Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
రక్తదానం చేస్తే డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందా? గుండెకు ప్రయోజనమా? కీలక విషయాలు బయటకి
రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి చేసే రక్తదానం ఆపదలో లేదా ఎమర్జెన్సీలో ఉన్న వారికి సహాయపడుతుందని మనందరికీ తెలిసిందే. అయితే రక్తదానం వల్ల ఇతరులకు సహాయం చేయడం కంటే సొంత ఆరోగ్యానికి కూడా ఎక్కువే సహాయం చేసినట్లవుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే సాధారణ జనాభా కంటే క్రమం తప్పకుండా రక్తదానం చేసేవాళ్లు ఆరోగ్యంగా ఉండవచ్చు.
రక్తదానం చేయడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చా
రక్తదానం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై ఇంకా లోతుగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రక్తదానం.. ఆహారం, వ్యాయామానికి ప్రత్యామ్నాయం కానప్పటికీ ఇది అదనపు రక్షణ పొరను అందిస్తుందని చెబుతున్నారు.

రక్తదానం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదా?
లండన్ లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన ఓ అధ్యయనం..తరచుగా రక్తదానం చేయడం, బ్లడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం మధ్య ఊహించని సంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. వయస్సు పెరిగే కొద్దీ మన రక్తం ఏర్పడే మూల కణాలు సహజంగా ఉత్పరివర్తనలను(Mutations) కూడగట్టుకుంటాయి. ఈ ప్రక్రియను క్లోనల్ హెమటోపోయిసిస్ అంటారు. ఈ మార్పులలో కొన్ని లుకేమియా,ఇతర రక్త రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి.
పరిశోధకులు 60 ఏళ్ల వయసున్న రెండు రకాల ఆరోగ్యవంతమైన పురుషులను పోల్చారు..ఒక గ్రూపు 40 సంవత్సరాల పాటు సంవత్సరానికి మూడు సార్లు రక్తదానం చేయగా..మరొక గ్రూపు మొత్తం ఐదు సార్లు రక్తదానం చేసింది. ఈ పరీక్షలో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు గ్రూపులలో జన్యు ఉత్పరివర్తనలు ఒకే సంఖ్యలో ఉన్నాయి, కానీ తరచుగా రక్తం దానం చేసిన వ్యక్తులు క్యాన్సర్‌తో సంబంధం లేని ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నారు.
క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల తాజా రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని, ఇది జన్యు స్వరూపాన్ని ప్రయోజనకరమైన మార్గాల్లో మార్చగలదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం అయినప్పటికీ ప్రస్తుత ఫలితాలు మాత్రం సంభావ్య రక్షణ ప్రభావాన్ని సూచిస్తున్నాయి.
గుండె ఆరోగ్యం
రక్తదానం చేయడం వల్ల కలిగే అత్యంత చక్కగా నమోదు చేయబడిన ప్రయోజనాల్లో ఒకటి హృదయ ఆరోగ్యంపై దాని సంభావ్య ప్రభావం. మీ రక్తం ఎంత మందంగా లేదా సన్నగా ఉంటుంది అనేది గుండె జబ్బులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తం చాలా మందంగా మారినప్పుడు అది గడ్డకట్టడం, అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
రక్తదానం చేయడం వల్లమీరు రక్త గడ్డకట్టడాన్ని తగ్గించగలుగుతారు. మీ గుండె పంప్ చేయడాన్ని సులభతరం చేస్తారు, గుండె జబ్బుల సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోగలుగుతారు. రక్తదానం ఐరన్ లెవల్స్ ని కంట్రల్ చేయడంలో కూడా. ఆక్సిజన్ సప్లైకి ఐరన్ చాలా అవసరం..కానీ ఎక్కువ ఐరన్ ఆక్సీకరణ ఒత్తిడి, వాపుకు దోహదం చేస్తుంది. ఈ రెండూ గుండె జబ్బులతో ముడిపడి ఉన్నాయి. రక్తదానం చేయడం ద్వారా మీరు సహజంగా అదనపు ఐరన్ ను రిలీజ్ చేస్తారు, గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తారు. కొన్ని అధ్యయనాల్లో రక్తదానం చేయడం వల్ల ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటు తగ్గుతుందని కూడా తేలింది.
హెల్త్ చెకప్
మీరు రక్తదానం చేసిన ప్రతిసారీ మీకు ఉచిత హెల్త్ చెకప్ లభిస్తుంది. దానం చేసే ముందు వైద్య నిపుణులు మీ రక్తపోటు, హిమోగ్లోబిన్ స్థాయి, నాడిని చెక్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అంటు వ్యాధుల కోసం పరీక్షించబడతారు. ఇది సాధారణ వైద్య పరీక్షలను భర్తీ చేయకపోయినా సంభావ్య ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











