For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా కన్నా వేగంగా... ఏపీలో వింత వ్యాధికి తెలియని కారణాలు...

ఏపీలో వింత వ్యాధి ఎలా విస్తరిస్తుందో తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి..

|

ఇప్పటివరకు కరోనా మహమ్మారి అందరినీ కలవరానికి చేసింది. అయితే ఇప్పుడిప్పుడే దానికి వ్యాక్సిన్ వచ్చినట్లు శుభవార్తలు వస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్న వారందరికీ మరో షాకింగ్ న్యూస్ అందరినీ కలవరానికి గురి చేస్తోంది.

Mysterious disease kills one, nearly 300 take ill in Andhra Pradesh

అదేంటంటే.. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నగరంలో ఓ వింత వ్యాధి అకస్మాత్తుగా విస్తరిస్తోంది. దీని వల్ల చాలా మంది ప్రజలు కళ్లు తిరిగి పడిపోవడం.. నోట్లో నురగలు కక్కుతూ పోవడం, వాంతులు, తలపోటు వంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుండి ఏలూరు ఆస్పత్రిలో చేరుతున్నారు.

Mysterious disease kills one, nearly 300 take ill in Andhra Pradesh

ఈ మర్మమైన వ్యాధి ఆదివారం రోజున ఒకరిని బలిగొంది. సుమారు 292 మందిని అనారోగ్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఈ వింత వ్యాధి ఎలా బయటపడింది.. ఇది ఇప్పుడే ఎలా వెలుగులోకొచ్చిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రతిరోజూ ఈ గడ్డిని కొద్దిగా తినండి , మీ శరీరంలో తాజాగా రక్తం ప్రారంభమవుతుంది...ప్రతిరోజూ ఈ గడ్డిని కొద్దిగా తినండి , మీ శరీరంలో తాజాగా రక్తం ప్రారంభమవుతుంది...

అంతు చిక్కని వ్యాధి..

అంతు చిక్కని వ్యాధి..

ఈ వింత వ్యాధికి గురైన ప్రజలు అకస్మాత్తుగా పిట్టల్లా రాలిపోవడానికి గల కారణం ఏంటనేది వైద్యులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకని తలెత్తిందో వారు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధి పేరిట 341 మంది ఆస్పత్రుల్లో చేరారు.

పరీక్షలు చేసినప్పటికీ..

పరీక్షలు చేసినప్పటికీ..

వింత వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి నుండి సేకరించిన రక్తంతో పలు పరీక్షలు చేసినప్పటికీ.. స్కాన్ చేసినా కూడా వైద్య నిపుణులు దీనికి గల కారణామేంటో ఇంకా స్పష్టం చేయలేకపోయారు.

మాస్ హిస్టిరియా రుమార్లు..

మాస్ హిస్టిరియా రుమార్లు..

ఈ నేపథ్యంలో దీని గురించి కూడా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఇది మాస్ హిస్టిరియా కారణంగా వచ్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అది నిజం కాదని తేల్చాయి.

నిరాశ నుండి బయటపడటానికి మరియు జీవితాన్ని తాజాదనంతో ఎదుర్కొనే మార్గాలు!నిరాశ నుండి బయటపడటానికి మరియు జీవితాన్ని తాజాదనంతో ఎదుర్కొనే మార్గాలు!

టాక్సిన్స్ వల్ల..

టాక్సిన్స్ వల్ల..

అయితే ఇదంతా టాక్సిన్స్ వల్ల వచ్చిన అస్వస్థత అయ్యి ఉండొచ్చని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS) వైద్యులు, ఢిల్లీ నిపుణులు చెబుతున్నారు. దీని గురించి అధ్యయనం చేసేందుకు డాక్టర్ల టీమ్ మంగళగిరి నుండి ఏలూరుకు బయలుదేరింది.

వాయు కాలుష్యం కాదు..

వాయు కాలుష్యం కాదు..

మరోవైపు ఏలూరుకు వెళ్లిన ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఈ అంతు చిక్కని వ్యాధికి వాయు కాలుష్యం మాత్రం కారణం కాదని స్పష్టం చేసింది. దీని కోసం నగరంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు.

రోగులందరికీ కరోనా నెగిటివ్..

రోగులందరికీ కరోనా నెగిటివ్..

అయితే ముందుగా ఈ రోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ వ్యాధి నుండి చాలా మంది వేగంగానే కోలుకుంటున్నారు.

English summary

Mysterious disease kills one, nearly 300 take ill in Andhra Pradesh

Here we talking about the mysterious disease kills one, nearly 300 take ill in Andhrapradesh. Read on.
Desktop Bottom Promotion