For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అరుదైన వ్యాధితో అతినిద్ర... అది కూడా ఏకంగా ఏడాదికి 300 రోజులు నిద్రలోనే...

హైపర్ సోమ్నియా అంటే ఏమిటి? దాని లక్షణాలు, నివారణ గురించి తెలుసుకుందాం.

|

సాధారణంగా మనం రోజుకు ఆరు లేదా ఏడెనిమిది గంటలు నిద్ర పోతూ ఉంటాం. అంతకంటే ఓ గంట ఎక్కువసేపు పడుకుంటేనే కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావని అంటూ ఉంటారు. కానీ కుంభకర్ణుడిని మించిన ఓ వ్యక్తి రాజస్థాన్లో ఉన్నాడు.

Hypersomnia: Causes, Symptoms, Diagnosis and Treatment in Telugu

పూర్ఖారం అనే వ్యక్తి నిరంతరం 25 రోజుల పాటు నిద్రిస్తాడట. అంతేకాదు ఏడాదిలో ఏకంగా 300 రోజుల పాటు నిద్రలోనే గడిపేస్తాడట. దీంతో తను నిర్వహిస్తున్న దుకాణాన్ని నెలలో కేవలం ఐదు రోజులే తెరుస్తాడట. 23 ఏళ్ల క్రితమే ఇతను అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. అయితే 42 ఏళ్లు వచ్చే సరికి పరిస్థితులు అద్వానంగా మారాయి.

Hypersomnia: Causes, Symptoms, Diagnosis and Treatment in Telugu

తను రోజు వారీ నిద్ర నుండి 7 నుండి 8 రోజుల నిద్ర చివరికి దాదాపు 20 నుండి 25 రోజుల వరకు పెరిగింది. హెచ్ పిఎ యాక్సిస్ హైపర్ సోమ్నియా అని పిలువబడే ఈ అరుదైన వ్యాధి అతని ఆరోగ్యాన్ని, జీవశైలిని బాగా ప్రభావితం చేసింది. అతినిద్ర నుండి బయటపడేందుకు తన బాడీ సహకరించడం లేదు. ఇతర సంబంధిత లక్షణాల మాదిరిగా తీవ్రమైన తలనొప్పి కూడా వస్తోంది. పూర్ఖారామ్ రోజువారీ పనులైన స్నానం మరియు తినడం వంటి వాటికి తను నిద్రపోతున్నప్పుడు అతని కుటుంబసభ్యులే సహాయం చేస్తారు. ఈ సందర్భంగా హైపర్ సోమ్నియా అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది.. దీని లక్షణాలేంటి.. ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Real life Kumbhkarna: కలియుగ కుంభకర్ణ..! ఏడాదికి ఏకంగా 300 రోజులు నిద్రలోనే...!Real life Kumbhkarna: కలియుగ కుంభకర్ణ..! ఏడాదికి ఏకంగా 300 రోజులు నిద్రలోనే...!

హైపర్ సోమ్నియా అంటే ఏమిటి?

హైపర్ సోమ్నియా అంటే ఏమిటి?

HPA Axis హైపర్ సోమ్నియా అనేది చాలా అరుదైన నిద్ర రుగ్మత. ఇది ఒక వ్యక్తి ఎక్కువ గంటలు నిద్రపోయేలా చేస్తుంది. దీని వల్ల మొత్తం ఆరోగ్యం మరియు జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. యాక్సిస్ హైపర్ సోమ్నియా అనేది మెదడులోని హెచ్చుతగ్గుల కారణంగా సంభవించే ఒక రకమైన వ్యాధి. దీన్నే టిఎన్ఎఫ్-అల్పా అని పిలుస్తారు. ఇది సాధారణంగా స్లీప్ అప్నియా, నార్కో లెప్సీ మరియు ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా వంటి అతి నిద్రకు సంబంధించిన రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.

ప్రాథమిక లక్షణాలు..

ప్రాథమిక లక్షణాలు..

హైపర్ సోమ్నియా అనేది ఒక రోజులో అధిక నిద్రను అనుభవించే ఒక పరిస్థితి. దీన్ని ఎక్కువగా పగటి నిద్ర(EDS)అని కూడా పిలుస్తారు. హైపర్ సోమ్నియా అనేది స్వయంగా డెవలప్ మెంట్ చెందుతుంది. ఇవి రెండు రకాలుంటాయి. ప్రాథమికంగా యాక్సిస్ హైపర్ సోమ్నియాగా వర్గీకరించారు. ఇందులో అంతర్లీన వైద్య పరిస్థితులు లేవు. సెకండరీ హైపర్ సోమ్నియా ఇతర వైద్య పరిస్థితుల వల్ల వస్తుంది. వీటిలో స్లీప్ అప్నియా, పార్కిన్సన్స్ వ్యాధి, మూత్ర పిండాల వైఫల్యం, దీర్ఘకాలిక ఫెటీగ్ సిండ్రోమ్ ఉన్నాయి. హైపర్ సోమ్నియా అనేది రాత్రి పూట నిద్రలేకపోవడం లేదా అలసిపోయిన వాటి అనుభూతికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దీని వల్ల సుదీర్ఘకాలం నిద్రపోతారు.

హైపర్ సోమ్నియాకు కారణాలేంటి..

హైపర్ సోమ్నియాకు కారణాలేంటి..

ప్రాథమిక హైపర్ సోమ్నియా నిద్ర మరియు మేల్కొనడం వంటివి మెదడు వ్యవస్థలోని నియంత్రణ సమస్యల వల్ల వస్తుంది.

స్లీప్ అప్నియా వంటి అలసట లేదా తగినంత నిద్రకు కారణమయ్యే పరిస్థితుల వల్ల సెకండరీ హైపర్ సోమ్నియా వస్తుంది.

