Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బీర్, విస్కీ కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఏ చిన్న పాటి కార్యక్రమం అయినా మద్యం సేవిస్తూ ఉంటాము. కొందరు మద్యం ప్రియులు మాత్రం.. ఎలాంటి అడ్డు అదుపులేకుండా, ఏది తాగుతున్నామనే తేడా లేకుండా తాగుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం బీర్‌లో విస్కీ, వైన్ కలుపుకొని తాగుతూ ఉంటారు. అలా తాగడం వల్ల ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా? అలా తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం
బీర్, వైన్ కలిపి తాగితే ఏమవుతుందంటే?
సాధారణంగా మద్యం సేవించడమే ఆరోగ్యానికి ప్రమాదమని, అదే బీర్, వైన్ కలిపి తాగితే ఇంకా ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. బీర్, వైన్ రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన మద్య పానాలని, వీటిని కలిపి తీసుకోవడం ద్వారా ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పుకొస్తున్నారు.

ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటే:
బీర్, వైన్ రెండు కలిపి తాగడం వల్ల.. వెంటనే మత్తులోకి జారుకుంటారని, ఇది మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చివరికి మనిషి ఆలోచన శక్తిని కోల్పోతారని, ఒక మాదిరిగా చెప్పాలంటే సోయి లేకుండా ఏది పడితే అది చేస్తారని అంటున్నారు. వీటితో పాటుగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
బీర్, విస్కీ కలిపి తాగితే ఏమవుతుందంటే?
బీర్, విస్కీ కలిపి తీసుకోవడం వల్ల.. డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ కారణంగా మెదడు పని తీరు దెబ్బతింటుందని, మెదడు ఆలోచన శక్తిని కోల్పోతుందని చెబుతున్నారు.
ముఖ్యంగా రాత్రుళ్ళు తాగి పడుకుంటే.. ఉదయం లేచేసరికి శరీరంలో నీరు శాతం అస్సలు ఉండదని, శరీరం ఏ పనికి సహకరించిందని పేర్కొంటున్నారు. శరీరం మొత్తం తూలుతోంది, నడుస్తున్నా కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుందని తెలిపారు.
అలాగే విస్కీ, బీర్ కలిపి తాగితే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా బాగా వస్తాయని చెబుతున్నారు. ఛాతిలో మంట, కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బీర్, విస్కీ కలిపి తీసుకోవడం.. కిడ్నీల పనితీరుపై కూడా ప్రభావితం చూపిస్తుందని, మూత్రం రంగు మారి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
నిజానికి చెప్పాలంటే మధ్యపానం సేవించడమే ఒక రకంగా హానికరం. గుండె, కాలేయ, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బు వంటి వ్యాధుల బారిన పడే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో మద్యపానం సేవించడం మానేస్తేనే మంచిది. కుదరదు అంటే అదుపులో తీసుకోవాలి. అలా కాదని, బీర్, విస్కీ, వైన్ అని అన్ని కలుపుకుంటూ తాగితే.. మీ మరణాన్ని మీరే ముందుగా కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు.
గమనిక: ఈ కథనంశంలో పొందుపరిచిన విషయాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. దయచేసి వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications