Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిగరెట్ తాగితే స్ట్రెస్ నిజంగానే తగ్గుతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఉద్యోగంలో పని భారం, ఇంట్లో గొడవలు, కుటుంబ ఆర్ధిక సమస్యల కారణంగా చాలా మంది రోజంతా ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడికి గురైనప్పుడల్లా అందరూ సిగరెట్ తాగుతుంటారు. అది అడ్డు అదుపు లేకుండా అలానే తాగుతూ ఉంటారు కొంతమంది. రోజుకు ప్యాకెట్ అవ్వొచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో అది రెండు లేదా మూడు ప్యాకెట్లకు కూడా వెళ్లిపోతుంటుంది. సిగరెట్ తాగితే తమ స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుందని, తాము ప్రశాంతంగా ఉండగలుగుతామని చెబుతుంటారు. కానీ నిజంగానే సిగరెట్ తాగితే స్ట్రెస్ తగ్గుతుందా? ఇది పని చేస్తుందా? దీని గురించి మానసిక ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరోగ్యం క్షీణిస్తుంది..
మనిషి ఆరోగ్యం అనేది రోజురోజూకు క్షీణీస్తోంది. మనిషి యొక్క ఆరోగ్యం క్షీణించడానికి అనేక కారణాలు ఉండొచ్చు. బిజీ లైఫ్‌స్టైల్, ఆఫీసు ఒత్తిడి, వ్యక్తిగత జీవితం సమస్యలు, ఇవి అన్ని మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. ఈ నేపథ్యంలో, చాలామంది ఆఫీసు ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకునేందుకు సిగరెట్లను ఆశ్రయిస్తారు. సిగరెట్లలో నికోటిన్ ఉంటది. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. సిగరెట్ పీల్చినప్పుడు, నికోటిన్ శరీరంలో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది కొంత సమయం పాటు సంతోషం మరియు రిలాక్స్‌డ్ ఫీల్ కలిగిస్తుంది. ఈ కారణంగానే కొన్ని సెకన్ల పాటు సిగరెట్లు తాగిన తర్వాత మనం మంచిగా ఆనందాన్ని పొందగలుగుతాము.

మరింత ఒత్తిడి
కానీ, సిగరెట్లు కొన్ని క్షణాల పాటు శరీరానికి మంచి ఫీల్ కలిగిస్తే, అది ఆరోగ్యానికి గణనీయమైన హానిని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతర ధూమపానం మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుందని పేర్కొంటున్నారు. దీర్ఘకాలంగా నికోటిన్ వాడకం శరీరంలో హార్మోన్ల సమతుల్యతను బాగా దెబ్బతీస్తుంది. దీని కారణంగా మనిషి యొక్క ఆరోగ్యం క్రమక్రమంగా దెబ్బతింటుందని.. అలాగే వారిలోని కణాలు కూడా మరణిస్తూ ఉంటాయని చెబుతున్నారు.
ఈ మార్పులు ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తాయని పేర్కొంటున్నారు. సిగరెట్లు వదిలివేయడం చాలామందికి అది సులభమైన ప్రక్రియ కాదు. ఎందుకంటే సిగరెట్‌లోని నికోటిన్ ఒక వ్యసనంగా మారుతుంది. దీని వల్ల, ఒక వ్యక్తి సిగరెట్ తాగడం మానాలని ప్రయత్నించినా, శరీరంలో నికోటిన్ స్థాయి తగ్గినప్పుడు చిరాకు, కోపం వంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంటుంది.
అయితే, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సిగరెట్లు అవసరం కాదు. ఆరోగ్యకరమైన ఎంపికలలో శారీరక శ్రమ, నడవడం లేదా వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే, లోతైన శ్వాస వ్యాయామాలు కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మేల్కొనే సమయాలు, నిద్రపోయే సమయాలు సెట్ చేయడం, మరియు సరైన నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చర్చించడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగకరం.
మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు సిగరెట్, మందు వంటి మత్తు పానీయాల జోలికి వెళ్లకుండా ఇలా సహజసిద్ధమైన పద్దతిలో ఒత్తిడిని తగ్గించుకోవడం ఉత్తమం. ఎందుకంటే సిగరెట్ మందు వంటి వాటికి అలవాటు పడితే తాత్కాలిక ఆనందం కలుగుతుంది తప్పా.. శాశ్వతమైన హాని చాలా జరుగుతుంది. అలాగే మనిషి మరలా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications