Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
బరువు పెరగాలనుకుంటున్నారా..? అయితే, వీటిని తీసుకోండి..
చాలా మంది తమ శరీర బరువు గురించి చింతిస్తుంటారు. కొంత మంది అధిక బరువును మోయలేక తగ్గాలని తంటాలు పడుతుంటే, మరికొంత మంది ఎంత తిన్నా బరువు పెరగటం లేదు సన్నగా ఉన్నామని కలవరపడుతుంటారు. అలాంటివారు లావుగా అవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నా లావు మాత్రంకారు.
బరువు తగ్గడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో, బరువు పెరగడానికి కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. బరువు పెరగాలనుకునే వారు, వారి బరువును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచాలనుకునే వ్యక్తులు సరైన ఆహారం తీసుకుంటూ బరుగు పెరగొచ్చు. జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం ద్వారా బరువు పెరగడానికి బదులుగా, అనారోగ్యానికి గురవ్వక తప్పదు. బరువు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో చూసేద్దాం..

బరువు పెంచే ఆహారాలివే..
ఖర్జూరం
బరువు పెరగాలనుకునేవారు ముందుగా శరీరంలో కొవ్వును పెంచుకోవాలి. కొవ్వు పెరగాలంటే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. అందులో ముఖ్యమైన వాటిలో ఖర్జూరం ఒకటి. ఇందులో వంద గ్రాములకు 282 కేలరీలు ఉంటాయి. ఈ ఖర్జూరంలో మంచి పిండి పదార్థాలు, పొటాషియం అధికంగా లభిస్తుంది. అదనంగా ఖర్జూరాలు శరీరంలో ఐరన్ పెరుగుదలకు దోహనం చేస్తుంది. కాబట్టి బరువు తక్కువగా ఉన్నవారు రోజువారి ఆహారంలో ఖర్జూరం చేర్చాల్సి ఉంటుంది. తద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్
బరువు పెరగాలనుకునేవారు వారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను జోడించాలి. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను చేర్చుకోవాలి. ఈ పదార్థాలు ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు ఎంతోగానో మేలు చేస్తాయి. వీటిలో సంతృప్త కొవ్వుతో పాటు చాలా ఎక్కువ మొత్తంలో కేలరీలు కూడా ఉంటాయి. ఈ గింజలన్నింటినీ కలిపి మిక్స్ చేసి రోజూ గుప్పెడు తింటే ఇది పోషకాలను అందించడమే కాకుండా బరువును కూడా పెంచుతుంది.

మొలకలు
బరువు పెరగాలనుకునేవారు మొలకెత్తిన గింజలు, శనగలు, పెసరపప్పు వంటి పప్పు దినుసులను తమ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని నానబెట్టి మొలకెత్తించి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు తగినన్ని కేలరీలు శరీరానికి అందుతాయి. ఒక కప్పు పచ్చి పెసరపప్పులో 257 కేలరీలు ఉంటాయి. కేలరీలతోపాటు విటమిన్ కె, సి కూడా తగినంత మోతాదులో లభిస్తుంది. కాబట్టి తక్కువ బరువు ఉన్నవారు రోజూ వీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఓట్స్
బరువు పెరగాలనుకునేవారు ఓట్ మీల్, ఓట్స్ వంటివాటిని తమ ఆహారంలో చేర్చొచ్చు. వంద గ్రాముల ఓట్స్ లో 400 కేలరీలు ఉంటాయి. అంతేకాదు, వీటిలో 10 గ్రాముల ఫైబర్, 17 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటాయి. బరువు పెరగాలనుకునేవారు ఓట్స్ ను ఫుల్ క్రీమ్ మిల్క్, అరటిపండు వంటి పండ్లతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారం బరువును పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications