Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కొలెస్ట్రాల్ సమస్యకు దివ్యౌషదం..ఈ కూరగాయ తింటే చెరకు రసం పిండినట్లుగా కొలెస్ట్రాల్ ను పిండేస్తది
ప్రస్తుతం చాలామందిని ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్య అధిక కొలెస్ట్రాల్. ఇది రక్తనాలాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డుగోడగా మారుతుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యలు దాడి చేస్తాయి. దీనంతటికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైయిల్, మన ఆహార అలవాట్లు మారడమే. ఏది పడితే అది తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం..దీంతో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్యకు సంజీవని మీ వంటగదిలోనే ఉందని మీకు తెలుసా?
చాలామంది చూడగానే ముఖం తిప్పేసుకునే కూరగాయల్లో సొరకాయ ఒకటి. కొంతమంది ఈ పేరు వింటేనే వేరే కూర లేదా అబ్బా సొరకాయ అని డల్ అయిపోతుంటారు. వాస్తవానికి సొరకాయ అందించే ప్రయోజనాలు తెలిస్తే ఆ మాట మీ నోట రాదు. ఇదేం కూర అని ఛీత్కరించుకునే ఈ సొరకాయ మన శరీరానికి ఒక ఔషధ గని. చెడు కొలెస్ట్రాల్ ను సిరల నుండి చెరకు రసం పిండినట్లుగా పిండి బయటకు పంపగల శక్తి దీనికి ఉంది. ప్రతి రక్తపు చుక్కను శుభ్రపరిచే అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి.

సొరకాయతో కొలెస్ట్రాల్ కు ఎలా చెక్ పెడుతుంది
సొరకాయలో సమృద్ధిగా ఉండే కరిగే ఫైబర్..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రేగుల్లోని కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుని దాన్ని శరీరం నుండి బయటకు పంపుతుంది.
సొరకాయలో కొవ్వు లేదా ఫ్యాట్ దాదాపుగా ఉండదు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అధిక బరువు కారణంగా పెరిగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.
సొరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. విటమిన్ C ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి రక్తనాళాల గోడలను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది.
సొరకాయ శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. ఆరోగ్యకరమైన కాలేయం కొలెస్ట్రాల్ లెవల్స్ ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.

ఎలా, ఎంత తీసుకోవాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రతిరోజూ 100 నుండి 200 గ్రాముల సొరకాయను వండుకుని తినడం ఎంతో మేలు చేస్తుంది. దీనిని కూర, పులుసు, సూప్ లేదా రసం రూపంలో తీసుకోవచ్చు. సొరకాయ రసం తాగాలనుకుంటే అది కచ్చితంగా తాజాగా ఉండాలి. పరగడుపున తాగడం వల్ల కొందరిలో గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలు రావచ్చు. అత్యంత ముఖ్యంగా రసం తాగే ముందు కొద్దిగా రుచి చూడండి. చేదుగా ఉంటే అస్సలు తాగవద్దు, అది ఆరోగ్యానికి హానికరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications