గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే..

కోడిగుడ్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రపంచంలో బెస్ట్ మల్టీ విటమిన్ ఫుడ్ ఇది. అంటే దేవుడు మనకిచ్చిన బలం ట్యాబ్లెట్స్ కోడిగుడ్డు అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ సి తప్ప అన్నీ విటమిన్లు ఉంటాయి. జుట్టు నుంచి కాలి గోరు వరకు ఎటుంటి ఆరోగ్య సమస్య ఉన్నా సరే కోడిగుడ్డు తాంటే ఫుల్ బలం వస్తుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఎక్కువ ప్రొటీన్ లభిస్తుంని కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు.

కోడిగుడ్డు..బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని ఆయన చెప్పారు. రోజూ ఉదయం టిఫిన్స్ కి బదులు కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. పొద్దున టైంలో కోడిగుడ్లు తింటే పొట్ట రాదు అని, బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంటాయని, ఇమ్యూనిటీ పెరిగి ఫుల్ బలం వస్తుందని చెప్పారు.

Does eating egg yolks increase cholesterol lead to a heart attack Dr Vikrant Singh Explains Truth

అయితే కోడిగుడ్ల విషయంలో చాలామందిలో ఒక సందేహం ఉంటది. గుడ్డు పచ్చసొన లో కొలెస్ట్రాల్ ఉంటది, అది తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దీని వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే ఉడికించిన గుడ్డులో కేవలం తెల్లగా ఉండేది తిని,లోపలది పారేస్తుంటారు. ఆమ్లెట్ వేసినప్పుడు కూడా చాలామంది పచ్చసొన తీసేసి ఆమ్లెట్ వేసుకుంటారు. అయితే దీనికి డాక్టర్ విక్రాంత్ సింగ్ అద్భుతమైన ఉదాహరణతో సమాధానం చెప్పారు.

వాస్తవానికి కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తినడం ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ అనేది పెరగదని, కొలెస్ట్రాల్ అనేది 80-90 శాతం లివర్ తయారుచేసుకుంటదని చెప్పారు. మనం తినడం ద్వారా పెరిగే కొలెస్ట్రాల్ కేవలం 10-20 శాతం మాత్రమేనని అన్నారు. కాబట్టి మనం కోడిగుడ్డు తింటే ఖచ్చితంగా లోపల పచ్చసది కూడా తినాలని చెప్పారు.

కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవేకిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే

కొలెస్ట్రాల్ వల్లనే హార్ట్ ఎటాక్ వస్తుందనే ఫీలింగ్ చాలామందిలో ఉంటదని, అయితే ఇది తప్పు అని డాక్టర్ అన్నారు. ఎక్కడైనా మంటలు వస్తే దానిని ఆర్ఫడానికి వచ్చే ఫైరింజన్ వాళ్ల మాదిరిగానే రక్తనరాల్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్(మంట లేదా వాపు)జరిగినప్పుడు దానిని ఆర్పడానికి వచ్చేదే కొలెస్ట్రాల్ అని అన్నారు. మంట దేనివల్ల వచ్చిందో ఆ కారణాన్ని గుర్తించి దాన్ని ఆపాలి తప్ప,మంట ఆపడానికి వచ్చినోళ్లని తీసుకెళ్లి జెలులో పెట్టడం లాంటిదే కొలెస్ట్రాల్ ని నిందించడం అని అన్నారు.

రక్తం లోపల అధికంగా షుగర్స్ ఉంటే అప్పుడు రక్తనరాల్లో వస్తుందన్నారు. రక్తనరం లోపల 4 గ్రాముల కంటే ఎక్కువ షుగర్ ఉండకూడదన్నారు.అందుకే మన శరీరంలో ఇన్సులిన్ అనే అద్భుతమైన హార్మోన్ దేవుడు ఉంచాడని ఆయన చెప్పారు. ఎప్పుడైతే రక్తంలో షుగర్ ఎక్కువైతే వాపు, మంట వస్తుందని, అప్పుడు కొలెస్ట్రాలే వెళ్లి దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఒక పొర ఏర్పాటు చేస్తుందని, కాలక్రమేణా అది సమస్య అవుతుందని చెప్పారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion