Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
చెరకు గడను నమిలి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..డాక్టర్ చెబుతుందిదే!
సాధారణంగా మనం ఏదైనా తిరునాళ్లకో లేదా జాతరకో వెళ్లినప్పుడు అక్కడ చెరుకుగడలు అమ్ముతుండటం చూస్తుంటాం. ఆ సమయంలో వాటిని కొని కాసేపు నములుతుంటే నోటికి స్వర్గమే. ఈ చెరకు కేవలం తీపిని పంచడమే కాదు, అంతకు మించిన ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది.
మన పూర్వీకులు చెరకును ఆస్వాదిస్తూ నమిలి తినేవారు. కానీ నేటి తరం మాత్రం దంతాల సమస్యలనో, జలుబు చేస్తుందనో భయపడుతూ చెరకును దూరం పెడుతున్నారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ డాక్టర్ ప్రకాష్ మూర్తి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పిన విషయాలు వింటే మీరు చెరకు తినకుండా ఉండలేరు. చెరకు పోషకాల గని. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఎన్నో మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. చెరకు ఎందుకు తినాలో ఇక్కడ చూడండి.
కాలేయానికి రక్షా కవచం
ఆయుర్వేదంలో కామెర్లు, హెపటైటిస్ ట్రీట్మెంట్ కు చెరకును సూచిస్తారు. 2025లో పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం..చెరకులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఆల్కహాల్ వల్ల లేదా ఇతర విషపదార్థాల వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయని తేలింది. కాలేయాన్ని శుభ్రపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
జలుబు, జ్వరం వస్తుందనే భయం వద్దు
చెరకు తింటే జ్వరం వస్తుంది అనేది అపోహ మాత్రమే అని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో ఉండే వైరస్ ల వల్లే జలుబు, జ్వరాలు వస్తాయి తప్ప చెరకు వల్ల కాదు. ఒకవేళ గొంతులో చిన్నపాటి నొప్పి అనిపించినా, అది కొద్ది సేపటికే తగ్గిపోతుంది.
నోటి ఆరోగ్యం - దంతాలకు రక్షణ
చాలామంది చెరకు గట్టిగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ, డాక్టర్ ప్రకాష్ మూర్తి ప్రకారం, చెరకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ దంతాలను, చిగుళ్ళను దృఢంగా మారుస్తాయి. నమలడం అనేది దంతాలకు మంచి వ్యాయామం.
మలబద్ధకానికి చెక్
పండుగ సమయంలో పిండివంటలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావడం సహజం. చెరకులో సహజసిద్ధమైన భేదిమందు (Laxative) గుణాలు ఉన్నాయి. మలబద్ధకంతో బాధపడేవారు చెరకును తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మూత్ర సంబంధిత సమస్యలకు
మూత్ర విసర్జన సమయంలో మంట లేదా ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి చెరకు దివ్యౌషధం. ఇందులో ఉండే డైయూరెటిక్ లక్షణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి, ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తాయి.
చెరకు రసం తాగడం కంటే, గడను పళ్ళతో నమిలి తినడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల లాలాజలం ఊరి జీర్ణశక్తి పెరుగుతుంది, పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











