Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Be careful: రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? శృతి మించే చాలా ప్రమాదకర వ్యాధులు వస్తాయి?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మనం తినే ఆహారంపైనే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామనేది మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అందుకోసం ప్రతిరోజూ మంచి పోషకాహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం. ఎలాంటి ఆహరం తీసుకుంటున్నాం అనేది దానితో పాటు ఎంత మొత్తంలో ఆహరం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.
అయితే పోషకాహారం అనగానే చాలా మందికి గుడ్డు గుర్తొస్తుంది. గుడ్డును ప్రతిరోజూ తినే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అయితే రోజులో ఎన్ని గుడ్లు తినాలో ఎవరికీ తెలియదు. అసలు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? ఎంత మొత్తంలో గుడ్డు తినాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎంత మొత్తంలో గుడ్లు తినాలి?
గుడ్లలో ఉన్న విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్లకు చాలా మంచి ప్రయోజనాలను అందజేస్తుంది. ప్రతిరోజు ఒకటి నుండి రెండు గుడ్లు తినడం వలన కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. అందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరంలోని ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడగలుగుతాయి. గుడ్లు శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి. గుడ్లలో ఉన్న విటమిన్ D ఎముకలను బలంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
అలాగే, గుడ్లు మెదడుకు చాలా మంచిది. ప్రతి రోజు గుడ్లు తినడం వలన మెదడులో ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. అయితే, గుడ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక రోజులో ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మీ శరీరానికి తగ్గట్లుగా గుడ్డు తినే సంఖ్యను ఎంచుకోవచ్చు.
ఒకవేళ గుడ్డుతో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఓసారి వైద్యులను సంప్రదించడం ముఖ్యం. అలాగే వారి సలహాల మేరకు గుడ్డును తీసుకోవడం వల్ల సరైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. లేని యెడల కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications