Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Cool water: ఎండాకాలంలో కూల్ వాటర్ తాగితే చనిపోతారా? వైద్యులు ఏం చెప్పారంటే?
మనిషికి నీరు అనేది చాలా ముఖ్యం. అన్నం తినకుండా అయినా మనిషి జీవించగలడేమో కానీ, నీరు తాగకుండా మాత్రం జీవించలేడు. సరైన సమయానికి, సరైన మొత్తంలో నీరు తాగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. నీరు తాగడంలో ప్రతి వ్యక్తికి ఒక్కో రకమైన విధానం ఉంటుంది. కొంతమంది గోరువెచ్చని నీరు తాగుతారు, మరికొందరు వేడి నీరు తాగడం ఇష్టపడతారు, ఇంకొంతమంది ఐస్ నీరు తీసుకోవడం ఉత్తమంగా భావిస్తారు.
అయితే చల్లటి నీరు తాగడం వలన మనిషి చనిపోతాడని పలు కథనాలు వినపడుతున్నాయి. వారు చల్లటి నీరు శరీరానికి హానికరం అని పేర్కొంటున్నారు. ఇంతకీ చల్లటి నీరు తాగడం అనేది నిజంగా హానికరమా? చల్లటి నీరు తాగడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

చల్లటి నీరు తాగడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి?
వైద్యుల ప్రకారం, కొన్ని సందర్భాల్లో చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఇది అల్పోష్ణస్థితి మరియు షాక్‌ను కలిగించే అవకాశం ఉంటుంది.
అందుకే గుండె జబ్బులతో బాధపడే వ్యక్తులకు చల్లటి నీరు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, చల్లటి నీరు తాగడం వలన కడుపులో అసౌకర్యం, వాంతులు లేదా జీర్ణశయ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.
ఇతర వైద్యులు కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు లేదా, కొద్దిగా చల్లటి నీరే తాగాలని సూచిస్తున్నారు. శారీరక శ్రమ చేసిన తరువాత చల్లటి నీరు తాగడం అనేది అత్యంత ప్రమాదకరమని, దానిని కచ్చితంగా మానేయాలని సూచిస్తున్నారు. చల్లటి నీరు తాగిన తర్వాత, మీకు అసౌకర్యం లేదా ఛాతిలో నొప్పి ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరణం వస్తుందా?
చివరికి చెప్పేది ఏంటంటే పలు పరిశోధనలు, వైద్యుల ప్రకారం.. చల్లటి నీరు తాగడం వలన మరణం అనేది సంభవించదు. కాకపోతే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులు ఈ నీటిని తాగడం వల్ల కచ్చితంగా పలు ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చల్లటి నీరు తాగే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications