Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మీరు రోజూ తినే ఆహరం ఇకపై తింటే మగతనం పోతుందట.. సైంటిస్టుల క్లారిటీ!
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతుంటాం. గతంలో అన్నంను మన తల్లిదండ్రులు దేవుడితో సమానంగా చూసుకునే వారు. అన్నం వేస్ట్ చేస్తే బండబూతులు తిట్టేవారు. అన్నం విలువ తెలుసా నీకు అంటూ మందలించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మార్కెట్‌లో ఎన్నో రకాల ఆహారపదార్థాలు వచ్చేశాయి. చాలా మంది రైస్ తినడం మానేసి వాటిని తినడం మొదలుపెడుతున్నారు. అయితే రైస్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని భయాలు ఎక్కువవడంతో ఇతర ఆహార పదార్థాలు వినియోగం పెరిగిందని చెప్పుకోవచ్చు.
రైస్ తినడం వల్ల బరువు పెరగడం, షుగర్ ఎక్కువ అవడం మాత్రమే కాదు, స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే, దీనిలో ఎంత నిజం ఉందో, రైస్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా, మిల్లెట్స్ తినాలా అనే విషయంపై నిపుణులు ఏం చెప్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.

మధుమేహంపై ప్రభావం
రైస్‌లో గ్లైసమిక్ ఇండెక్స్ 70-90 మధ్య ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. కానీ, మిల్లెట్స్‌లో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ రైస్‌తో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. అయితే, మిలెట్‌ను కేవలం అన్నంతో పోల్చకుండా పప్పులు లేదా కర్రీలతో కలిపి తీసుకుంటే, గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ విధంగా మిల్లెట్స్ మరియు రైస్ మధ్య తేడా కొంత ఉంటుంది.
రైస్ మరియు మిల్లెట్స్ మధ్య తేడాలు
వైట్ రైస్: 100 గ్రాముల్లో 350 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 78 గ్రాముల కార్బ్స్, 0.6 గ్రాముల ఫైబర్.
బ్రౌన్ రైస్: 360 కేలరీలు, 7.5 గ్రాముల ప్రోటీన్, 76 గ్రాముల కార్బ్స్, 3.5 గ్రాముల ఫైబర్.
కోర్ర (ఫోక్సే): 355 కేలరీలు, 12 గ్రాముల ప్రోటీన్, 70 గ్రాముల కార్బ్స్, 8 గ్రాముల ఫైబర్.
సజ్జ (సీజమ్): 360 కేలరీలు, 11 గ్రాముల ప్రోటీన్, 67 గ్రాముల కార్బ్స్, 8.5 గ్రాముల ఫైబర్.
రాగి: 336 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 72 గ్రాముల కార్బ్స్, 11 గ్రాముల ఫైబర్.
మిల్లెట్స్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ కంటే తక్కువగా ఉంటుంది (40-55). అలాగే, మిల్లెట్స్‌లో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. రైస్ త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి, వర్క్ అవుట్ తరువాత రైస్ తినడం మంచిది. మిల్లెట్స్ మినహాయించి, ప్రోటీన్, ఫైబర్, మరియు మినరల్స్‌ని రైస్‌తో కూడా సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం
రైస్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం లేదా నాణ్యత తగ్గడం అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కొన్ని పరిశోధనల్లో రైస్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరిగే అంశాలు కనిపించాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా జెనిటిక్స్, వయసు, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఈ ప్రభావాన్ని చూపవచ్చు. అయితే రైస్ తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పై ప్రతికూల ప్రభావం లేదని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన పోషకాలు, బ్యాలెన్స్ డైట్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications