Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చలికాలంలో ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? ఈ రోగాలు వస్తాయా?
సాధారణంగా చలికాలంలో శృంగార వాంఛ అనేది ఎక్కువగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండడంతో శృంగార కోరికలు అధికంగా వస్తుంటాయి. అందుకే దంపతులు సాధారణంగా చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటారు. సాధారణం కంటే అధికంగా లైంగిక చర్యల్లో భాగస్వామ్యులు అవుతుంటారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయనే అపోహలు వస్తుంటాయి. జలుబు, దగ్గు వంటి రోగాలు వస్తాయని చెప్పుకుంటుంటారు. ఈ అపోహల్లో ఎంత వరకు నిజముంది? చలికాలంలో శృంగారంలో అధికంగా పాల్గొనే నిజంగానే రోగాలు వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నిజం ఇదే..
చలికాలంలో శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొంటే రోగాలు వస్తాయనే వార్తల్లో నిజం లేదు. లైంగిక చర్యల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి రోగాలు రావు, అలాగే దగ్గు, జలుబు వంటి రోగాలు కూడా దరిచేరవు. పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. చలికాలంలో శృంగారంలో పాల్గొనడం వల్ల రోగాలు వస్తాయనేది కేవలం అవాస్తవమని చెప్పుకోవచ్చు.

కానీ ఇది చేయాల్సి ఉంటుంది..
చలికాలంలో సాధారణంగా రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. చల్లటి వాతావరణంలో బ్యాక్టీరియాలు ఎక్కువ సేపు ఉంటాయి కాబట్టి వ్యాధి సోకె ప్రమాదం కూడా అధికంగానే ఉంటుంది. అందుకే శృంగారంలో పాల్గొనే సమయంలో పరిశుభ్రంగా ఉండాలి. సాధారణం కంటే ఎక్కువగా మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లైంగిక చర్యల్లో పాల్గొనేటప్పుడు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాము.
చలికాలంలో శృంగారం వల్ల ప్రయోజనాలు..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
శృంగారం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఎక్కువ సార్లు లైంగిక చర్యల్లో పాల్గొనడం వల్ల కొంచెం ఎక్కువగానే రోగ నిరోధక శక్తి ఉంటుంది. దాని కారణంగా చలికాలంలో వచ్చే.. ఇన్ఫెక్షన్స్, రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే శృంగారం చేయడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. దీంతో అవయవాలు సరిగ్గా పని చేయడంతో పాటు, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.
శరీరానికి వెచ్చదనం..
చలికాలంలో శృంగారం ఎక్కువగా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన వెచ్చదనం అందుతుంది. దీని కారణంగా చలి అనిపించదు. అలాగే మంచి అనుభూతి కలుగుతుంది. బెడ్‌పై ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి తగ్గుతుంది:
చల్లటి వాతావరణంలో శరీరం బద్ధకంగా ఉంటుంది. మానసికంగా కూడా చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అయితే శృంగారం చేయడం వల్ల.. శరీరంలో సంతోషకరమైన హార్మోన్స్ విడుదలవుతాయి. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు సంతోషంగా ఉండడానికి వీలుంటుంది.
రక్త ప్రసరణ మెరుగు పడుతుంది..
సాధారణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చలికాలంలో ఎక్కువ సార్లు పాల్గొనడం వల్ల ఆ రేటు కొంచెం అధికంగానే ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని అవయవాలు మెరుగ్గా పని చేస్తాయి. అదే సమయంలో గుండె సంబంధిత రోగాలు దూరమవుతాయి. దీంతో పాటు శృంగారంలో అధికంగా పాల్గొనడం వల్ల శరీరం అలిసిపోతుంది. శృంగారం తరువాత మెదడులో సిరటోనిన్, ఓపియోయిడ్‌లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి మంచిగా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఆలాగే నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications