For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19 Vaccination:కరోనా టీకా కావాలంటే.. ఇలా దరఖాస్తు చేసుకోండి...

కోవిద్ -19 వ్యాక్సిన్ కోసం ఆన్ లైనులో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుతం మన దేశంలో మూడో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశ, రెండో దశ పూర్తయ్యాయి.

How to Register for COVID Vaccine Online

తొలి దశలో కరోనా వారియర్స్ కు టీకా వేయగా.. సెకండ్ ఫేస్ లో 60 ఏళ్లు పైబడిన వారికి టీకా వేశారు. ఇప్పుడు 45 నుండి 59 ఏళ్ల వయసు వారికి కరోనా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు.

How to Register for COVID Vaccine Online

ఈ సందర్భంగా మీరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే.. మీరు కరోనా కేంద్రాల వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుండే..

How to Register for COVID Vaccine Online

కేవలం కొన్ని క్లిక్స్ చేసి కరోనా వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు.. మీకు నచ్చిన సమయంలో వెళ్లి డోసులను వేయించుకోవచ్చు. ఈ సందర్భంగా ఇంటర్నెట్లో ఈ వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...

వ్యాక్సిన్ కావాలంటే..

వ్యాక్సిన్ కావాలంటే..

మీరు కోవిద్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే.. Co-win వెబ్ సైటులో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆరోగ్యసేతు యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్లో లేదా ఆన్ లైన్ లో Co-WIN యాప్ లేదనే సంగతి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కేవలం అధికారుల కోసం మాత్రమే. అయితే ఆరోగ్య సేతు యాప్ లో అందరికీ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది.

వీటిని చెప్పాల్సిన పని లేదు..

వీటిని చెప్పాల్సిన పని లేదు..

కోవిద్ వ్యాక్సిన్ కావాలనుకునే వారు కేవలం https://www.cowin.gov.in/వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆరోగ్య సేతు యాప్ లో అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా మీకు ఫోన్ చేసినా, మీ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకేసారి ముగ్గురు..

ఒకేసారి ముగ్గురు..

https://www.cowin.gov.in/ వెబ్ సైట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. మీకు ఇష్టమైన సమయంలో టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒక నెంబరుపై మొత్తం ముగ్గురి వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. మొదటి డోస్, రెండో డోస్ కు స్లాట్స్ ను సులభంగా బుక్ చేయొచ్చు.

కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కొత్త ఆరోగ్య సమస్య ... ఇంకా ఏమి జరగబోతోంది?కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కొత్త ఆరోగ్య సమస్య ... ఇంకా ఏమి జరగబోతోంది?

రిజిస్టర్ చేయండిలా..

రిజిస్టర్ చేయండిలా..

* ముందుగా కోవిన్ ttps://www.cowin.gov.in/ఓపెన్ చేయండి. లేదా ఆరోగ్యసేతు యాప్ లో ‘Vaccination' అనే ఐకాన్ పై క్లిక్ చేయండి.

* మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.

* అప్పుడు మీ ఫోన్ కు ఓటీపి వస్తుంది.

* ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత Verify పైన క్లిక్ చేయండి.

* ఆ తర్వాత వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.

మెసెజ్ రూపంలో

మెసెజ్ రూపంలో

* మీ వద్ద ఉన్న ఏదైనా ఐడీ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి. *

మీ పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏదైనా ఐడీని అప్ లోడ్ చేయండి.

* మీకు ఇతర రోగాలున్నాయా? లేదా అనే ప్రశ్నకు సమాధానమివ్వండి.

* 45 వయసు దాటిన వారైనా, ఇతర రోగాలు ఉన్నా డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

* ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

* ఆ తర్వాత మీ వివరాలను చూసుకోండి.

* ఒకే ఫోన్ నెంబరుతో ఇతరుల పేర్లను నమోదు చేయొద్దు.

* రిజిస్ట్రేషన్ తర్వాత అపాయింట్ మెంట్ పై క్లిక్చ చేయండి.

* ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, టౌన్, పిన్ కోడ్ వంటివి సెలెక్ట్ చేయాలి.

* డేట్, టైమ్ సరిచూసుకుని దానిపై క్లిక్ చేయాలి.

* రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు మీకు మెసెజ్ రూపంలో వస్తాయి.

కరోనా టీకా తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయని మీలో ఎవరికైనా తెలుసా?కరోనా టీకా తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయని మీలో ఎవరికైనా తెలుసా?

ఉచితంగానే వ్యాక్సిన్..

ఉచితంగానే వ్యాక్సిన్..

ఈ కరోనా వ్యాక్సిన్ కోసం మీరు ఎవ్వరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. అయితే ఇవన్నీ ప్రభుత్వాసుపత్రులలో మాత్రమే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే రూ.250 సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ డౌన్ లోడ్..

సర్టిఫికెట్ డౌన్ లోడ్..

ఆరోగ్యసేతు లేదా కోవిన్ వెబ సైట్ నుండి మీరు మొదటి డోస్ కు అపాయిట్ మెంట్ క్యాన్సిల్ చేస్తే.. ఆటోమేటిక్ గా రెండోది కూడా క్యాన్సిల్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. మీరు కరోనా డోసు తీసుకున్న తర్వాత, మీరు ఆరోగ్య సేతు, డిజీ లాకర్, కోవిన్ వెబ్ సైట్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. దాన్ని మీరు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary

How to Register for COVID Vaccine Online

On 1 April, the third phase of COVID-19 vaccination begins, with people aged 45 or above without any comorbidities are eligible to get vaccinated. You can register onsite by going to the nearest vaccination centre after 3 PM or can register online, which is the smartest option here, amidst rising Covid-19 cases in the country.
Desktop Bottom Promotion