Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
షుగర్ రావడానికి ఆ మాంసమే ప్రధాన కారణమట.. తినడం ఇప్పుడే ఆపేయండి, లేకపోతే ఇక అంతే!
ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు, డయాబెటిస్. ఈ రెండు సమస్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎప్పుడైతే శరీరంలో క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు, లేదా శరీరంలోని ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగం కానప్పుడు మనిషికి డయాబెటిస్ వస్తుంది. అయితే మనిషికి డయాబెటిస్ ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఎందుకు వస్తుందంటే?
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే, అది హైపర్గ్లైసీమియాగా పిలువబడుతుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా శరీరంలో అనేక ప్రక్రియలను నాశనం చేయవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక బరువు, అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి వంటి విషయాలు డయాబెటిస్‌కు కారణాలు కావచ్చు. ప్రాసెస్ చేసిన మాంసం, ఎర్ర మాంసం తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.

ఎర్ర మాంసం, డయాబెటిస్ మధ్య సంబంధం ఏంటి?
ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు 20 దేశాల్లో 31 అధ్యయనాల నుండి 19.7 లక్షల మందిపై డయాబెటిస్ పరీక్షలను నిర్వహించారు. ఈ అధ్యయనంలో వయస్సు, అలవాట్లు, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ పరిశోధనలో ప్రతిరోజు 50 గ్రాముల ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకునే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15% ఎక్కువగా ఉందని పరిశోధకులు గమనించారు.
ఇక, ప్రతిరోజూ 100 గ్రాముల ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం తినడం వలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం 10% పెరుగుతుందని, అలాగే 100 గ్రాముల పౌల్ట్రీ మాంసం తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం 8% పెరిగిందని అధ్యయనంలో పేర్కొంది. టైప్ 2 డయాబెటిస్ ప్రభావం తగ్గించడానికి ప్రాసెస్ చేసిన మాంసం వినియోగాన్ని పరిమితం చేయాలని చెప్పారు.
ఇంతకుముందు..
మునుపటి పరిశోధనలలో కూడా, రోజుకు ఒకసారి కంటే ఎక్కువ ఎర్ర మాంసం తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 62% పెరిగిందని తేలింది. కోడి మాంసం, గుడ్ల యొక్క రోజువారీ వినియోగాన్ని 113 గ్రాములకు పరిమితం చేయాలని యుఎస్ అధికారులు సిఫారసు చెప్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలను వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు తీసుకోవద్దని చెప్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications