For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakul Preet Singh:రకుల్ చేయించుకున్న ఆ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

పెదాలకు సంబంధించిన సర్జరీలోని రకాలు, సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

టాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇటీవల మీడియాలో.. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన అందాన్ని మరింత పెంచుకునేందుకు తన బాడీలోని ఆ భాగంలో సర్జరీ చేయించుకుందని.. సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

What is Lip Augmentation? Know Types, Side Effects, Risks in Telugu

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో వరుసగా సినిమాలు చేస్తున్న రకుల్ భామ బ్యూటీ డాల్ సినీ పరిశ్రమలో మంచి పేరే తెచ్చుకున్నారు. మన తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించారు. అయితే అకస్మాత్తుగా ఈ అమ్మడు తన అందాన్ని రెట్టింపు చేసుకోవాలనే ఆశతో తన పెదాలకు సంబంధించిన సర్జరీ చేయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

What is Lip Augmentation? Know Types, Side Effects, Risks in Telugu

తన పెదాలను గమనిస్తే.. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని.. మరింత అద్భుతమైన లుక్ కోసమే ఈ అమ్మడు లిప్స్ సర్జరీ చేయించుకుందని అనుకుంటున్నారు. సాధారణంగా హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకునేందుకు ముక్కుకు సంబంధించిన సర్జరీలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొందరు తమ పెదాలను మార్చుకుంటూ ఉంటారు. తమ పెదాలు అందంగా కనిపించేందుకు చేయించుకునే సర్జరీనే పౌట్ అంటారు. బాలీవుడ్ హీరోయిన్లు ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పడు రకుల్ కూడా అదే బాటలో పయనించిందని చెబుతున్నారు. అయితే రకుల్ ఈ విషయాలపై ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో పెదాలకు సంబంధించిన సర్జరీ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? సర్జరీ తర్వాత పెదాలు నిజంగా అందంగా మారతాయా? ఇలా చేసుకోవడం వల్ల వచ్చే రిస్కులేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెదాలను పెంచేందుకు..

పెదాలను పెంచేందుకు..

పెదవుల అందాన్ని పెంచేందుకు సాధారణంగా ఇంజెక్షన్లు చేస్తారు. నోటి చుట్టూ ఇంజెక్షన్ చేసేందుకు అనేక రకాల డెర్మల్ పిల్లర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యంత సాధారణ పూరకాలు హైలురోనిక్ యాసిడ్ లాంటి పదార్థాలను కలిగి ఉన్న ఉత్పత్తులు, హైల్యూరోనిక్ ఆమ్లం శరీరంలో కనిపించే ఒక సహజ పదార్థం. ఇది మీ పెదాల వాల్యూమ్ పెంచేందుకు సహాయపడుతుంది.

కొల్లాజెన్..

కొల్లాజెన్..

కొల్లాజెన్, ఒకప్పుడు అత్యంత సాధారణ డెర్మల్ ఫిల్లర్. అయితే ఈ పదార్థం నేడు తక్కువగా ఉపయోగించబడుతుంది. దీని స్థానంలో కొత్త ఎంపికలు సురక్షితంగా ఉన్నాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన ఇంజెక్షన్లు మరియు ఇంప్లాంట్ల వల్ల మీ పెదవులు అందంగా మారతాయి. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నందున ఈరోజుల్లో వీటిని ఎక్కువగా ఉపయోగించడం లేదు.

హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్ల ఉపయోగాలు..

హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్ల ఉపయోగాలు..

మీ పెదవులపై హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్లు జోడించడం వల్ల మీ పెదాల రూపం మెరుగుపరుస్తాయి.

మీ పెదాల ఆకారాన్ని, నిర్మాణాన్ని, వాల్యూమ్ ను మరింత అందంగా మారుస్తాయి. దీని ప్రభావం సాధారణంగా ఆరు నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత మీ పెదాల వాల్యూమ్ ను పెంచడానికి మరిన్ని ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మార్కెట్లో అనేక రకాల హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్లు ఉన్నాయి.

హైలు రోనిక్ యాసిడ్ ఫిల్లర్ల ప్రయోజనాలు..

హైలు రోనిక్ యాసిడ్ ఫిల్లర్ల ప్రయోజనాలు..

ఇంజెక్షన్ చేసిన తర్వాత, ఫిల్లర్లోని జెల్ పెదవుల కణజాలలకు మద్దతు ఇస్తుంది. మీ పెదాల రూపాన్ని కూడా మారుస్తుంది. వీటిని ఉపయోగించడం వలల్ పెదాల పరిమాణం నియంత్రణ వస్తుంది. అయితే వీటిని మీ పెదాలపై ఎంత వాల్యూమ్ వాడాలనే దానిపై మీరు వైద్యున్ని కచ్చితంగా సంప్రదించాలి. కేవలం డాక్టర్ కే మాత్రమే దానిపై స్పష్టత ఉంటుంది.

గడ్డలు సులభంగా కరుగుతాయి..

గడ్డలు సులభంగా కరుగుతాయి..

మీరు లిప్ అగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు.. మీకు కావాల్సిన ఫలితాలు వచ్చే వరకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు రకాల ఇంజెక్షన్లు క్రమంగా ఇవ్వబడతాయి. దీని వల్ల పెదవుల మీద ఏర్పడే గడ్డలు.. మీ పెదాల కదలిక వల్ల సులభంగా కరిగిపోతాయి. ఇతర చర్మపూరకాలతో పోలిస్తే తక్కువ గాయాలు మరియు వాపు ఉండొచ్చు. వీటి ఫలితాలు శాశ్వతంగా ఉండకపోయినా..దీర్ఘకాలం ఉంటాయి.

అలర్జీలు ఉండవు..

అలర్జీలు ఉండవు..

హైలు రోనిక్ యాసిడ్ ఫిల్లర్లు బాడీలో కనిపించే పదార్థాల నుండి తయారైనందున, వాటి వల్ల అలర్జీలు వచ్చే అవకాశమే లేదు. అయితే మీకు లిడోకాయిన్ అలర్జీ ఉంటే మాత్రం.. పెదాలకు చికిత్స చేయించుకోవడానికి ముందుగానే మీరు వైద్యుడిని సంప్రదించాలి.

English summary

What is Lip Augmentation? Know Types, Side Effects, Risks in Telugu

Here we are talking about the what is lip augmentation? know types, side effects, risks in Telugu. Have a look
Story first published:Wednesday, September 29, 2021, 13:35 [IST]
Desktop Bottom Promotion