Latest Updates
-
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
ఎండాకాలం మామిడి పండ్లు తెగ తినేస్తున్నారా.. తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు!
వేసవి కాలం వచ్చేసింది గురూ. వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. అలాగే మనకెంతో ఇష్టమైన మామిడి పండ్లు కూడా మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఎండలను సైతం మైమరిపించే రుచితో ఉండే ఈ పండ్లు వేసవిలో విరివిగా దొరుకుతుంటాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఎంత తిన్నా తినాలనే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మామిడి పండ్లు కేవలం పండ్లు మాత్రమే కాదు అదొక ఎమోషన్ కూడా. ఈ మామిడి పండ్లను నేరుగా తినడంతో పాటు రకరకాల జ్యూస్, షేక్‌లు చేసుకొని తింటుంటారు.
అయితే ఈ పండ్లను తినడం వలన ఎన్ని మంచి ప్రయోజనాలు జరుగుతాయో.. తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్టోరీలో మామిడి పండ్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మామిడి పండ్లలో దాగిన ఆరోగ్య రహస్యాలు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
మామిడిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఈ పండు శరీరాన్ని బలపరచి, వైరల్, బ్యాక్టీరియా దాడులనుండి రక్షిస్తుంది.
కంటి ఆరోగ్యం మెరుగవుతుంది
విటమిన్ A అధికంగా ఉండే ఈ పండు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియకు తోడ్పాటు
ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన మామిడి పండు జీర్ణవ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో దోహదపడుతుంది.
హృదయ ఆరోగ్యానికి మేలు
ఇందులో యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియం ఉండటం వలన రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి మామిడి చాలా మంచిది.
మెదడు స్థితి & హార్మోన్ బ్యాలెన్స్
ఫోలేట్, విటమిన్ B6 లాంటి పోషకాల వలన మానసిక స్థితి మెరుగుపడుతుంది.
మామిడి తినే ముందు పాటించాల్సిన ముఖ్య సూచనలు
మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే మామిడిని కడగకండి. తొలుత 25-30 నిమిషాలు నీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రంగా కడగాలి.
మామిడి పండును ఫ్రిజ్‌లో ఉంచరాదు. గది ఉష్ణోగ్రత వద్ద 5-7 రోజుల్లో అవి సహజంగా పక్వతకు వస్తాయి.
వాటిని పేపర్‌తో కప్పితే వేగంగా పక్వానికి వస్తాయి. కానీ, సూర్యకాంతి తాకే ప్రదేశాల్లో ఉంచడం వల్ల పండు చెడిపోవచ్చు.
ఇతర పండ్లతో కలిసి ఉంచకండి. అవి విడుదల చేసే ఇథిలీన్ వాయువు వల్ల మామిడులు త్వరగా పాడవుతాయి.
ఫ్రిజ్‌లో నిల్వ చేయాలంటే ఇలా చేయండి
పూర్తిగా పండిన మామిడిని మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టండి.
తినే ముందు కనీసం అరగంట ముందే ఫ్రిజ్ నుంచి బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి.
చల్లారిన తర్వాత కోసుకుని తినడం వల్ల రుచీ, ఆరోగ్యం రెండూ మెరుగవుతాయి.
తిన్న తర్వాత తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయాలు
మామిడి తిన్న వెంటనే చల్లటి నీరు తాగకండి. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
పాలు & మామిడి కలిపి తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి రావచ్చు.
మామిడి తిన్న తర్వాత వేడిగా లేదా కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది కాదు.
మామిడి తిన్న వెంటనే ఇతర పండ్లు తినకండి. ఇది గ్యాస్, అజీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.
తిన్న వెంటనే నిద్రపోవడం లేదా వ్యాయామం చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి. కనీసం 30 నిమిషాల విరామం అవసరం.
మామిడి తీసుకునే సమయం
మామిడి పండ్లు ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో తినడం ఉత్తమం. రాత్రి సమయాల్లో మామిడి తినడం జీర్ణక్రియను మందగిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ తిన్న మామిడి అధిక చక్కెర కారణంగా బరువు పెరగడాన్ని ప్రేరేపించవచ్చు.
చివరగా..
మామిడి పండ్లు మనకు ప్రకృతిలో లభించే ఉత్తమమైన ఆరోగ్య వనరులలో ఒకటి. వాటిని సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అలసత్వంగా, అవగాహన లేకుండా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఈ వేసవిలో మామిడిని మీ ఆరోగ్య భాగస్వామిగా మార్చుకోండి. చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఆస్వాదించండి!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications