Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
హార్ట్ అటాక్, స్ట్రోక్ తగ్గించడానికి ఆరోగ్యవంతు కూడా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు!ఇది సురక్షితమేనా?
ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ స్ట్రోక్ మరణాలు ఎక్కువగా సంభవిస్తుండటంతో ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటుంటారు. అందులో ఈ మద్యకాలంలో ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. అయితే ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ ఆరోగ్యవంతులు కూడా ఇష్టానుసారంగా తీసుకోవడం ప్రాణానికి హాని కనిలగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన వ్యక్తి దీనిని తీసుకోకూడదు
మాంసాహారులు చేపలను తినడం వల్ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు డాక్టర్ ను సంప్రదించకుండా ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ కు సంబంధించిన మరియు గుండెకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని పెరుగుతున్నాయని, అధ్యయనాల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలాంటి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవడానికి బదులుగా తాజాగా ఉండే చేపలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిదిని అంటున్నారు. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అయితే సివిడి ఆరోగ్య సమస్యలున్నవారు చేపనూనెనెను తీసుకోవచ్చుని అధ్యయనంలో వివరించింది.
BMJ జర్నల్స్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ క్రమం తప్పకుండా తీసుకుంటే స్ట్రోక్ 5% మరియు ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో గుండెలోని కర్ణకల్లో దడ(AF) ప్రమాదాన్ని 13% పెంచుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో హార్ట్ రేట్ పెరిగి ఛాతీలో అసౌకర్యం ప్రారంభం అవుతుంది. దమనుల్లో వాపుకు కారణం అవుతుంది. గుండె ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.
పక్షవాతం వచ్చినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. గుండె దడ మరియు స్ట్రోక్ రెండూ తీవ్రమైన పరిస్థిలు కాబట్టి, ఆరోగ్యకరమైన వ్యక్తులు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోకూడదు.
ఈ అధ్యయనం ఫ్లోరిడాలో జరిగింది, జాక్సన్‌విల్లే, ఫ్లోరిడాలోని హెల్తీ ఔట్‌లుక్ ఈ వాస్తవాన్ని కనుగొంది. ఒమేగా 3ని సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల రక్తస్రావం మరియు గుండె సమస్యలు వస్తాయి.
గుండె సమస్యలతో బాధపడేవారికి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ మంచివి
గుండె జబ్బులతో బాధపడేవారికి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ప్రయోజనకరంగా ఉంటాయని పరిశోధలు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు మాత్రమే వీటిని నివారించాలి. రోజూ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
ఒక ప్రత్యేక విషయం ఏంటంటే, కార్డియాలజిస్టుల అందరు పేషంట్స్ కు ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ సిఫారస్ చేయరు. అయితే ఇప్పటికీ ప్రజలు స్వయంగా కొనుగోలు చేసి, వాడటం మొదలుపెట్టారు. అలా చేయడం ప్రాణాంతకం. కాబట్టి డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే తీసుకోవాలి.
ఒమేగా 3 కోసం మీరు సప్లిమెంట్ కు ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవాలి.
మీరు ఆరోగ్యవంతులైతే మరియు గుండె సమస్యలు లేకుంటే, మీరు సప్లిమెంట్లకు బదులుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తినాలి.
ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి
చేపలు, చియా గింజలు, సోయాబీన్స్, అవిసె గింజలు, వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి.
గుండె సమస్యలు ఉన్నవారికి ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఒమేగా 3 గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది
క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది
ఇది మలబద్ధకం సమస్యను, విరేచనాలను నివారిస్తుంది.
వాపు సమస్యను తగ్గిస్తుంది.
కానీ ఆరోగ్యంగా ఉన్నవారు దీనిని తీసుకుంటే, అది చెడు ప్రభావాన్ని చూపుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











