Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే!
మన వంటగదిలో టమాటాకు ఉన్న స్థానం చాలా స్పెషల్. పప్పు, కూర, చారు లేదా పచ్చడి.. ఇలా ఏ వంటకమైనా సరే అందులో టమాటా పడాల్సిందే. అయితే చాలా ఏళ్లుగా మన సమాజంలో ఒక పెద్ద భయం, అపోహ బలంగా నాటుకుపోయింది. అదేంటంటే..టమాటాలు ఎక్కువగా తింటే, అందులోని గింజల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అని. ఈ భయంతో చాలామంది టమాటాలను వంటల్లో వాడటం తగ్గించేస్తారు లేదా గింజలు తీసేసి వాడుతుంటారు.

మరి ఇందులో వాస్తవం ఎంత? సైన్స్ ఏం చెబుతోంది? వంటి వివరాలను ప్రముఖ యూరాలజిస్ట్,ఆండ్రోలజిస్ట్, మెన్ హెల్త్ స్పెషలిస్ట్ కూడా అయిన డాక్టర్ విశ్వాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో సృష్టమైన సమాధానం తెలిపారు. కిడ్నీలో ఏర్పడే రాళ్లలో ఎక్కువగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉంటాయి.
ఏదైనా ఫుడ్ కిడ్నీలో రాళ్లు రావడానికి కారణం అవ్వాలంటే..ఆ ఫుడ్ లో ఆక్సలేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి అని డాక్టర్ విశ్వాస్ తెలిపారు. పాలకూర, బీట్ రూట్ లో ఆక్సలేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. కానీ టమాటో చాలా చాలా తక్కువ శాతంలో ఆక్సలేట్స్ ఉంటాయని చెప్పారు. కాబట్టి ఇవి రాళ్లు ఏర్పడే ప్రక్రియకు ఏమాత్రం కారణం కావు అని క్లారిటీ ఇచ్చారు.
ఈ ఆశ్చర్యకరమైన విషయం మీకు తెలుసా
టమాటాలు కిడ్నీలో రాళ్లను తీసుకురావడం కాదు, రాళ్లను అడ్డుకోవడంలో సహాయపడుతుందని డాక్టర్ విశ్వాస్ చెబుతున్నారు. టమాటాలలో సిట్రేట్ అనే మూలకం పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రేట్ అనేది మూత్రంలో క్యాల్షియం రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి ఇది ఒక రక్షణ కవచంలాంటిది.
క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
అంతేకాకుండా టమాటా ఎర్రగా, నిగనిగలాడుతూ ఉండటానికి కారణమైన లైకోపీన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని డాక్టర్ విశ్వాస్ చెప్పారు.
పోషకాల గని
టమాటాలలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు నిండి ఉన్నాయని డాక్టర్ విశ్వాస్ తెలిపారు. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి, చర్మం, కణాల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టమాటా లాంటి సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను దూరం చేసుకోవడం ఏమాత్రం సరైనది కాదని, దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతానేది ఒట్టి అపోహ మాత్రమేనని డాక్టర్ విశ్వాస్ చెబుతున్నారు.
కిడ్నీ రాళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అసలు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది టమాటాలు మానేయడం కాదు. అసలైన శాస్త్రీయ జాగ్రత్తలు తీసుకోవాలి.
-ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు కచ్చితంగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం పలుచబడి రాళ్లు ఏర్పడవు.
-ఆహారంలో ఉప్పు శాతాన్ని బాగా తగ్గించాలి. సోడియం ఎక్కువగా ఉంటే కిడ్నీ రాళ్ల ముప్పు పెరుగుతుంది.
-జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications