Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మురికి మంచిదే: వారానికి ఎన్నిసార్లు స్నానం చేయాలో తెలుసా..డాక్టర్లు చెబుతుందిదే
మనదేశంలో ఏ సీజన్ లో అయినా దాదాపు ప్రతి ఒక్కరూ రోజూ ఉదయం లేదా సాయంత్రం స్నానం చేస్తుంటారు. కొందరికి రెండు పూట్ల స్నానం చేసే అలవాటు ఉంటుంది. రోజూ స్నానం చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొంతమంది శరీర దుర్వాసన పోగొట్టుకోవడానికి స్నానం చేస్తారు, కొంతమందికి మత విశ్వాసాల కారణంగా రోజూ స్నానం చేస్తారు..మరికొందరు అయితే స్నానం చేసే వరకు ఫ్రెష్ గా ఉండరు, కొంతమంది వ్యాయామం చేయాల్సి ఉంటుంది కాబట్టి స్నానం చేయాల్సి వస్తుంది. అయితే రోజూ స్నానం చేయడం అనారోగ్యకరమని మీకు తెలుసా? రోజూ స్నానం చేయడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రతిరోజూ స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి హానికరం అని,రెండు రోజులకొకసారి స్నానం చేయడమే బెస్ట్ అని కొందరు నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడు రోజులు మాత్రమే స్నానం చేయడం మంచిదని ఇటు చాలా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. రోజూ చేయడం వలన శరీరంలో ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గిపోవడమే కాకుండా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల మానసికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలివే
-ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదు. బదులుగా నీరు, సబ్బు, షాంపూ, ఇతర వస్తువుల వల్ల హాని కలుగుతుంది.
-రోజూ స్నానం చేయడం వల్ల చర్మం అతిగా చికాకుపడి పొడిబారుతుంది. అలాగే చర్మంపై దురద సమస్య మొదలవుతుంది.
-చర్మ అవరోధం దెబ్బతింటుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది, చర్మం ఇన్ఫెక్షన్లకు గురవుతుంది.
-రోజూ స్నానం చేయడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా ప్రభావితమవుతుంది. ఈ కారణంగానే డాక్టర్లు తరచుగా పిల్లలను రోజూ స్నానం చేయవద్దని సలహా ఇస్తారు.
-యాంటీ బాక్టీరియల్ సబ్బుతో రోజూ స్నానం చేసే వ్యక్తులు ఈ సబ్బులు చెడు బ్యాక్టీరియాను మాత్రమే కాకుండా చర్మానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతాయని గ్రహించలేరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications