Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
షుగర్ పేషెంట్లకు ఏ నూనెలు బెస్ట్? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వస్తుంది. మనదేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిని వేధిస్తున్న ఒక తీవ్రమైన సమస్య ఇది. ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ పేషెంట్లు మన దేశంలో ఉన్నారు, అందుకే మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ అని కూడా పిలుస్తుంటారు. అయితే షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా,ఒకవేళ వచ్చినా దాన్ని కంట్రోల్ లో ఉంచాలన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
బ్లడ్ లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికి మందులతో పాటు మన లైఫ్ స్టైయిల్, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తినే కూరగాయలు, పప్పులు, పండ్ల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటామో మనం రోజూ వాడే వంట నూనె గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఎందుకంటే సరైన ఆయిల్ ఎంచుకోవడం ద్వారా షుగర్ ని అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది.

వంట నూనెలు శరీరానికి ఎందుకు ముఖ్యం
మనం తినే ఆహారంలో కొవ్వులు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఈ కొవ్వులు వంట నూనెల నుండే మన శరీరానికి అందుతాయి. ఇవి కేవలం శక్తిని ఇవ్వడమే కాకుండా విటమిన్లు A, D, E, K వంటివి శరీరంలో సరిగ్గా గ్రహించబడటానికి సహాయపడతాయి. గుండె, మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తికి, హార్మోన్ల సమతుల్యతకు కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. వంట నూనెలలో ముఖ్యంగా ఒమేగా-3, ఒమేగా-6 అనే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో వాపును తగ్గించి, షుగర్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
అయితే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటే.. వాపును ప్రేరేపించి, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఒమేగా-3 ఎక్కువగా ఉండే నూనెలను ఎంచుకోవడం తెలివైన పని.
షుగర్ పేషెంట్లకు ఇవి బెస్ట్ ఆయిల్స్
రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె): ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీని యాంటీఆక్సిడెంట్ గుణాలు చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
ఆలివ్ నూనె: ఇది ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వులతో పాటు మంచి కొవ్వులకు నిలయం. దీని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తాయి.
కొబ్బరి నూనె: ఇది ఆకలిని తగ్గించి, శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది.
స్వచ్ఛమైన నెయ్యి: మితమైన పరిమాణంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడటం మంచిది. మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే డాల్డా, వనస్పతి వంటి వాటికి దూరంగా ఉండాలి, అవి ప్రమాదకరం.
నువ్వుల నూనె: విటమిన్-ఈ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ నూనె వాపును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
వేరుశెనగ నూనె: ఇందులో ఉండే మంచి కొవ్వులు (MUFA, PUFA) చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్: ఇందులో కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉన్నాయి. విటమిన్-ఈ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తప్పక పాటించాల్సిన చిట్కాలు
రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులుగా గానుగ నూనెలను (Cold Pressed Oils) ఎంచుకోండి. రిఫైన్ చేసే ప్రక్రియలో నూనెలోని పోషకాలు నశిస్తాయి.
అధిక స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను వేయించడానికి వాడండి. తక్కువ స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను అధిక వేడికి గురిచేస్తే, అవి విషపూరితంగా మారి క్యాన్సర్ కు దారితీయవచ్చు.
ఆరోగ్యకరమైన నూనెలైనా సరే మితంగా వాడటం చాలా ముఖ్యం. రోజుకు 3-4 టీస్పూన్లకు మించి వాడకపోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications