Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
గోళ్లు రుద్దితే జుట్టు పెరుగుతుందా? చాలామందికి తెలియని రహస్యం!
ఈ రోజుల్లో చాలామందికి జుట్టు రాలిపోవడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలకు కూడా జుట్టు రాలిపోతుంది. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ఇది జరుగుతందని నిపుణులు చెబుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ఎన్నో రకాల నూనెలు, షాంపూలు, మందులు వాడుతుంటాం. కొన్నిసార్లు ఫలితం ఉంటుంది, కొన్నిసార్లు నిరాశే మిగులుతుంది. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మన పూర్వీకులు అందించిన ఒక అద్భుతమైన, సులువైన యోగా ప్రక్రియే బాలయం. దీనినే గోళ్ల వ్యాయామం అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఏమిటీ బాలయం? ఇది నిజంగానే జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతుందా?
బాలయం అంటే ఏమిటి?
బాలయం అనేది ఒక సంస్కృత పదం. బాల్ అంటే వెంట్రుకలు. ఇది రెండు చేతివేళ్ల గోళ్లను ఒకదానికొకటి తాకించి, వేగంగా రుద్దే ఒక పురాతన యోగాభ్యాసం. ఇది ఒక రకమైన రిఫ్లెక్సాలజీ సూత్రంపై పనిచేస్తుందని నమ్ముతారు. మన గోళ్ల కింద ఉండే నరాలు, తల మాడులోని కేశ కుదుపులతో అనుసంధానమై ఉంటాయని, గోళ్లను రుద్దడం వల్ల కలిగే ఒత్తిడి ఆ నరాలను ఉత్తేజపరిచి, తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చెబుతారు. పెరిగిన రక్త ప్రసరణ వల్ల వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అంది జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుందని దీని వెనుక ఉన్న భావన.

బాలయం ఎలా చేయాలి?
-ప్రశాంతంగా, సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చోండి. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవడం ఉత్తమం.
-మీ రెండు చేతులను ఛాతీ ముందుకు తీసుకురండి. బొటనవేళ్లను మినహాయించి, మిగిలిన నాలుగు వేళ్ల గోళ్లను ఒకదానికొకటి తగిలేలా పట్టుకొని, వేగంగా రుద్దండి.
-ఈ వ్యాయామాన్ని ప్రతిరోజూ కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయాలి.
-బొటనవేళ్లను మాత్రం అస్సలు రుద్దకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు (గడ్డం, మీసాలు) పెరిగే అవకాశం ఉందని చెబుతారు.
ఇది నిజంగా పనిచేస్తుందా? శాస్త్రీయత ఎంత?
బాలయం చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుందని, తెల్లజుట్టు నల్లబడుతుందని, బట్టతల ఉన్నచోట కూడా కొత్త జుట్టు వస్తుందని బలమైన ప్రచారం ఉంది. అయితే ఈ వాదనలకు ఇప్పటివరకూ ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు.
మరి నిజమేంటి?
చర్మవ్యాధి నిపుణుల ప్రకారం గోళ్లను రుద్దడం వల్ల తల మాడులో రక్త ప్రసరణ స్వల్పంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇది హానికరం కాదు. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా జుట్టు రాలే సమస్య ఉన్నవారికి, ఈ వ్యాయామం ఒక రకమైన రిలాక్సేషన్ టెక్నిక్ గా పనిచేసి, కొంత ఉపశమనం కలిగించవచ్చు. అంతే తప్ప ఇది జుట్టు సమస్యలకు సంపూర్ణ పరిష్కారం అని చెప్పలేం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications