Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మామిడి టెంకే కదా అని పారేస్తున్నారా? అతిపెద్ద రోగానికి ఇదే మందు
సాధారణంగా సమ్మర్ వస్తే అందరికీ గుర్తుకొచ్చేది మామిడికాయలు. మామాడికాయాలను తినాలని సమ్మర్ లో అందరూ కోరుకుంటారు. అయితే మామాడికాయను తిని దాని టెంకను మాత్రం విసిరి పడేస్తుంటాం. అయితే మామాడికాయ టెంకలోనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, ఫోలేట్,పొటాషియం, మెగ్నీషియం,
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మామిడి టెంకలో పుష్కలంగా ఉంటాయి, ఇది అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతంది.
మామాడి టెంకలోని తెల్లగా ఉండే జీడిలాంటి దానిని పొడిగా తయారుచేస్తారు. ఇది మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది. మామాడి టెంక పొడిని ఎలా తీసుకోవాలి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

మామిడి టెంక పొడితో ప్రయోజనాలివే
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
మామిడి టెంకలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి టెంక పొడిని నీటిలో కలిపి లేదా ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. మామిడి టెంకలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మామిడి టెంకలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మామిడి టెంక పొడిని నీటిలో లేదా ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవడం ద్వారా ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చర్మం, జుట్టుకు
మామిడి టెంక పొడి చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మామిడి టెంకలో విటమిన్లు ఏ,ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
జీర్ణక్రియ
మామిడి టెంక పొడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి
మామిడి టెంక పొడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
మామిడి టెంకలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి టెంక పొడి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications