Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
మనదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఎక్కడ లభిస్తుందో తెలుసా..?
ప్రపంచంలోని చాలా దేశాలను ప్రస్తుతం భయపెడుతున్న అంశం వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అంటే గాలిలో హానికరమైన పదార్ధాలు కలవడం. ఇది మానవ ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. కర్మాగారాల నుంచి వెలువడే విషపూరిత వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ వాహనాలు విడుదల చేసే పొగ వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.పంట వ్యర్థాలను కాల్చడం,రసాయన ఎరువుల వాడకం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలీటీ రిపోర్ట్ 2024ని పరిశీలిస్తే ప్రపంచంలోని టాప్-20 కాలుష్య నగరాల లిస్ట్ లో 13 నగరాలు భారత్ లోనే ఉన్నాయి. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ రూపొందిచిన ఈ నివేదిక ప్రకారం 2023లో భారత్ ప్రపంచంలోనే మూడో అత్యంత కాలుష్య దేశంగా ఉండగా..2024 నాటికి కాస్త మెరుగుపడి ఐదో స్థానానికి చేరుకుంది.
35 శాతం భారత నగరాల్లో వార్షిక పీఎం2.5 సాంద్రత స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్ కు 5 మైక్రోగ్రాముల కంటే తక్కువ ఉండాలి. కానీ భారత్ లో ఈ పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా పీఎం2.5 సాంద్రతలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కారణంగా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే కొన్ని దేశాలు, ప్రాంతాలు.. తమ సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ చర్యల కారణంగా ఇప్పటికీ స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్నాయి. మనదేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఆ ప్రదేశాలేవో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచంలో స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న కొన్ని ప్రాంతాలు
ఆస్ట్రేలియాలోని టాస్మానియా
టాస్మానియా రాష్ట్రంలోని కెనుక్ అనే ప్రాంతంలో ప్రపంచంలోని అత్యంత స్వచ్ఛమైన గాలి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణ మహాసముద్రం నుండి వచ్చే గాలులు ఇక్కడి గాలిని స్వచ్ఛంగా ఉంచుతాయి.
అంటార్కిటికా
ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ పారిశ్రామిక కాలుష్యం దాదాపుగా ఉండదు.
ఐస్ లాండ్
తక్కువ జనాభా, పారిశ్రామిక కాలుష్యం లేకపోవడం వల్ల ఐస్ లాండ్ లో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
న్యూజిలాండ్
ఇది తక్కువ జనాభా సాంద్రత,దట్టమైన అడవులు ఎక్కువగా ఉండే న్యూజిలాండ్ స్వచ్ఛమైన గాలిని కలిగి ఉంది.
స్కాండినేవియన్ దేశాలు
నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు పచ్చని అడవులు, తక్కువ జనాభా సాంద్రత కారణంగా స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్నాయి.
కెనడా
కెనడా దేశం లో కూడా స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది.
భారత్ లో ఈ ప్రాంతాలలో గాలి నాణ్యత చాలా బాగుంటుంది
ఐజ్వాల్
భారతదేశంలో మిజోరాం రాజధాని ఐజ్వాల్ స్వచ్ఛమైన గాలికి ప్రసిద్ధి చెందింది.
కిన్నౌర్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది.
పుదుచ్చేరి
సౌతిండియాలోని కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఈ ప్రాంతాలలో గాలి నాణ్యత చాలా బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











