Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
World CancerDay:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీor సెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
World Cancer Day : పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీ లేదా సెక్స్ తో ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు..
World Cancer Day : ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు ప్రొస్టేట్ గ్రంథి గురంచి తెలుసుకోవాలి. ప్రోస్టేట్ అంటే చాలా మంది తెలియదు స్పెర్మ్‌ను పోషించి, రవాణా చేసే సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేసే గ్రంధే ప్రొస్టేట్. సహజంగా ఇది పురుషుల్లో ఉండే గ్రంధి . యాభై ఏళ్ల తర్వాత చాలా మంది పురుషులకు ఈ క్యాన్సర్ రావచ్చు. ప్రాణాంతకం కావచ్చు. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ లో వివిధ రకాల క్యాన్సర్ ఉన్నాయి. వాటిలో ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి ఏడు గురిలో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడతారు. ప్రపంచవ్యాప్తంగా, 2020లో 1.4 మిలియన్ల మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది ప్రపంచంలో నాల్గవ అత్యంత సాధారణం క్యాన్సర్ గా గుర్తించబడినది.

పురుషుల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రోస్టేట్ క్యాన్సర్ జన్యుశాస్త్రం మరియు ఊబకాయం వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ మూత్ర సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇది ఎవరి వస్తుంది, కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.

ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో సర్వసాధారణం
ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషులను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. ఇది పురుషుల ప్రోస్టేట్ గ్రంధిలో సంభవిస్తుంది. ప్రోస్టేట్‌లోని కణాలు వాటి DNA మార్చినప్పుడు మనిషికి ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. అప్పుడు అసాధారణంగా పేరుకుపోయిన కణాలు కణితిని ఏర్పరుస్తాయి. PSA అనేది ప్రోస్టేట్ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్. దీని సాధారణ పరిధి 4 మరియు అంతకంటే తక్కువ. దీని పెరుగుదల ప్రోస్టేట్ యొక్క ఇన్ఫెక్షన్ మరియు వాపు కారణంగా ఉంటుంది. కానీ దాని స్థాయి పరిమితికి మించి పెరిగి మూత్ర విసర్జన వంటి సమస్యలు ఎదురైతే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అనుమానించవచ్చు.ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు.

కుటుంబ చరిత్ర ఉన్నవారు లేదా ఊబకాయం ఉన్నవారు
60% ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో సంభవిస్తాయి, 40 ఏళ్ళలోపు పురుషులలో ఇది చాలా అరుదు. అయితే యువకులు కూడా ఈ వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర ఉన్నవారు లేదా ఊబకాయం ఉన్నవారు ఈ ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడుతుంటారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ రకాలు
ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్‌లో సంభవించే క్యాన్సర్, ఇది పురుషులలో వాల్‌నట్ ఆకారపు చిన్న గ్రంధి, ఇది స్పెర్మ్‌ను తయారు చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ సాధారణంగా ప్రారంభమవుతుంది. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలవుతుందని చెబుతారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణమేమిటి అనేదానికి స్పష్టమైన సమాధానం లేనప్పటికీ, మాయో క్లినిక్ ప్రకారం, ప్రోస్టేట్‌లోని కణాలు వాటి DNAలో మార్పులను అభివృద్ధి చేసినప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభమవుతుంది.
అసాధారణ కణాలు పేరుకుపోవడం క్యాన్సర్ కణితిని ఉత్పత్తి చేస్తుంది. ఇది సమీపంలోని కణజాలానికి వ్యాపించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా మరింత జాగ్రత్త అవసరం.
ప్రోస్టేట్ క్యాన్సర్ రకాలు: చిన్న సెల్ కార్సినోమాలు, న్యూరోఎండోక్రిన్ కణితులు, రూపాంతరం చెందిన సెల్ కార్సినోమాలు, సార్కోమాస్..

చికిత్స: రోబోటిక్ సర్జరీ అంటే
దీనికి చికిత్స చేసే మార్గాలలో రోబోటిక్ సర్జరీ ఒకటి. అయితే రోబోటిక్ చికిత్స మరియు ఫలితాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రొస్టేట్ క్యాన్సర్ నివారికి శస్త్రచికిత్స చాలా ప్రభావవంతమైనది. ఇది సరిగ్గా కనుక జరిగితే రోగులు చాలా పెద్దసంఖ్యలో కోలుకుంటారిని శ్రీ శంకర్ హాస్పిటల్ అండ్ రీసెర్ట్ సెంటర్ బెంగళూరులోని రోబోటిక్ యూరాలజిస్ట్ డా శ్రీవత్స నరసింహ చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలు చాలా మంది క్యాన్సర్ రోగులు ఈ రోబోటిక్ సర్జరీని ఎంపిక చేసుకుని త్వరగా కోలుకుని సాధారణ జీవితాన్ని గుడుపుతున్నారని ఆయన అన్నారు. దీని తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు లేవని , అందుకే ఇలాంటి సర్జరీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని డాక్టర్ చెప్పారు. అలాగే ఓపెన్ సర్జరీతో పోల్చితే డా విన్సీ RAS టెక్నాలజీ ఉపయోగించి చేసే ఈ రోబోటిక్ సర్జరీ చాలా ప్రభావంతంగా ఉన్నాయని, వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణం:
ప్రోస్టేట్ క్యాన్సర్‌కు జన్యువులు కూడా కారకం. అప్పుడు ఎక్కువ మాంసాహారం, వ్యాయామం లేకపోవడమే కారణమని చెబుతారు. పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ క్యాన్సర్ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

హార్మోన్ థెరపీ
ప్రోస్టేట్ క్యాన్సర్ కు హార్మోన్ థెరపీ చాలా ముఖ్యం. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి చెందిన తర్వాత వృషణాలను తొలగించడం మొదటి దశ. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి వృషణాలలో జరుగుతుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
ప్రొస్టేట్ క్యాన్సర్ కు అనేక లక్షణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మూత్ర విసర్జనలో ఇబ్బంది. మూత్ర ఆపుకోలేరు మరియు మూత్రవిసర్జన తక్కువగా చేయడం, ఇవన్నీ కూడా ప్రారంభ లక్షణాలలో కొన్ని. ప్రోస్టేట్ గ్రంధి నుండి క్యాన్సర్ వ్యాపి చెందినప్పుడు , అది మొదట ఎముకలకు వ్యాపిస్తుంది.
ఎముక నుండి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. బోన్ క్యాన్సర్ బారిన పడితే మధ్యలో నొప్పి, ఎముకల్లో నొప్పి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఇది అలసట మరియు బరువు తగ్గడం వంటి ఇతర క్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

సెక్స్ తో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని సెక్స్ తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు. దీని ద్వారా వృషణాల్లో పేరుకుపోయిన స్పెర్మ్ కూడా బయటకు వస్తుందని అందుకే ఈ సమస్యకు సెక్స్ మంచి పరిష్కారం అని వెల్లడిస్తున్నారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యులు సెక్స్ ని సిఫారసు చేయడానికి ఇది ఒక కారణం. అంతే కాదు ఇది వృషణాల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది హార్మోన్ల నియంత్రణలో కూడా సహాయపడుతుంది. అదనంగా, మంచి వ్యాయామం, మంచి ఆహారం, మంచి జీవనశైలి మరియు PSA స్థాయి తనిఖీ ఇవన్నీ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే కారకాలు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ఇలా ముందుగానే గుర్తించవచ్చు.



Click it and Unblock the Notifications











