Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
వాటర్ బాటిల్ ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా?
ఇంట్లో లేదా రూమ్ లోనో, ఆఫీసు టేబుల్ మీద, జిమ్ బ్యాగ్ లో, కారులో ఎక్కడ చూసినా మనతో పాటే ఉండేది వాటర్ బాటిల్. దాహం వేసినప్పుడల్లా ప్రాణం నిలిపే అమృతాన్ని అందించే ఆప్తమిత్రుడు అది. నీళ్లు అయిపోగానే మళ్లీ నింపేస్తాం. కొద్దిగా నీళ్లున్నా, వాటిని పారబోసి కొత్త నీళ్లు పడతాం. అయితే చాలామంది వాటర్ బాటిల్ ను నెలల తరబడి కలీన్ చేయరు. అయితే వాటర్ బాటిల్ ను కడిగేదెప్పుడు? పైకి తళతళా మెరుస్తున్న ఆ బాటిల్ లోపల కంటికి కనిపించని ఓ పెద్ద ప్రపంచమే దాగి ఉందని మీకు తెలుసా? అది మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారగలదని ఎప్పుడైనా ఆలోచించారా?
ఎందుకింత ప్రమాదం?
మనం రోజూ అదే బాటిల్ ను కడగకుండా వాడటం వల్ల, అది సూక్ష్మక్రిములకు స్వర్గధామంగా మారుతుంది. మనం బాటిల్ కు నోరు ఆనించి నీళ్లు తాగినప్పుడు మన నోటిలోని లాలాజలం, సూక్ష్మక్రిములు, మనం తిన్న ఆహారంలోని చిన్న చిన్న కణాలు బాటిల్ లోకి ప్రవేశిస్తాయి. బాటిల్ లోపల ఉండే తేమ, వెచ్చదనం ఈ బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వేగంగా పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఇది ఒకరకంగా చెప్పాలంటే సూక్ష్మక్రిముల సామ్రాజ్యమే
ఈ కలుషితమైన నీటిని తాగినప్పుడు ఆ క్రిములన్నీ నేరుగా మన శరీరంలోకి ప్రవేశించి, వాంతులు, విరేచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అందుకే, ఒకరి వాటర్ బాటిల్ మరొకరు వాడకూడదని, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారి బాటిల్స్ అస్సలు ముట్టుకోకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పరిశుభ్రతకు పక్కా ప్రణాళిక
ఈ ప్రమాదాన్ని నివారించడం చాలా సులభం. దానికి కావాల్సిందల్లా కాస్త శ్రద్ధ, సరైన శుభ్రత.
ప్రతిరోజూ శుభ్రం చేయండి: మీ వాటర్ బాటిల్‌ను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోండి.
సబ్బుతో కడగండి: బాటిల్ లో మిగిలిన పాత నీటిని పూర్తిగా పారబోయండి. కొంచెం గోరువెచ్చని నీటిలో, కొన్ని చుక్కల లిక్విడ్ సోప్ వేసి, బాటిల్ బ్రష్‌తో మూలమూలలా శుభ్రంగా కడగండి.
వాసన వస్తుంటే: కొన్నిసార్లు బాటిల్ నుండి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు, నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా తెల్ల వెనిగర్ కలిపి బాటిల్‌ను శుభ్రం చేయండి. వాటిలోని ఆమ్ల గుణాలు క్రిములను, దుర్వాసనను సమర్థవంతంగా దూరం చేస్తాయి.
పూర్తిగా ఆరబెట్టండి: కడిగిన తర్వాత బాటిల్‌ను బోర్లించి గాలికి లేదా ఎండలో పూర్తిగా ఆరనివ్వండి. తేమ లేనప్పుడు క్రిములు పెరిగే అవకాశం ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications