Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాత్రిళ్లు పనిచేస్తే హార్ట్ ఎటాక్, డయాబెటీస్.. హెచ్చరిస్తున్న పరిశోధనలు..
మారుతున్న జీవినశైలిలో చాలా మంది రాత్రిళ్లు పనిచేస్తున్నారు. ఇది గత 25 సంవత్సరాల నుంచి మన దేశంలో నైట్‌షిఫ్ట్ ఉద్యోగాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయ్. కంపెనీల క్లయింట్లు వేరే దేశానికి సంబంధించిన వారు ఉండడం అక్కడి వారు కోసం మన వారు రాత్రిళ్లు పనిచేయవలసి రావడంతో ఈ నైట్‌షిఫ్ట్‌లో పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా నిద్రను ఆపుకొని పనిచేయడం వల్ల శరీరం దెబ్బతింటుందని, తీవ్ర అనారోగ్యాలకు గురికావలసి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనేక పరిశోధనల తరువాత ఈ విషయాన్ని తేల్చారు. మూడు రోజులు నిరంతరాయంగా నైట్‌షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనుగ్గొన్నారు. .
శరీరంలో ఉండే కణాలు, ప్రొటీన్ సప్లై, ఇతర అవయవాల పనితీరు మొత్తం ఒక రిథమ్ ప్రకారం జరుగుతుందని, నైట్ షిఫ్ట్ వల్ల ఈ రిథమ్ దెబ్బతినడంతో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపెట్టి అనారోగ్యం బారిన పడతారని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయ్. నైట్ షిఫ్ట్ వల్ల ఎలాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకుందాం.
నైట్ షిఫ్ట్ చేయడం వల్ల కలిగే ప్రమాదం :
గుండెపోటు : చాలా పరిశోధనల తరువాత నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనుగ్గొన్నారు. శరీరంలో రక్తప్రసరణ, నిద్రించే పద్ధితి మారినప్పుడు శరీరంలో లోపల కూడా కణాల పనితీరు మారిపోతుంది. దీనివల్ల రక్తపోటులో మార్పు వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

డిప్రెషన్ : నైట్ షిఫ్ట్‌లో ఎక్కువగా పనిచేసే వారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉన్నట్లు కనుగ్గొన్నారు. అలాంటి వారిలో మూడ్ తరచూ మారుతూ ఉండడాన్ని కూడా గమనించారు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఉదయం ఖచ్చితంగా చేయాల్సిన పనులు చేసుకుంటూ రాత్రిళ్లు నిద్రపోకుండా పనిచేయడం వల్ల మెదడుపై భారం పడి, డిప్రెషన్‌కి గురౌతున్నట్లు కూడా కనుగ్గొన్నారు. నైట్ షిఫ్ట్ చేసే చాలా మందిలో చిరాకు ఎక్కువగా రావడానికి కూడా మానసిక ఒత్తిడేనని తేలింది.
నిద్రలేమి : నైట్ షిఫ్ట్ చేసేవారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నిద్రలేమి. రాత్రిళ్లు పనిచేసి ఉదయం పడుకోవాలనుకునే వారికి నిద్ర అప్పటికి అప్పడే పట్టదు. శరీరంలో పనితీరు రిథమ్ మారడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంది. చీకటి పడిన తరువా ఏ చప్పుడూ లేని చీకటిలో ప్రశాంతంగా నిద్రపోయే అనుభూతిని వీరు పొందలేరు.
బరువు పెరగడం : నైట్ షిఫ్ట్ చేసే వారి ఆహార అలవాట్లలో కూడా భారీ మార్పులు వస్తాయ్. వీరు ఎక్కువగా జంక్ ఫుడ్‌కు అలవాటు పడే అవకాశం వుంది. వాటిలో ఉండే కొవ్వు, చెక్కర పదార్ధాల వల్ల సులువుగా బరువు పెరిగిపోతారు. ఇక వ్యాయామం చేయడానికి సమయం దొరక్కపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. భోజనం చేసే సమయం కూడా మారిపోవడంతో శరీరంలో ఇన్సులిన్ దెబ్బతిని టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.
హార్మోన్లపై ప్రభావం : నిద్రించే సమయంలో రెండు హార్మోన్లు పనిచేస్తాయ్. ఒకటి లెప్టిన్ మరొకటి గ్రెలిన్. ఈ రెండు హార్మోన్లు ఆకలిని నియంత్రిస్తూ వుంటాయ్. నిద్రలో మార్పురావడం వల్ల లెప్టిన్ పై ప్రభావం పడి ఆకలి ఎక్కువయ్యే గ్రెహ్లిన్ స్థాయిని పెంచుతుంది. దీంతో ఆకలి ఎక్కువ కావడం, ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications