Latest Updates
-
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం
చెడు కొలెస్ట్రాల్ సమస్యకు పరిష్కారం మన వంటింట్లోనే!..100 ఏళ్లు మీ గుండె సేఫ్!
ఈమధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్న ఆరోగ్య సమస్యల్లో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. ఇది మన రక్తంలో నెమ్మదిగా పేరుకుపోయి, గుండె జబ్బుల రూపంలో ప్రాణాల మీదకు తెస్తుంది. ముఖ్యంగా భారతదేశంతో సహా దక్షిణాసియా దేశాల్లో ఈ సమస్య పెనుభూతంలా మారుతోందంటే ఆశ్చర్యం లేదు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం అత్యవసరం. ఎందుకంటే ఇది అధిక రక్తపోటు, శరీరంలో వాపులు వంటి సమస్యలను రెట్టింపు చేస్తుంది. ఇవి రెండూ గుండెపోటు ప్రమాదాన్ని పెంచేవే. అంతేకాకుండా అధిక LDL వల్ల శరీరం విటమిన్ డిని తయారు చేసుకోలేదు, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిలో కూడా సమస్యలు తలెత్తవచ్చు.
అసలు ఏమిటీ కొలెస్ట్రాల్? దానితో ఎందుకింత ప్రమాదం?
కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమైన ఒక కొవ్వు పదార్థమే. ఇందులో రెండు రకాలుంటాయి..ఒకటి మనకు మేలు చేసే 'మంచి కొలెస్ట్రాల్' (HDL), రెండోది మన పాలిట విలన్లా మారే చెడు కొలెస్ట్రాల్ (LDL). మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచితే, ఈ చెడు కొలెస్ట్రాల్ మాత్రం రక్తనాళాల్లో పాచిలా పేరుకుపోతుంది.

ఒక పైపులో మురికి పేరుకుపోతే నీటి ప్రవాహం ఎలా నెమ్మదిస్తుందో, అలాగే మన రక్తనాళాల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీన్నే ప్లాక్ అంటారు. ఇది పెరిగేకొద్దీ రక్తనాళాలు సన్నబడి, గుండెకు అవసరమైన రక్తం, ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. ఇదే పరిస్థితి గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్
చెడు కొలెస్ట్రాల్ సమస్యకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంది. సరైన ఆహారంతో ఈ శత్రువును మనం సులభంగా జయించవచ్చు.
పచ్చని కవచాలు: బ్రోకలీ, క్యారెట్లు, పాలకూర వంటి కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి సహజసిద్ధంగా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
ఆరోగ్యకరమైన గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే వాల్నట్స్, బాదం వంటివి గుండెకు మంచి మిత్రులు.
ఫైబర్ శక్తి: పప్పుధాన్యాలు, ఓట్స్ వంటివి రోజూ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది.
చిన్నవే అయినా అద్భుతాలు: రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. అలాగే అల్లం శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