కొన్ని మందులు కూడా హైపర్ సోమ్నియాకు కారణమవుతాయి.

తరచుగా మాదకద్రవ్యాలు మరియు మద్యపానం పగటిపూట నిద్రను ప్రేరేపిస్తాయి.

తక్కువ థైరాయిడ్ పనితీరు మరియు తలగాయం ఇతర సాధారణ కారణాల వల్ల వస్తుంది.

పసుపు, అల్లం, తృణధాన్యాలు కరోనా వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి సహాయపడే ఆహారాలు ఇవిపసుపు, అల్లం, తృణధాన్యాలు కరోనా వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి సహాయపడే ఆహారాలు ఇవి

హైపర్ సోమ్నియా లక్షణాలు..

హైపర్ సోమ్నియా లక్షణాలు..

అధికంగా అలసిపోయినట్లు అనిపించడంతో పాటు స్థిరమైన నిద్ర వస్తుంది. హైపర్ సోమ్నియా లక్షణాలు కింది విధంగా ఉంటాయి.

- ఆందోళన

- చిరాకు పడటం

- శక్తి తగ్గుదల

- నెమ్మదిగా ఆలోచించడం

- ఆకలి లేకపోవడం

- మెమొరీ తగ్గిపోవడం...

హైపర్ సోమ్నియాకు కారణాలు..

హైపర్ సోమ్నియాకు కారణాలు..

హైపర్ సోమ్నియా రావడానికి ఎక్కువ కారణాలివే..

- స్లీప్ అప్నియా

- కిడ్నీ పరిస్థితులు

- గుండె పరిస్థితులు

- మెదడు పరిస్థితులు

- వైవిధ్య మాంద్యం (సానుకూల సంఘటనలకు ప్రతి స్పందనగా మీ నిరాశ మానసిక స్థితి ప్రకాశవంతం అవుతుంది)

- తక్కువ థైరాయిడ్ పనితీరు

హైపర్ సోమ్నియా నిర్ధారణ ఎలా?

హైపర్ సోమ్నియా నిర్ధారణ ఎలా?

హైపర్ సోమ్నియాను నిర్ధారించడానికి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మరియు వైద్య చరిత్రను పరిశీలిస్తారు. అందుకోసం వైద్యులు ఈ పరీక్షలు చేస్తారు.

- ఎప్వర్త్ స్లీప్నెస్ స్కేల్ (పరిస్థితి యొక్క తీవ్రతను గుర్తించడానికి నిద్రను రేట్ చేస్తారు)

- మల్టీ స్లీప్ లేటెన్సీ పరీక్షలు(పగలు ఎన్ఎపిని తీసుకుంటారు, ఇది మీ నిద్రలోని రకాలను కొలుస్తుంది)

- పాలిసోమ్నో గ్రామ్(రాత్రి పూట నిద్రలో ఉన్నప్పుడు, మీ మెదడు పనితీరు, కంటి కదలికలు, గుండె కొట్టుకునే తీరు, ఆక్సీజన్ స్థాయిలు మరియు శ్వాస పనితీరు పర్యవేక్షించబడతాయి)

- స్లీప్ డైరీ (నిద్ర పద్ధతులను ట్రాక్ చేయడానికి రాత్రి పూట నిద్ర మరియు మేల్కొనే సమయాన్ని రికార్డు చేస్తారు)

కరోనా వ్యాక్సిన్ పొటాషియం? మీకు కరోనా ఉంటే సంభవించే లక్షణాలు ఇక్కడ ఉన్నాయి ...కరోనా వ్యాక్సిన్ పొటాషియం? మీకు కరోనా ఉంటే సంభవించే లక్షణాలు ఇక్కడ ఉన్నాయి ...

హైపర్ సోమ్నియాకు చికిత్స ఉందా?

హైపర్ సోమ్నియాకు చికిత్స ఉందా?

హైపర్ సోమ్నియా కారణాన్ని బట్టి దీని చికిత్సలు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నార్కోలెప్సీ చికిత్సకు ఉపయోగించే మందులు హైపర్ సోమ్నియాకు చికిత్స చేయగలవు. మరికొన్ని మీ జీవనశైలిలో మార్పులు తెచ్చేవిగా ఉంటాయి. కొన్నిసార్లు మీ రెగ్యులర్ స్లీపింగ్ షెడ్యూల్ ను పరిశీలించి, అలసట కలిగించే కొన్ని కార్యకలాపాలు నివారించాలని సూచిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. హైపర్ సోమ్నియా ఉన్న వారు మద్యం, మాదకద్రవ్యాలు, కాఫీ వంటివి తీసుకోకూడదట. అధిక పోషకాహరం లభించే ఆహారం మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

హైపర్ సోమ్నియా ప్రమాదకరమా?

హైపర్ సోమ్నియా ప్రమాదకరమా?

యాక్సిస్ హైపర్ సోమ్నియా అనేది ప్రాణాంతక ప్రమాదకరమైన వ్యాధి కాదు. కానీ ఇది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొందరికి జీవనశైలిలో మార్పులు మరియు చికిత్స ద్వారా ఈ వ్యాధిని నయం చేయొచ్చు. కానీ కొందరికి మాత్రం ఇది జీవితాంతం ఇబ్బంది కలిగిస్తుంది.

English summary

Hypersomnia: Causes, Symptoms, Diagnosis and Treatment in Telugu

Here we are talking about the hypersomnia: causes, symptoms, diagnosis and treatment in Telugu. Read on
Story first published:Thursday, July 15, 2021, 11:09 [IST]
Desktop Bottom Promotion