Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Heat Wave: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు, వడదెబ్బ నుండి ఇలా జాగ్రత్తగా ఉండండి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది పదిన్నర అయిందంటే ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటిపట్టునే ఉన్న వారిని కూడా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తొంది.
అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాల్లో కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పుల పట్ల రాష్ట్రాల వాతావరణ శాఖలు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో 98 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో రామగుండం, జయశంకర్ భూపాలపల్లి, సింగరేణి, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వడదెబ్బల బారిన పడకుండా ఉండేందుకు ఏయే పనులు చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వడదెబ్బల బారిన పడొద్దంటే ఇలా చేయండి:
1. హైడ్రేటెడ్‌గా ఉండాలి:
హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి. ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం ఎక్కువగా నీరు కోల్పోతుంది కాబట్టి దానిని భర్తీ చేసేందుకు నీరు తాగాలి. అలాగే వేసవికాలంలో లభించే పుచ్చకాయ లాంటి పండ్లు తినడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండొచ్చు.
2. వదులైన దుస్తులు ధరించాలి:
వేసవికాలంలో వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుంటాయి. అలాగే లేత రంగు దుస్తులు వేడిమిని ఆకట్టుకోవు.
3. ఆరుబయట పని చేస్తే నీడ పట్టున ఉండాలి:
వీలైనంత వరకు నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి. నేరుగా సూర్య కిరణాలు పడటాన్ని నివారించాలి.
4. తేలికపాటి భోజనం తీసుకోవాలి:
ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. నూనె ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు, వేపుళ్లు, ఫ్రైలు, సాల్టెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.

ఈ పనులు అస్సలే చేయొద్దు:
1. ఎండలో బయటకు వెళ్లొద్దు:
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. అత్యవసరం అయితే తప్పా పట్ట పగలు బయటకు వెళ్లొద్దు.
2. మద్యం సేవించొద్దు:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. వేసవిలో పగటి పూట ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.
3. పార్క్ చేసిన కార్లలో ఉండొద్దు:
ఎండలో కార్లను పార్క్ చేసి అందులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఎట్టిపరిస్థితుల్లో ఉంచొద్దు. ఎండ వేడిమికి కారు లోపల వేడెక్కి పోతుంది. ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
4. సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు:
SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications