Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..ఇమ్యూనిటీని జెట్ స్పీడ్ లో పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే
ఐదేళ్ల క్రితం ప్రపంచదేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ ఇప్పుడు కోరలు చాస్తోంది. పలు దేశాల్ల మళ్లీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1000కి పైనే యాక్టివ్ కరోనా కేసులు మనదేశంలో ఉన్నాయి. కోవిడ్ వల్ల 7 మరణాలు కూడా తాజాగా నమోదయ్యాయి. NB.1.8.1, LF.7 అనే రెండు కరోనా సబ్ వేరియంట్ల రూపంలో కరోనా మనదేశంలో విజృంభిస్తోంది. దీంతో మళ్లీ కరోనా టెన్షన్ అందరిలో స్టార్ట్ అయ్యింది. మళ్లీ మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ లు మొదలయ్యాయి.
వరల్డ్ న్యూట్రిషన్ డే 2025
అసలు కరోనా అనే వైరప్ వచ్చిన తర్వాత నుంచే అందరిలో ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం దగ్గర నుంచి ప్రజల లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చేశాయి. ఇవాళ ప్రపంచ పోషకాహార దినోత్సవం (World Nutrition Day 2025) ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించడం ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోషకాహార లోపం సమస్యలపై దృష్టి సారించి, వాటిని నివారించడానికి చర్యలు ప్రోత్సహిస్తారు. సరైన పోషకాహారం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి పెంచుకోండిలా
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న ఈ సమయంలో కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని ఎక్కువగా ఉన్నోళ్లు కరోనా బారిన పడకుండా ఉంటే అవకాశముంటది,అలాగే ఎలాంటి అనారోగ్యాలనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు కాబట్టి ఇమ్యూనిటీని పెంచే కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవాలని సూచించారు. మరి ఆ శక్తినిచ్చే సహజసిద్ధమైన ఆహారాలేంటో ఇక్కడ చూడండి.
మొలకలు
కరోనా వచ్చిన తర్వాతనే చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అప్పటి నుంచి మొలకల వైపు అందరి దృష్టి మళ్లింది. పెసర్లు, శనగల వంటి వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, మరుసటి రోజుకు మొలకలొచ్చాక తినే అలవాటు ఇప్పుడు చాలామందికి దినచర్యలో భాగమైపోయింది. మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగడానికి అవసరమైన శక్తిని ఇవి పుష్కలంగా అందిస్తాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మొలకలను తీసుకుంటే, మన రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇది మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ కరోనా వంటి వైరస్‌ల బారిన పడకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి.
నిమ్మకాయ రసం
విటమిన్ C అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది నిమ్మకాయే. ఈ చిన్న పండులో ఉన్న శక్తి అపారం. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం, ఓ స్పూన్ తేనె కలిపి చూడండి. క్రమంగా విటమిన్ C మీ సొంతమవుతుంది. కమలాపండు కూడా విటమిన్ 'సి'కి మంచి వనరు. దీన్ని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. కూరలు, సలాడ్లలో నిమ్మరసం వేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
అంజీర
అంజీర పండ్లు..కేవలం రుచే కాదు, అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలకు ఇవి పెట్టింది పేరు. విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు వంటి ఎన్నో పోషకాలకు అంజీర ఒక గని లాంటిది. ప్రతిరోజూ రాత్రిపూట, ఓ చిన్న గిన్నెలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో నాలుగైదు అంజీర పండ్లను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఈ నానబెట్టిన అంజీరాలను ఆ నీటితో సహా లేదా కేవలం పండ్లను తినండి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పుంజుకుంటుంది. శరీరానికి కావలసిన పోషకాలు అంది, మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న అనారోగ్యాలు మీ దరిచేరకుండా శరీరం ఒక కవచంలా తయారవుతుంది.
పాలల్లో పసుపు
రోజూ రాత్రిపూట ఓ గ్లాసు గోరువెచ్చని పసుపు కలిపిన పాలు తాగడం మంచిది. ఇది సహజసిద్ధమైన ఇమ్యూన్ బూస్టర్ లా పనిచేస్తుంది. ఇది మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి, అనారోగ్యాలు త్వరగా దరిచేరకుండా కాపాడుతుంది. ఇది తరతరాలుగా మన పెద్దలు పాటిస్తున్న ఆరోగ్య రహస్యం.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి ఆయువుపట్టు. పచ్చగా, తాజాగా ఉండే ఆకుకూరలు పాలకూర, మెంతికూర, తోటకూర, బచ్చలికూర వంటి మన డైట్ లో ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర మీ ప్లేట్‌లో ఉండేలా చూసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఆకుకూరను పప్పులో, కూరగా, వేపుడుగా... మీకు నచ్చిన రీతిలో వండుకుని తినొచ్చు.
ఫ్రెష్ ఫ్రూట్స్
కాలంతో సంబంధం లేకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లది ప్రత్యేక స్థానం. ఈ సీజన్‌లో మార్కెట్లో విరివిగా దొరికే నల్ల ద్రాక్షను అస్సలు మిస్సవ్వకండి. తియ్యగా, రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే రోజూ ఓ యాపిల్, అరటిపండు తింటే మీ రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











