Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అక్కడ మగవాళ్లు బతుకమ్మ ఆడడం సంప్రదాయమట...ఎక్కడంటే?!
అక్టోబర్ 2వ తేదీ నుంచి తెలంగాణలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇళ్లలో పూలను క్రమబద్ధంగా పేర్చి, మహిళలు బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అయితే, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడి మగవారు బతుకమ్మ ఆడుతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. బతుకమ్మ సంబదారలు అంబరాన్ని అంటేందుకు సిద్ధమవుతున్న వేళ.. పురుషులు బతుకమ్మ ఆడే సంప్రదాయం ఉన్న గ్రామాలను పలకరిద్దాం రండి!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఏటా మగవారు బతుకమ్మ ఆడటం ఆనవాయితీగా వస్తోంది. ఈ జిల్లాలోని తోటపల్లి, అక్కన్నపేట, గొల్లపల్లి, గాంధీనగర్ గ్రామాల్లోని పురుషులు బతుకమ్మ ఆడుతూ తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇలా పండగ చేసుకోవడం తమ తాతలు, తండ్రు కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని, దానినే తాము కూడా కొసాగిస్తున్నామని అంటున్నారు.

రెండు రోజులు మాత్రమే..
ఇక్కడి మగవారు బతుకమ్మ ఆడటం ప్రతిరోజు ఉండదు. బతుకమ్మ సంబరాల్లో రెండు రోజులు మాత్రమే ఆడుతారు. అవి కూడా తొలి రోజు జరిపే ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు, చివరి రోజు చేసే సద్దుల బతుకమ్మను సంబరాల్లో మగవారు సంప్రదాయబద్దంగా ఆడతారు. ఈ ఆచారం ఎప్పటినుంచి కొనసాగుతుందన్న విషయంపై స్థానికంగా ఎవ్వరికీ స్పష్టత లేదు. అయితే, తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్న ఈ గ్రామాల ప్రజలను అభినందించాల్సిందే.
బతుకమ్మ తేదీలు ఇలా..
తెలంగాణలో ఏడాది బతుకమ్మ పండుగ తేదీలు ఇలా ఉన్నాయి. ఎంగిలి పూల బతుకమ్మ సంబరం ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున (అక్టోబర్ 2 - బుధవారం) ప్రారంభం అవుతోంది. అలాగే, సద్దుల బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ అష్టమి అంటే అక్టోబర్ 10వ తేదీన జరుపుకొంటారు. అయితే, ఈ అక్టోబర్ 11 ఉదయం 11 గంటల వరకు అష్టమి తిధి ఉండడంతో ఆరోజున కూడా సద్దుల బతుకమ్మ జరుపుకోవచ్చని కొందరు పండితులు స్పష్టం చేశారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications