For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

What is Nipah Virus Infection:నిఫా వైరస్ కు అడ్డుకట్ట వేయడమెలాగో తెలుసా...

నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి, దీని లక్షణాలు, ఇది వచ్చేందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా కలవరం నుండి తప్పించుకోక ముందే నిఫా వైరస్ అందరినీ వణికిస్తోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో 12 ఏళ్ల బాలుడు ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

What is Nipah Virus Infection - Causes, Symptoms, Treatments and Preventions in Telugu

ఇంతకుముందు కూడా ఇదే రాష్ట్రంలో నిఫా వైరస్ కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. ఇంతకీ నిఫా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎక్కడ నుండి వచ్చింది? దీని మూలాలేంటి? ఈ మహమ్మారి ఎవరి నుండి ఎక్కువగా సోకుతుంది..

What is Nipah Virus Infection - Causes, Symptoms, Treatments and Preventions in Telugu

మనుషుల నుండి మనుషులకు మాత్రమేనా? లేక జంతువుల నుండి కూడా మనకు సోకే ప్రమాదం ఉందా? దీని బారిన పడితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? ఇది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకవేళ ఈ వైరస్ బారిన పడితే తీసుకోవాల్సిన చికిత్స విధానాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Nipah Virus:నిఫా వైరస్ లక్షణాలేంటి? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?Nipah Virus:నిఫా వైరస్ లక్షణాలేంటి? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

నిఫా వైరస్ అంటే ఏమిటి?

నిఫా వైరస్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం నిఫా వైరస్ (NIV) అనేది ఒక వైరల్ సంక్రమణగా చెప్పబడుతోంది. ఇది జూనోసిస్ వర్గం క్రింద చేర్చబడింది. జూనోసిస్ అంటే, ఈ వైరస్ మనుషులను మాత్రమే కాకుండా, ఇతర రకాల జంతువులను కూడా ప్రభావితం చేయగలదు. ఈ వైరస్ ప్రభావానికి గురైన జంతువుల నుంచి మనుషులకు నిఫా వైరస్ సంక్రమిస్తుంది. ఇది సంక్రమించే మానవుల నుండి ప్రత్యక్ష, పరోక్ష కారణాల ద్వారా ఇతరులకూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు.

ఎక్కడి నుండి వచ్చింది..

ఎక్కడి నుండి వచ్చింది..

నిఫా వైరస్ మహమ్మారిని తొలిసారిగా 1998 సంవత్సరంలో పందుల పెంపకం వ్యక్తుల దగ్గర కనుగొన్నారు. ఈ నిఫా వైరస్ గబ్బిలాలు, పందుల నుండి వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు ఏవైనా పదార్థాలను తిని వదిలేస్తే.. వాటిని తిన్న జంతువులకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

ఇది ఎలా సోకుతుందంటే..

ఇది ఎలా సోకుతుందంటే..

వైరస్ సోకిన గబ్బిలం లేదా పంది (గబ్బిలాలు ప్రాథమిక కారణంగా పరిగణించడం జరిగినప్పటికీ) ద్వారా మానవులకు వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా ఇతర నిఫా వైరస్ సోకిన వ్యక్తుల నుండి కూడా వ్యాపించవచ్చు.

వ్యాధిసోకిన గబ్బిలాల లాలాజలం లేదా మూత్రంతో కలుషితమైన పండ్లు లేదా పండ్ల ఉత్పత్తులను తీసుకోవడం అనేది ఈ వ్యాధి యొక్క ప్రాథమిక వనరుగా భావించబడుతుంది. మొదట్లో వచ్చిన కేసుల్లో, జంతువులతో సన్నిహితంగా ఉన్న మనుషుల నుంచి మనుషులకు సోకే అంటువ్యాధిగా పరిగణించినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో గబ్బిలాలు, మరియు పందులు కూడా వాహకాలుగా ఉన్నాయని నిర్ధారణకు రావడం జరిగింది. ఈ వైరస్ సోకిన గబ్బిలాలు తిన్న పండ్లను స్వీకరించడమనేది ఇన్ఫెక్షన్ విస్తృతంగా వ్యాపించడానికి గల ప్రధాన కారణంగా ఉంది.

నిఫా వైరస్ లక్షణాలు

నిఫా వైరస్ లక్షణాలు

జ్వరం

తలనొప్పి

కండరాల నొప్పి

గొంతునొప్పి

వాంతులు

కళ్లు తిరగడం

మెమొరీ పవర్ తగ్గడం

తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు.

అధ్యయనంలో ఏం తేలిందంటే..

అధ్యయనంలో ఏం తేలిందంటే..

ఈ సంక్రమణలు, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి, ప్రాణాంతకమైన ఎన్సెఫలిటిస్ మరియు అసిమ్ప్టోమాటిక్ సంక్రామ్యతల వరకు వ్యాప్తి చెందుతాయి. నిఫా వైరస్ సోకిన పక్షంలో, మెదడువాపు లేదా మెదడులో విపరీతమైన మంటను అనుభవించవచ్చు. నిఫా వైరస్ లక్షణాలు ఐదు రోజుల నుండి రెండు వారాలలోపు బయటపడతాయట. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు కోమాలోకి పోయే అవకాశం కూడా ఉందట.

75 శాతం కేసులు..

75 శాతం కేసులు..

