిలో అధికభాగం ప్రధానంగా వ్యక్తి యొక్క జీవనశైలి వలనే కలుగుతుందని తేలింది. ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, శారీరక కార్యకలాపాలు లేకపోవడం, అధిక మద్యం వినియోగం, అసమతుల్య ఆహారం, ఒత్తిడి, ఆందోళన మొదలైనవి ప్రధాన కారణంగా పరిణమిస్తున్నాయి.

కార్డియోవస్క్యులర్ వ్యాధులు వాటి ప్రారంభ దశల్లో గుర్తించగలిగి, చికిత్సను అందిస్తే తగ్గుముఖం పట్టగలవు. మరియు పూర్తిగా నిరోధించబడతాయి కూడా. కానీ ఆలస్యమయ్యే కొలదీ, పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Why Hot Bath Could Be Good For Your Heart

ఆరోగ్యకరమైన ఆహారం మరియు శారీరక శ్రమతో మీ బరువును పక్కాగా నిర్వహించడం, ధూమపానం మరియు అధిక మద్యపానం నుండి దూరంగా ఉండటం, ఉప్పు వినియోగం తగ్గించడం మరియు కార్డియోవస్కులర్ వ్యాధులకు దారితీసే ఇతర అంశాలకు దూరంగా ఉండడం, ఆహారప్రణాళికలలో ప్రధానమార్పులు, వ్యాయామం మొదలైన వాటి ద్వారా ఈ వ్యాధుల నుండి కొంతమేర దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తుంటారు.

జపాన్లో పరిశోధకులు ఈ గుండె సంబధిత వ్యాధులను నివారించడానికి ఒక వినూత్న మార్గాన్ని ప్రవేశపెట్టారు. అదే వేడినీటి స్నానం.

కళాశాల లేదా కార్యాలయాలలో సుదీర్ఘమైన పని మరియు తీవ్రమైన ఒత్తిడి తర్వాత, వేడినీటి షవర్ కింద చేరడం మంచిదని వీరి అభిప్రాయం. ఈ అలవాటు ద్వారా కండరాల విశ్రాంతిని అనుభూతి చెందుతారు., లేదా వేడినీటి టబ్లో కాసేపు ఉండడం కూడా మంచిదే.

ఇవి పేరుకు చిన్న విషయాలే అయినా కూడా గుండె ఆరోగ్యం దిశగా అద్భుతమైన పనితీరుని కనపరుస్తాయని వైద్యులు ధృవీకరిస్తున్నారు. స్నానం అనేది కేవలం ప్రతిరోజూ మిమ్మల్ని శుభ్రపరచుకునే చర్యగా భావిస్తాము, కానీ దానికంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది.

1. చర్మాన్ని శుభ్రపరచుకోవడం:

1. చర్మాన్ని శుభ్రపరచుకోవడం:

చర్మాన్ని శుభ్రపరచడం అని అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది అదనపు ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వేడినీరు మీ బాహ్యచర్మాన్నే కాకుండా చర్మం లోపలి పొరలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మీ చర్మం యొక్క రంధ్రాలను తెరవడానికి మరియు మృతకణాలను, దుమ్ము మరియు చర్మానికి హాని కలిగించే విషతుల్య మలినాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

2. మెదడు మరియు నరాల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

2. మెదడు మరియు నరాల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

మీరు వేడినీటిలో స్నానం చేసినప్పుడు లేదా బాత్ టబ్లో వేడినీటిలో కాసేపు మునుగునట్లు ఉండడం ద్వారా, మీ నాడీవ్యవస్థ విశ్రాంతికి లోనవడం, నొప్పి మరియు వాపు తగ్గడం వంటి చర్యలకు దోహదపడడమే కాకుండా ఒత్తిడి మరియు ఆందోళనను కూడా తగ్గిస్తుంది.

