Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ సంకేతాలు బ్రెయిన్ ట్యూమర్ హెచ్చరిక కావచ్చు..
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీసు వర్క్, ఇంట్లో పని వంటి రకరకాల కారణాలతో తలనొప్పి రావడం సర్వసాధారణం. భరించలేని నొప్పి మొదలవగానే, ఓ ట్యాబ్లెట్ వేసుకుని తాత్కాలికంగా ఉపశమనం పొందుతాం. కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోయి అయ్యో, ఈ మధ్య ఒత్తిడి ఎక్కువైందని మనల్ని మనం సర్దిచెప్పుకుంటాం. కానీ ప్రతి తలనొప్పిని, ప్రతి మతిమరుపును కేవలం ఒత్తిడి అని లైట్ తీసుకోలేం.
కొన్నిసార్లు మనం సాధారణం అనుకునే ఈ లక్షణాల వెనుక ఓ ప్రమాదకరమైన నిశ్శబ్ధ హెచ్చరిక దాగి ఉండవచ్చు. అదే బ్రెయిన్ ట్యూమర్. మన మెదడు దాని ఉనికిని మనకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ..మనం దాని సంకేతాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. ట్యూమర్ ని ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత ఈజీ అవుతుంది. బ్రెయిన్ ట్యూమర్ ని సూచించే కొన్ని కీలక లక్షణాలను గమనించడం అత్యవసరం. అవేంటో ఇక్కడ చూడండి.

మెదడు పంపుతున్న 7 ముఖ్య సంకేతాలు
ఉదయాన్నే వేధించే తలనొప్పి: రోజూ ఉదయం నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పి వస్తోందా? దీంతో పాటు వికారం, వాంతులు కూడా ఉంటున్నాయా? ఇది సాధారణ తలనొప్పి కాకపోవచ్చు. మెదడుపై కణితి ఒత్తిడి పెరిగినప్పుడు ఇలాంటి నొప్పి వస్తుంది. ముఖ్యంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నొప్పి ఎక్కువైతే వెంటనే జాగ్రత్తపడాలి.
జ్ఞాపకశక్తి తగ్గడం: పేర్లు, వస్తువులు అప్పుడప్పుడు మర్చిపోవడం సహజమే. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలనే మర్చిపోవడం, మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురవడం లేదా ఆకస్మికంగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడం వంటివి ప్రమాద సంకేతాలు.
మాటల్లో తడబాటు: అకస్మాత్తుగా మాటలు ముద్దగా రావడం, సరైన పదాల కోసం వెతుక్కోవడం లేదా మీరు చెప్పేది ఎదుటివారికి అర్థం కాకపోవడం వంటివి మెదడులోని మాటలను నియంత్రించే భాగంలో సమస్య ఉందని సూచిస్తాయి.
జీవితంలో మొదటిసారి మూర్ఛ: గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద వయసులో అకస్మాత్తుగా మూర్ఛ రావడం అనేది అత్యంత తీవ్రమైన హెచ్చరిక. కణితులు మెదడులోని విద్యుత్ సంకేతాలకు అంతరాయం కలిగించడం వల్ల ఇలా జరుగుతుంది.

దృష్టిలో సమస్యలు: కళ్లు మసకబారడం, ఉన్నది ఒకటి అయితే రెండుగా కనిపించడం లేదా అకస్మాత్తుగా కళ్ల ముందు చీకట్లు కమ్మడం వంటివి కేవలం కంటి సమస్యలే కాకపోవచ్చు. మెదడులోని ఆప్టిక్ నరంపై కణితి ఒత్తిడి పెట్టడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.
శరీరంలో ఒకవైపు బలహీనత: కారణం లేకుండా మీ శరీరంలో ఒక చేయి లేదా కాలు బలహీనంగా మారడం, చచ్చుబడిపోయినట్లు అనిపించడం మెదడులో కణితికి ఎదురు వైపు సమస్య ఉందని చెప్పడానికి సంకేతం.
తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం: అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోతున్నట్లు అనిపించడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం వంటివి తరచుగా జరుగుతుంటే, అది మెదడులోని సమతుల్యతను నియంత్రించే భాగంలో సమస్యకు సూచన కావచ్చు.
ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని భయపడనక్కర్లేదు. కానీ ఈ సమస్యలు కొత్తగా మొదలైనా లేదా రోజురోజుకూ తీవ్రమవుతున్నా, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications