Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Dangerous Diseases in India : భారత్‌లోని టాప్ 5 ప్రమాదకరమైన వ్యాధులు ఏంటో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటి.. టాప్ 5 రోగాలు ఏవి.. అవి ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, చికిత్స ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Top 5 Dangerous Diseases: ప్రాణాంతక వ్యాధులు అనగానే చాలా మంది అంటువ్యాధులు, క్యాన్సర్లు లేదా అత్యంత అరుదైన వ్యాధులనే అనుకుంటారు చాలా మంది. కానీ చాలా మందిలో కనిపించే అత్యంత సాధారణ, దీర్ఘకాలిక వ్యాధుల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటి.. టాప్ 5 రోగాలు ఏవి.. అవి ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, చికిత్స ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. గుండె సంబంధిత వ్యాధులు(Cardiovascular Diseases):
భారత్‌లో సాధారణంగా కనిపించే 10 ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇది ఒకటి. గుండె సంబంధిత వ్యాధులు భారత్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాయి. వీటి వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కార్డియోవాస్కులర్ డిసీజ్(CVD) లక్షణాలు:
* ఛాతీలో నొప్పు
* శ్వాస ఆడకపోవడం
* కాళ్లు, చేతుల్లో తిమ్మిరి
* ఛాతీలో అసౌకర్యం
* మెడ, వీపు, దవడ, గొంతు, పొత్తి కడుపు ఇతర శరీర భాగాల్లో నొప్పి
కార్డియోవాస్కులర్ డిసీజ్‌కు కారణాలు:
* పొగ తాగడం
* శారీరక శ్రమ లేకపోవడం
* చెడు ఆహారపు అలవాట్లు
* వంశపారంపర్య కారణాలు
* హైబీపీ
* అధిక బరువు, ఊబకాయం
కార్డియోవాస్కులర్ డిసీజ్ నివారణ:
* శారీరకంగా చురుకుగా ఉండాలి
* క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి
* ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయాలి
* స్మోకింగ్ చేయొద్దు
* బీపీ నియంత్రణలో ఉండాలి
* సమతుల్య ఆహారం తినాలి

2. స్ట్రోక్
మెదడులోని ఏదైనా ధమనిలో అడ్డు ఏర్పడితే స్ట్రోక్ వస్తాయి. భారత్‌లో కనిపించే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇది కూడా ఒకటి
స్ట్రోక్ లక్షణాలు:
* కాళ్లు, చేతులు, ముఖంలో తిమ్మిరి
* విపరీతమైన తలనొప్పి
* కంటిచూపు క్షీణించడం
* నడకలో ఇబ్బంది
* మాట్లాడటంలో ఇబ్బంది
స్ట్రోక్ కారణాలు:
* హైబీపీ, అధిక కొలెస్ట్రాల్
* డయాబెటిస్
* విపరీతమైన ధూమపానం
* మెదడులో రక్తస్రావం
* గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు
స్ట్రోక్ నివారణ:
* ఉన్నపళంగా స్మోకింగ్ ఆపేయ్యాలి.
* బీపీని అదుపులో ఉంచుకోవాలి
* ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి
* శారీరక శ్రమ
* ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవాలి
* పైబర్, పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి

3. శ్వాసకోశ వ్యాధులు
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల దేశంలో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, న్యుమోనియా, తీవ్రమైన బ్రోన్కైటిస్ వంటి వాటి వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
శ్వాసకోశ లక్షణాలు:
* జ్వరం
* దగ్గు
* ముక్కు కారడం
* తుమ్ములు
* గొంతులో మంట
శ్వాసకోశ వ్యాధుల కారణాలు:
* విషపూరిత పదార్థాలు పీల్చడం, తీసుకోవడం
* తక్కువ ఇమ్యూనిటీ
* ధూమపానం
* దుమ్ము, వాయు కాలుష్యం
శ్వాసకోశ వ్యాధుల నివారణ:
* స్మోకింగ్ మానేయాలి
* వ్యాయామం చేయడం
* మాస్క్‌లు ఉపయోగించడం
* ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

4. క్షయ(TB)
క్షయవ్యాధి ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాలకు సోకుతుంది. క్షయ ప్రాణాంతక వ్యాధి. అయితే క్షయను మందులతో నయం చేయవచ్చు.
క్షయ లక్షణాలు:
* అలసట
* దగ్గులో రక్తం
* జ్వరం, చలి
* రాత్రిపూట చెమట
* తక్కువ ఆకలి
* బరువు తగ్గడం
క్షయ కారణాలు:
* బలహీనమైన రోగనిరోధక శక్తి
* వ్యాధి కలిగించే ప్రాంతాల్లో నివసించడం
* వ్యాధి సోకిన వారు దగ్గడం, తుమ్మడం వల్ల కూడా సోకుతుంది.
క్షయ నివారణ:
* క్షయ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి
* టీకాలు వేయించుకోవాలి
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

5. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD)
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(Chronic Obstructive Pulmonary Disease)
భారత్‌లో అత్యంత సాధారణ వ్యాధుల్లో COPD కూడా ఒకటి. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లక్షణాలు:
* గురక
* ఛాతీలో బిగుతు
* ఎనర్జీ లేకపోవడం
* అంటువ్యాధులు
* కాళ్లలో వాపు
* షార్డ్ బ్రీత్
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కారణాలు:
* ధూమపానం
* రసాయన పొగ పీల్చడం
* వంశపారంపర్య కారణాలు
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ నివారణ:
* స్మోకింగ్ మానేయ్యాలి
* దుమ్ము, పొగ వాటిని పీల్చకుండా మాస్కులు ధరించాలి
* వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలి



Click it and Unblock the Notifications