3. సరైన నిద్ర కోసం :

3. సరైన నిద్ర కోసం :

వేడినీరు శరీరానికి ఉపశమనం కలిగించేది మాత్రమే కాకుండా, శరీర కండరాలకు కూడా విశ్రాంతిని ఇస్తాయి. తద్వారా మీ శరీరానికి భౌతికంగా మరియు మానసికంగా సడలింపు లభించినట్లవుతుంది. మానసిక ప్రశాంతత తోడై, మంచి నిద్రకు సహాయపడగలదు. క్రమంగా గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది.

4. బరువు కోల్పోవడం:

4. బరువు కోల్పోవడం:

మధుమేహంతో బాధపడుతున్న రోగులు క్రమం తప్పకుండా వేడినీటితో స్నానం చేయడం మూలంగా 2.5 పౌండ్ల బరువును కోల్పోతారని అధ్యయనాలలో తేలింది. వేడినీటి స్నానం రక్తంలోని గ్లూకోజ్ మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది.

5. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:

5. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:

వేడినీటిలో స్నానం చేయడం మీ శరీర రక్తనాళాలకు వ్యాయామం వలె ఉంటుంది. గుండెకు సరైన రక్త ప్రసరణ అందివ్వడంలో సహాయం చేయగలదు. తద్వారా ఆరోగ్యకర హృదయ స్పందనలు నమోదవుతాయి. గుండె, శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరియు రక్తంలోని ప్రాణవాయువు అన్ని భాగాలకు చేరడం అత్యవసరం. వేడినీటితో స్నానం మూలంగా గుండెకు రక్త ప్రసరణ బాగుగా జరగడం మూలంగా దాని చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయపడగలదు.

జపాన్లోని ఒక విశ్వవిద్యాలయంలో 850మంది పురుషులు మరియు మహిళలతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం వ్యక్తి యొక్క స్నానం సమయం, వ్యవధి, స్నానాల సంఖ్యను పరిగణనలోనికి తీసుకుని , ఐదు సంవత్సరాల కాలం వీటి గణాంకాలను నమోదు చేసుకుని క్రమంగా నివేదికలు ఇవ్వడం జరిగినది.

ఐదు సంవత్సరాలలో,ఈ 870 మంది వ్యక్తుల ఆరోగ్యం రికార్డు నిర్వహించబడింది. ఈ నివేదికలలో, ధమనులు గట్టిపడటం గురించిన వివరాలను సేకరించడం జరిగింది. వాటికి కారణమైన , కెరోటిడ్ ధమనిలోని రెండు పొరల మద్య విడుదలైన హార్మోన్ల ప్రభావాలే కారణమని తేలింది. ఈ అధ్యయనంలో, వారంలో కనీసం ఐదు సార్లు వేడినీటి స్నానాలు చేసిన వారిలో స్ట్రోక్ లేదా ఇతర హృదయ వ్యాధుల ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు తేలింది.

ఇక్కడ అసలు ఉద్దేశం ప్రకారం, వేడినీటి స్నానంలో వ్యక్తి పూర్తిగా మునుగునట్లు స్నానం చేయడం ద్వారా పాదాల నుండి గుండె వరకు గల రక్తప్రవాహం క్రమబద్దీకరించబడుతుంది. మరియు అధిక రక్తపోటును తగ్గిస్తుంది. వేడినీరు శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుంది, ఇది శరీరానికి ఒకరకమైన వ్యాయామాన్ని ఇవ్వగలుగుతుంది. ఏవైనా గట్టిపడిన లేదా నిరోధించబడిన ధమనుల తీవ్ర ప్రభావాలను తగ్గిస్తాయి.

అలాగని ప్రతి ఒక్కరికీ వేడినీటి స్నానమే ప్రధానమని చెప్పడం కాదు. ముఖ్యంగా, తక్కువ రక్తపోటు, స్క్లెరోసిస్ వంటి రోగనిరోధక శక్తి తగ్గుదల వంటి సమస్యలు, మూర్ఛ వ్యాధి వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వేడినీటి స్నానం సూచించలేము. ఇవి వారికి సమస్యలను మరింత జఠిలం చేయవచ్చు.

