Latest Updates
-
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ
వాన నీటిని తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి
వర్షపు నీటిని తాగవచ్చా..? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా. వాన నీటితో వ్యవసాయ సాగు చేస్తారు. మొక్కలు పెంచుతారు. కొందరు ఆ వాన నీటిని స్టోర్ చేసుకుని ఇంటి అవసరాలకు, వాటిని ప్యూరిఫై చేసి తాగునీటి అవసరాలకు కూడా వాడతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే వాన నీటిని నేరుగా తాగొచ్చా.. వాతావరణంలోని దుమ్ము ధూళి, వాయువుల్లోని రసాయనాలు వాన నీటిలో కలుస్తాయా.. అలాంటి నీటిని తాగొచ్చా.. తాగితే ఎలాంటి లాభాలున్నాయి.. ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షపు నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ఆయుర్వేదం చెబుతోంది. వాన నీరు తాగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. వర్షపు నీరు తాగితే మానవ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యురాలు రేఖ రాధామణి.. వర్షపు నీటి ప్రయోజనాలు తెలిపారు. వాటిని ఎలా సేకరించాలి, ఎలాంటి పాత్రల్లో వర్షపు నీటిని సేకరించి తాగాలో వివరించారు.

వర్షపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనది. ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇంటికి వచ్చే మున్సిపల్ నీటిలో క్లోరిన్, ఫ్లోరైడ్ ఉన్నట్లుగా ఈ నీటిలో అలాంటి రసాయనాలు ఏవీ ఉండవు.
- వర్షపు నీటిలో మినరల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
- వాన నీటిలో తక్కువ స్థాయిలో ఉండే ఆల్కలీన్ pH జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
వర్షపు నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
- సీసం, పాదరసం, ఇతర భారీ లోహాలు వంటి గాలి నుంచి కాలుష్య కారకాలతో వర్షపు నీరు కలుషితం అవుతుంది.
- నీటిపై పడిన తర్వాత బ్యాక్టీరియా, సూక్షక్రిములు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటితో వాన నీరు కలుషితం అవుతుంది.
- లెజియోనెల్లా బ్యాక్టీరియాను కూడా వర్షపు నీటిలో చేరే అవకాశాలు లేకపోలేదు. ఇది తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయిన లెజియోనైర్స్ వ్యాధిని కలిగించవచ్చు.
వర్షపు నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ వర్షపు నీటిని ఎలా సేకరిస్తున్నాం, ఎలాంటి ప్రాంతంలో పడిన వాన నీటిని తాగుతున్నాం, చుట్టూ ఉన్న వాతావరణ కాలుష్యం లాంటి అంశాలపై ఆధారపడి మాత్రమే వాన నీటిని తాగాలాని వైద్యులు సూచిస్తున్నారు.
వర్షపు నీటిని సేకరించడానికి చిట్కాలు:
- వాన నీటిని నేరుగా సేకరించడానికి ప్రయత్నించాలి.
- ఇంటి పైకప్పు మీద పడిన నీటిని సేకరించాలనుకుంటే ఆ పైకప్పు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- వర్షపు నీటిని రాగి పాత్రలో సేకరించడం మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications