కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే

మనశరీంలో కిడ్నీలు ముఖ్యమైన అవయువాలు. మనం తిన్న ఆహారం నుంచి వ్యర్థాలను బయటకు పంపడం, రక్తాన్ని శుద్ధి చేయడం కిడ్నీల పని. ఇటీవల కాలంలో చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమందికి అయితే విషయం సీరియస్ అయ్యేదాకా కూడా దీని గురించి తెలియట్లేదు.

లోపల కిడ్నీలు దెబ్బతింటున్నప్పటికీ చాలాసందర్భాల్లో బయటకి ఎటువంటి నొప్పి ఉండకపోవచ్చని ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జవజాల మనోజ్ణ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. అయితే మన శరీరం కొన్ని సూచనల ద్వారా ముందస్తు హెచ్చరికలు పంపుతుందని, మీలో కొన్ని లక్షణాలు కనబడితే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదని ఆమె సూచించారు.

Dr Manogna Explain Early Warning Signs of Kidney Failure You Should Never Ignore

కిడ్నీలో సమస్య ఉన్నప్పుడు కనబడే లక్షణాలు

యూరిన్ లో మార్పులు

కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు ఫస్ట్ కనబడే మార్పు మూత్రంలోనే. యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం లేదా పెరగడం. అంటే మూత్రం రావడం బాగా తగ్గిపోవడం లేదా పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం. అదేవిధంగా, మూత్రంలో రక్తం పడటం లేదా సబ్బు నీళ్ల మాదిరి మూత్రంలో ఎక్కువ నురగ రావడం అనేది కిడ్నీ పాడవుతుందనడానికి సంకేతంగా అర్థం చేసుకోవచ్చని డాక్టర్ మనోజ్ణ చెప్పారు.

శరీరంలోని వివిధ భాగాల్లో వాపులు

కిడ్నీలు సక్రమంగా పనిచేయనప్పుడు శరీరంలోని అదనపు నీరు బయటకు పోదు. దీంతో కళ్ల కింద ఉబ్బినట్లు అవడం, పాదాలు, చీలమండల దగ్గర వాపులు కనబడతాయని డాక్టర్ మనోజ్ణ తెలిపారు.

విపరీతమైన అలసట

చిన్న చిన్న పనులకే అలసట రాస్తుంది. శరీరంలోని వ్యార్థాలు పెరుకుపోవడం వల్ల ఇలాంటి నీరసం వస్తుంది.

గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది?గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది?

ఆకలి తగ్గిపోవడం

బ్లడ్ లో వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల ఏదీ తినాలనిపించదు. తరచుగా వికారం, వాంతి వచ్చినట్లు అనిపించడం కిడ్నీ సమస్యలకు ఒక ముఖ్య లక్షణం.

బీపీ పెరగడం

నార్మల్ గా ఉండే ఒక్కసారిగా పెరిగిపోయినా, కంట్రోల్ లోకి రాకపోయినా అది కిడ్నీల ఫెయిల్యూర్ కి సంకేతం అవచ్చు.

వీరు మాత్రం హై అలర్ట్

ముఖ్యంగా షుగర్ లేదా బీపీ ఉన్నవాళ్లు కిడ్నీ పనితీరుని 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే కిడ్నీల సంబంధిత వ్యాధిలో ప్రారంభ దశలో లక్షణాలు చాలా తక్కువగా కనబడతాయి. కాబట్టి లక్షణాలు కనబడేంతవరకు ఆగకుండా అవసరాన్ని బట్టి కిడ్నీ పంక్షన్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, October 20, 2026, 18:35 [IST]
Desktop Bottom Promotion