అంతేకాకుండా, ఈ అధ్యయనం ఆ వ్యక్తుల గుండెను ఆరోగ్యంగా ఉంచే ఏ ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకోకుండానే చేయబడింది. మరియు వేడినీటిని వినియోగించడం మాత్రమే కాకుండా, శారీరక కార్యకలాపాలు, అలవాట్లు, ధ్యానo వంటి ఒత్తిడిని తగ్గించే మార్గాలు మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అందుచేత, వేడినీటి వలన మాత్రమే గుండె సమస్యలు తగ్గుతాయి అనడానికి ఎటువంటి ఆస్కారమూ లేకుండా పోయింది, మరియు ఇంకనూ చర్చనీయాంశంగానే ఉంది.

కొందరు పరిశోధకులు వ్యతిరేక ఫలితాలతో ముందుకు వచ్చారు కూడా, వారి ఉద్దేశం ప్రకారం గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారికి వేడినీరు మంచిది కాదు, మరియు వేడినీటి టబ్స్ వినియోగం కూడా మంచిది కాదు.

గుండె సంబంధిత సమస్యలు కలిగి ఉన్న రోగి వేడినీటి స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం మరియు హృదయనాళ వ్యవస్థలో కొంచెం ఒత్తిడికి గురవడం వంటి సమస్యలు కలుగుతాయి, ఈ సమస్య అధిక హృదయ స్పందన రేటుకు దారితీస్తుంది. మరియు ఇప్పటికే గుండె పనితీరు తగ్గినవారు, ధమనులలో క్రొవ్వు పేరుకుని ఉన్న వారు, మరియు హృదయ స్పందన రేటు సరిగ్గా లేని వారికి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు అని వారి అభిప్రాయం.

మీరు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలను కలిగి ఉన్న ఎడల , మరియు వారంలో 5గంటలు వేడినీటి స్నానానికి సమయం కేటాయించాలని భావిస్తున్న ఎడల, మీపరిస్థితిని గురించిన అవగాహన తెచ్చుకునే క్రమంలో భాగంగా, మరియు సూచనలకై వైద్యుని సంప్రదించడం మంచిది. నీరు ఎంత మోతాదులో వేడిగా ఉండవచ్చో కూడా వైద్యులు మీకు ద్రువీకరిస్తారు.

వేడినీటి స్నానాలు ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. కేవలం హృదయ సంబధిత విషయాలకే కాకుండా, అనేక ఇతర సమస్యలకు కూడా వేడినీటి స్నానం మంచిదిగా సూచిస్తుంటారు. ఉదాహరణకు నెమ్ము, ఆస్థమా వంటి ఊపిరితిత్తుల సంబంధిత లేదా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న ఎడల, చన్నీటి స్నానం మంచిది కాదు. వీరికి వేడినీటి స్నానం ఉపశమనాన్ని ఇస్తుంది.

వేడినీటి స్నానం అలసిపోయిన శరీరానికి విశ్రాంతినివ్వడమే కాకుండా, రక్తపోటును తగ్గించడంలో, అవయవాలకు రక్త ప్రసరణ పెంచడంలో, శరీరానికి సరైన నిద్రను ఇవ్వడంలో, తలనొప్పి తగ్గించడంలో, హార్మోనులను సమతుల్యం చేయడంలో అనేక లాభాలను కలిగి ఉంటాయి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Why Hot Bath Could Be Good For Your Heart

Unhealthy lifestyle and other ailments like diabetes, high BP, obesity, etc. cause cardiovascular diseases. Japanese researchers came up with a way to get rid of blockages in arteries by bathing in hot water. The benefits of bathing in hot water are that it cleanses the skin, improves blood circulation, sleep patterns, brain
Desktop Bottom Promotion