Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Mifepristone: మిఫిప్రిస్టోన్ అంటే ఏంటి? అబార్షన్ మాత్రల వాడకంపై అమెరికా కోర్టుల భిన్న తీర్పులు
మిఫిప్రిస్టోన్ వాడకంపై అమెరికాలో సందిగ్ధత నెలకొంది. గర్భనిరోధక మాత్రలపై రెండు కోర్టులు భిన్న తీర్పులు ఇవ్వడంతో అసలు వాడాలా వద్దా అనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. టెక్సాస్ కోర్టు మిఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్లను బ్యాన్ చేయగా.. వాషింగ్టన్ కోర్టు మాత్రం 13 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచడానికి అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది.

అమెరికాలో అబార్షన్ పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అభివృద్ధి చెందిన దేశంలో అబార్షన్ చట్టరీత్యా నేరం. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. అయితే అమెరికాలో అబార్షన్ల కోసం ఎక్కువగా మిఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం ఈ పిల్స్ వాడకంపై టెక్సాస్ కోర్టు, వాషింగ్టన్ కోర్టులు భిన్న తీర్పులు వెలువరించాయి. ఒక కోర్టు వాడకంపై నిషేధం విధించగా, మరో కోర్టు 12 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చింది. మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడకంపై గత ఏడాది కాలంగా అమెరికాలో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. కోర్టుల్లో వాదనలు కూడా జరుగుతూనే ఉన్నాయి.
మిఫిప్రిస్టోన్ పిల్స్ ఎలా పనిచేస్తాయి:
మిఫిప్రిస్టోన్ పిల్స్ ను ఆర్‌యూ 486 అని కూడా పిలుస్తారు. శృంగారం చేసిన తర్వాత మిఫిప్రిస్టోన్ మాత్రలు వేసుకుంటారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది. ఇక మిసోప్రోస్టాల్ అనే మరో మాత్రను కూడా కొందరు వేసుకుంటారు. సంభోగం తర్వాత 48 గంటలు దాటిన తర్వాత ఈ మాత్రను వాడుతుంటారు. దీని వల్ల అండ విచ్ఛిత్తి జరిగి బ్లీడింగ్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
మిఫిప్రిస్టోన్ పిల్స్‌ను ఎప్పుడు ఆమోదించారు:
మిఫిస్ట్రాన్, మిసోప్రోస్టోల్‌కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2000 సంవత్సరంలో అనుమతి ఇచ్చాయి. గర్భం వచ్చిన తర్వాత 10 వారాల వ్యవధి వరకు ఈ మిఫిప్రిస్టోన్ మాత్రలను వాడొచ్చు. ఒకవేళ ఆ సమయం దాటితే మాత్రం వాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధితో గర్భాన్ని తొలగిస్తారు.
పెరిగిన మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడకం:
అమెరికాలో 2020లో సుమారు 10 లక్షల మంది మహిళలు అబార్షన్ చేయించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం దాంట్లో దాదాపు 53 శాతం మంది మిఫిప్రిస్టోన్ పిల్స్‌తోనే గర్భాన్ని తొలగించుకున్నారు. ఈ పిల్స్ వాడకం 2008లో 17 శాతం ఉండేది. 2017 నాటికి మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడకం 39 శాతానికి పెరిగింది.
మిఫిప్రిస్టోన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా:
మిఫిప్రిస్టోన్ పిల్స్ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. వీటి వాడకం వల్ల తిమ్మిరి, దీర్ఘకాలిక భారీ రక్తస్రావం జరగొచ్చు. కొంతమందిలో వికారం, జ్వరం, వాంతులు కూడా ఉండవచ్చు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మిఫిప్రిస్టోన్ పిల్స్ తీసుకునే 100 మందిలో ఒకరికి శస్త్రచికిత్స అవసరమయ్యే భారీ రక్తస్రావం జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