నిఫా వైరస్ సోకిన రోగుల యొక్క కుటుంబం మరియు సంరక్షకులలో అనేకమందికి, హ్యూమన్-టు-హ్యూమన్ సంక్రమణ (ట్రాన్స్మిషన్స్) జరిగినట్లు నివేదించబడింది కూడా. క్రమంగా, 2001 సమయంలో నమోదుకాబడిన సుమారు 75 శాతం కేసుల్లో ప్రధానంగా ఆసుపత్రి సిబ్బంది, హెల్త్ కేర్ ప్రొవైడర్స్, మరియు సందర్శకులు ఉన్నారని అధ్యయనాలు తేల్చాయి. అంతేకాకుండా, కొంత మంది తీవ్రమైన న్యుమోనియా, లేదా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు కూడా గురికావొచ్చు. పరిస్థితిన్ చేయిదాటిన పక్షంలో ఎన్సెఫలైటిస్ మరియు మూర్ఛలు వంటి సమస్యలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది.

నివేదికల ప్రకారం..

నివేదికల ప్రకారం..

క్రమంగా రోగిని సుమారు 45 రోజులపాటు ఇన్క్యుబేషన్ పీరియడ్లో ఉంచవలసి ఉంటుంది. CDC ప్రకారం, ఈ వైరస్ బారినపడి, బతికి బయటపడ్డ వారిలో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు వ్యక్తిత్వపరమైన మార్పులు మూర్ఛ వంటి సమస్యలు కొనసాగే అవకాశాలు ఉండొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)యొక్క నివేదికల ప్రకారం ఈ వ్యాధిబారిన పడిన, సుమారు 20 శాతం మంది రోగులు ఇంకనూ శ్వాస సంబంధిత రుగ్మతలు, ఇతరత్రా నరాల బలహీనతలతో కూడిన పరిస్థితులను అనుభవిస్తూ జీవిస్తున్నారు.

ఎలా నిర్ధారిస్తారు..

ఎలా నిర్ధారిస్తారు..

రోగుల నుండి ప్రయోగశాలకు రక్త మరియు మూత్ర నమూనాలను బదిలీ చేయడం, ప్రయోగాలు చేయడానికి తీసుకునే సమయం, అవసరమైన నమూనాల పరిమాణం, నాణ్యత, ల్యాబ్ లో టెస్టులు ఫలితాల మొదలైన అంశాల పరంగా వ్యాధినిర్ధారణ ఖచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. వ్యాధి యొక్క తీవ్రమైన దశలో, రోగి వ్యక్తిగత క్లినికల్ హిస్టరీని కలిపి ఇన్ఫెక్షన్ గుర్తించడానికి ఆస్కారం ఉంది. రోగ నిర్ధారణ పరీక్షలలో శరీర ద్రవాలలో, రియల్-టైం పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్ (RT-PCR), అదేవిధంగా ఎలిసా(ELISA) ద్వారా యాంటీబాడీ డిటెక్షన్ ప్రధానంగా ఉన్నాయి. పాలీమరేజ్ చైన్ రియాక్షన్ (PCR) ఎస్సే, ఎంజైమ్లతో సంబంధం ఉండే ఇమ్యూనోసోర్బెంట్ ఎస్సే (ELISA) మరియు సెల్ కల్చర్ ద్వారా వైరస్ ఐసోలేషన్ వంటి ఇతర పరీక్షలు కూడా వైరస్ నిర్ధారణలో సహాయం చేస్తాయి.

ఎలా బయటపడాలంటే..

ఎలా బయటపడాలంటే..

నిఫా వైరస్ సోకిందా లేదా అనేది తొలి దశలో కచ్చితంగా నిర్ధారించలేం. దాని లక్షణాలు వ్యాధిపరమైన ఖచ్చితత్వాన్ని ఇవ్వలేవు. ఈ వ్యాధి సంక్రమణ ప్రారంభ సమయంలో అనుమానించదగినదిగా కూడా ఉండదు. క్రమంగా ఖచ్చితమైన రోగనిర్ధారణ, మరియు ముందస్తు ఫలితాల విషయంలో సవాళ్లను సృష్టించవచ్చు. అదేవిధంగా, సకాలంలో సమర్థవంతమైన నియంత్రణా చర్యలను తీసుకోవడం ద్వారా, త్వరితగతిన ఈ వైరస్ నుండి బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఎలాంటి చికిత్సంటే..

ఎలాంటి చికిత్సంటే..

ప్రస్తుతానికి ఈ నిఫా వైరస్ సోకినా వారికి, కచ్చితత్వంతో కూడిన చికిత్సలు లేదా వ్యాక్సిన్ అంటూ అందుబాటులో లేవు. రిబావిరీన్, అనే ఒక యాంటీ వైరల్ డ్రగ్, నిఫా వైరస్ వలన సంభవించే ఎన్సెఫాలిటిస్ బారిన పడిన రోగులలో మరణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నిరూపితమైంది. వ్యాధి సోకిన వ్యక్తులకు సపోర్టివ్ కేర్ తో చికిత్స చేయడం జరుగుతుంది. క్రమంగా ఆ వ్యక్తిని హైడ్రేటెడ్ గా ఉంచడం, వాంతులు మరియు వికారాలను గురికాకుండా చూడడం వంటివి చికిత్సలో ప్రధాన భాగాలుగా ఉంటాయి.

English summary

What is Nipah Virus Infection - Causes, Symptoms, Treatments and Preventions in Telugu

Here we are talking about the what is nipah virus infection-causes, symptoms, treatments and preventions. Have a look
Story first published:Monday, September 6, 2021, 12:35 [IST]
Desktop Bottom Promotion